సర్కారు దవాఖానాలపై నమ్మకం ఏర్పడింది
Published Thu, Sep 1 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
బీబీనగర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుండడంతో ప్రజలకు సర్కారీ దవాఖానాలపై నమ్మకం పెరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బీబీనగర్‌లోని నిమ్స్ యూనివర్సిటీ భవనంలోని ఎమర్జెన్సీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మం ది రోగులు వైద్యం చేయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సేవలు అందించేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రసు ్తతం నిమ్స్‌లో కొనసాగుతున్న ఐదు వి భాగాల వైద్య సేవలతో పాటు డిసెంబర్‌లోపు మరో మూడు విభాగాలకు చెందిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి ఇన్ పెషెంట్‌ను ప్రారంభించేలా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.
ట్రయల్ రన్‌ను నిర్వహించిన మంత్రి
మిషన్ భగీరథలో భాగంగా బీబీనగర్ రైల్వే గేట్ సమీపంలోని ఏర్పాటు చేసిన ట్యాంక్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అయితే బుధవారం బీబీనగర్‌కు వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి జలాల ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అంది స్తున్నారని అన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, జడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్‌లు స్వరుపారాణి, ఇస్తారి, అంజయ్య, ఎంపీటీసీలు లింగయ్యగౌడ్, వెంకటేశ్‌గౌడ్, మన్నె బాల్‌రాజు, చంద్రశేఖర్, రవి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, గాదె నరేందర్‌రెడ్డి, వెంకటకిషన్, అమరేందర్, మండల నాయకులు అశోక్, రాములు పాల్గొన్నారు.
ప్రతి పక్షాలు రాద్ధాంతాలు చేస్తున్నాయి...
నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదనలు పంపినప్పటికీ ప్రతి పక్షాలు కావాలనే రాద్ధాం తాలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. ఎయిమ్స్ కోసం కేం ద్రానికి ప్రతి పాదనలు పం పగా వచ్చే బడ్జెట్‌లో పెడతామని కేంద్ర మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయ న తెలిపారు. ఇవేవి తెలుసుకోకుండా ప్ర తిపక్ష నాయకులు అర్థంలేని మాటా లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement