
ప్రోత్సహించడంలో మీకు మీరే సాటి!
సెల్ఫ్‌చెక్
చిన్న పిల్లలను తిడుతుంటే వారికి కోపం వస్తుంది, అది అలాగే కొనసాగిస్తే అభద్రతాభావం నెలకొంటుంది. సొంతవారిపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇల్లే కాదు, ఆఫీసూ అంతే. ఉద్యోగుల మీద మేనేజర్ చీటికిమాటికీ చిర్రుబుర్రులాడుతుంటే వారిపై వారు విశ్వాసాన్ని కోల్పోతారు. ఆఫీసులో మీరు సీనియర్ అయితే సాటి ఉద్యోగులను ప్రోత్సహించే బాధ్యత మీది కూడానూ. తోటివారిని ప్రోత్సహించటం వల్ల వ్యక్తిగతంగా వారు అభివృద్ధి సాధిస్తారు. మీలో ప్రోత్సహించే గుణం ఉందా?
1. తోటి ఉద్యోగులు ఇచ్చే సలహాలు, సూచనల గురించి ఆలోచిస్తారు. అవి ఆచరణయోగ్యంగా ఉంటే అవలంబిస్తారు. ఎలాంటి ఇగోలకు తావివ్వరు.
ఎ. అవును బి. కాదు
2. విజయాలు సాధించటం వల్ల ఎంత పేరొస్తుందో వివరిస్తారు. వారిలో ప్రేరణ కలిగిస్తారు.
ఎ. అవును బి. కాదు
3. గోల్స్ ఎంత ముఖ్యమైనవో, ఎంతమేర కష్టపడాలో చెప్తారు.
ఎ. అవును బి. కాదు
4. ఇంతకు ముందు విజయాల్లో వారి పాత్ర ఎంత ఉందో వివరిస్తారు. వారి సహకారం కావాలని అడుగుతారు.
ఎ. అవును బి. కాదు
5. అభినందన ద్వారా స్ఫూర్తి కలుగుతుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
6. ఉద్యోగస్తుల్లో అంతర్గతంగా ఉన్న స్కిల్స్‌ను బయటకు తీయటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. ఉద్యోగుల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తారు. బహుమతులు ఇచ్చి ప్రోత్సíß స్తారు.
ఎ. అవును బి. కాదు
8. పొరపాటును తెలియపరుస్తారే కాని అవమానాలకు గురిచేయరు.
ఎ. అవును బి. కాదు
9. ఆఫీసు వాతావరణంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వరు. టాలెంట్ ఉన్నవాళ్లని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు.
ఎ. అవును బి. కాదు
10. ఉద్యోగుల సందేహాలను తీర్చటానికి ముందుంటారు. మీ అనుభవాన్ని వారితో పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు మీ ఉద్యోగులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. వారిలోని సామర్థ్యాలు వెలికితీయటానికి ప్రయత్నిస్తారు. మీలోని ఈ లక్షణాన్ని కేవలం ఆఫీసుకే పరిమితం చేయరు. మీ కుటుంబసభ్యులు, తెలిసిన వారినందరినీ మంచి పనులు చేయటానికి ప్రోత్సహిస్తారు.