encouraging
-
ఇండిగో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,998 కోట్లను అధిగమించింది. వెరసి వరుసగా ఐదో త్రైమాసికంలోనూ లాభదాయక పనితీరును ప్రదర్శించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,423 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 15,410 కోట్ల నుంచి రూ. 20,062 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 15.4 శాతం నికర లాభ మార్జిన్లు ఆర్జించినట్లు ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. వరుసగా ఐదు క్వార్టర్లపాటు లాభాలు సాధించడంతో కోవిడ్–19 కారణంగా నమోదైన నష్టాల నుంచి రికవర్ అయినట్లు తెలియజేశారు. సానుకూల నెట్‌వర్త్‌కు చేరినట్లు వెల్లడించారు. ఈ క్యూ3లో ప్రయాణికుల టికెట్ ఆదాయం 30 శాతంపైగా జంప్‌చేసి రూ. 17,157 కోట్లను తాకగా.. అనుబంధ విభాగాల నుంచి 24 శాతం అధికంగా రూ. 1,760 కోట్లు లభించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 3,127 వద్ద ముగిసింది. -
బీజేపీకి జై..సూచీలు రయ్
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ‘జై’ కొట్టడంతో సోమవారం స్టాక్ సూచీలు ఏకంగా రెండు శాతం ర్యాలీ చేశాయి. ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదు ఉత్సాహాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు దిగువకు చేరుకుంది. ఫలితంగా సూచీలు 18 నెలల్లో (మే 20, 2022 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,384 పాయింట్లు పెరిగి 68,865 ముగిసింది. నిఫ్టీ 419 పాయింట్లు బలపడి 20,687 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ట ముగింపు. ట్రేడింగ్‌లోనూ జీవితకాల గరిష్టాల నమోదు జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 945 పాయింట్లు పెరిగి 68,435 వద్ద, నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 20,602 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మీడియా తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరమైన లాభాలతో ట్రేడయ్యా యి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడం ఓ దశలో సెన్సెక్స్ 1,437 పాయి ంట్లు దూసుకెళ్లి 53 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 68,918 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 435 పాయింట్లు ఎగసి 20,703 వద్ద రెండో రోజూ రికార్డు ర్యాలీ చేసింది. ► సూచీల రికార్డు ర్యాలీని అందిపుచ్చుకున్న అదానీ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 9%, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 7%, అదానీ పోర్ట్స్, ఏసీసీ 6%, అదానీ పవర్, అదానీ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 4%, ఎన్డీటీవీ 3%, అదానీ విల్మార్ 2% చొప్పున లాభపడ్డాయి. మొత్తం పది కంపెనీల షేర్లూ రాణించడంతో ఇంట్రాడేలో గ్రూప్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 31 తర్వాత తొలిసారి రూ.12 లక్షల కోట్లను తాకింది. చివరికి రూ.11.95 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ►ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఐసీఐసీఐ బ్యాంక్ 5%, ఎస్బీఐ 4%, కోటక్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 3% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఏ యూ బ్యాంక్‌లు 2%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు ఒకశాతం పెరిగాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 91 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 46,484 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ రెండుశాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.81 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ. 343.48 లక్షల కోట్లకు చేరింది. కాగా అయిదు రోజుల ర్యాలీతో బీఎస్ఈలో రూ.14.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు మెప్పించడంతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగొచ్చు. రికార్డు ర్యాలీ నేపథ్యంలో స్థిరీకరణ జరిగితే నిఫ్టీకి 20,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
లెక్కల్లో జీరో స్కోర్.. ఇతర పేరెంట్స్‌కు స్ఫూర్తినిస్తున్న తల్లి సందేశం
పిల్లలు పరీక్షల సమయంలోనూ, వాటి ఫలితాలు వచ్చే సమయంలోనూ తెగ ఆందోళన చెందుతుంటారు. మంచి మార్కులకు రాకపోతే తల్లిదండ్రులతో తన్నులు తప్పవని భావిస్తుంటారు. అలాగే తక్కువ మార్కులు వస్తే టీచర్లు తిడతారని ఆందోళన చెందుతుంటారు. మార్కులు ఎలా ఉన్నా విద్యార్థులు తమ ప్రోగ్రస్ రిపోర్టును తల్లిదండ్రులకు చూపించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొందరు విద్యార్థులు ప్రోగ్రస్ రిపోర్టులో మార్కులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు తమ ప్రోగ్రస్ రిపోర్టును నిజాయితీగా తల్లిదండ్రులకు చూపిస్తారు. తాజాగా ఇదే అంశానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియా ప్లాట్ఫారం X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. దీనిని (@zaibannn) అనే పేరు కలిగిన అకౌంట్లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘నా 6వ తరగతి పాత నోట్‌బుక్ దొరికింది. ఇది చూశాక నాకు స్కూలు రోజుల్లో మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయన్న విషయం మరోమారు గుర్తుకు వచ్చింది. అయితే అప్పుడు మా అమ్మ స్కోరు తక్కువ వచ్చిన ప్రతీ టెస్టులో పాజిటివ్ మెసేజ్ రాసేది’ అని రాశారు. ఆ పోస్టులోని వివరాల ప్రకారం ఆమె తల్లి మార్కులు రాసివున్న నోట్ బుక్‌లో సైన్ చేయడమే కాకుండా మెసేజ్ కూడా రాయడాన్ని మనం గమనించవచ్చు. మొదటి ఫొటోలో ‘ఇలాంటి రిజల్టు రావడానికి ధైర్యం కావాలి’ అని రాశారు. రెండవ ఫొటోలోనూ తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆమె తల్లి అలానే రాసింది. వీటిని కలిపి చూసినప్పుడు తల్లిదండ్రులంతా పిల్లలతో ఇలానే వ్యవహరించాలని, అప్పుడేవారు నిరాశ చెందకుండా, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తారని దీనిని పోస్టు చేసిన యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు found my grade 6 math notebook and love how precious mother was signing every bad test with an encouraging note for me! pic.twitter.com/AEJc3tUQon — zainab (Taylor’s version) (@zaibannn) August 25, 2023 -
సింఫనీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఎయిర్‌కూలర్లు, ఇతర అప్లయెన్సెస్ దిగ్గజం సింఫనీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 86 శాతం జంప్‌చేసి రూ. 39 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 21 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతంపైగా ఎగసి రూ. 277 కోట్లను తాకింది. దేశీ విభాగం నుంచి రూ. 198 కోట్లు లభించింది. గతేడాది క్యూ3లో రూ. 205 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 32 శాతం పెరిగి రూ. 243 కోట్లకు చేరాయి. కాగా.. షేరుకి రూ. 2,000 ధర మించకుండా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సింఫనీ షేరు బీఎస్ఈలో 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,047 వద్ద ముగిసింది. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రికార్డ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో భారీ రుణ వృద్ధి నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 2,973 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌కు ఇది అత్యధికంకాగా.. నికర వడ్డీ ఆదాయం 28 శాతం ఎగసి రూ. 7,435 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా 3.14 మిలియన్ల క్రెడిట్ కస్టమర్ల(రుణగ్రహీతలు)ను జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 7.84 మిలియన్ల కస్టమర్లను కొత్తగా పొందినట్లు తెలియజేసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.73 శాతం నుంచి 1.14 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.41 శాతానికి దిగివచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 5,770 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ ప్లస్... క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 34 శాతం ఎగసి రూ. 690 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 514 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 11,482 కోట్లయ్యింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.04 శాతం నుంచి 9.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 2.35 శాతం నుంచి 2.72 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా 2 శాతం బలపడి రూ. 4,395 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 1,556 కోట్లయ్యింది. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో మొత్తం ప్రొవిజన్లు 11 శాతం అధికమై రూ. 2,598 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.47 శాతంగా నమోదైంది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.1 శాతం నీరసించి 3.03 శాతానికి చేరాయి. రూ. 2,732 కోట్లమేర తాజా స్లిప్పేజీలు నమోదయ్యాయి. రూ. 5,400 కోట్ల విలువైన 34 మొండి ఖాతాలను గుర్తించినట్లు బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిలో తొలి దశకింద జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రూ. 1,200 కోట్ల విలువగల 5 ఖాతాలను బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. -
ఉగ్ర ప్రోత్సాహకులపై చర్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది. పార్లమెంట్‌కు అవమానకరం: కాంగ్రెస్ కశ్మీర్లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జవాన్లతో మోదీ దీపావళి జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు. -
డిజిటల్ నైపుణ్యాలుంటే ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: అమెరికా అవకాశాలు తగ్గి, అట్రిషన్ రేటు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల వలసలను తగ్గించేందుకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ విభాగంలో నైపుణ్యాలున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలిచ్చేలా ప్రత్యేక పథకాల్లాంటివి కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గతేడాది ఆర్థిక ఫలి తాల సందర్భంగా ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో సంస్థ సీవోవో ప్రవీణ్ రావు ఈ విషయాలు వెల్లడించారు. మార్చి త్రైమాసికంలో ఉద్యోగుల వలస 17.8 శాతం నుంచి 18.3 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 3–5 ఏళ్ల అనుభవం ఉన్న వారు, ప్రధానంగా అమెరికాలో ఆన్సైట్ అవకాశాల కోసమే ఆగిన వారు ఇందులో ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కఠినతర వీసా నిబంధనల కారణంగా అమెరికా అవకాశాలు తగ్గిపోవడంతో వారు ఇతర సంస్థల వైపు మళ్లారని ప్రవీణ్ రావు చెప్పారు. మరోవైపు, అమెరికాలో ఎక్కువగా స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, దీనివల్ల వీసాలపరమైన సమస్యలు కొంత అధిగ మించగలుగుతున్నామని ఆయన వివరించారు. -
ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం
వరంగల్ సిటీ : రాష్ట్రంలో అన్ని వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రాష్ట్ర, వరంగల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కటకం పెంటయ్య, తెలంగాణ కాటన్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లలోని అడ్తి,వ్యాపారుల డిపాజిట్లతో పాటు భారీగా లైసెన్సుల రెన్యూవల్ ఫీజులను పెంచడంతో రాష్ట్రంలోని అన్ని చాంబర్ ఆఫ్ కామర్స్‌ల ఆధ్వర్యంలో నూతన జీవో.58ను సవరించాలని కోరుతూ అడ్తి, వ్యాపారులు నిరసన ర్యాలిలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పలుమార్లు మార్కెట్ శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. మూడు నెలల అనంతరం ఎట్టకేలకు రా ష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అనుమతితో జీవో.నం. 58ను సవరిస్తూ నూతనంగా జీఓ.నం 39ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. నూతన జీఓలో అడ్తి, వ్యాపారులకు అనేక అనుకూల, సానుకూల రాయితీలు కల్పించడంతో శుక్రవారం వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ అధ్యక్షులు, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటకం పెంటయ్య, బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కూరగాయలు, పండ్ల వ్యాపారుల బ్యాంకు గ్యారంటీని రూ.3లక్షల నుంచి రూ.25వేలకు, కోటి టర్నోవర్ కలిగిన రూ.5 లక్షల బ్యాంకు గ్యారంటీని రూ.50వేలకు, రూ.5కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వారికి రూ.లక్షకు తగ్గించడం హర్షనీయమని చెప్పారు. అదే విధంగా ఇతర లైసెన్సుల రెన్యూవల్స్ ఫీజులను కూడా సంతృప్తి పడే విధంగా తగ్గించారని వివరించారు. అనంతరం చాంబర్ ప్రధాన కార్యదర్శి గోరంటాల యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షలు కంది రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దుగ్యాల గోపాల్‌రావులు పాత, కొత్త జీఓల సవరణలు వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. జీఓ సవరణకు సహకరించిన కొండా దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఛాంబర్ ముఖ్య ప్రతినిధులు నాగమళ్ల పూర్ణచందర్రావు, రాయిశెట్టి సత్యనా రా యణ, అల్లె సంపత్, వీరారావు, ఎస్.భిక్షపతి, కరాణి రాజేష్, కూరగాయల సంఘం నుంచి బేతి అశోక్, జూల రాజేందర్, పండ్ల మార్కెట్ అసోసియేషన్ నుంచి సాంబయ్య, గుమస్తాల సంఘం నాయకుడు ఇనుముల మల్లేషం పాల్గొన్నారు. -
మూడేళ్ల కృషికి దక్కిన ఫలితం
సాక్షి, న్యూడిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గుర్తింపు దక్కడం తమ సంస్కరణలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ వ్యాఖ్యానించారు. మూడీస్ అప్‌గ్రేడ్ అనంతరం కేంద్రమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను స్వాగతించిన జైట్లీ ఈ అప్‌గ్రేడ్ లేట్‌గా ఇచ్చిందన్నారు. అయినా 13సంవతర్సాల తర్వాత ఇండియాకు బీఏఏ 2 ర్యాంక్ అప్ గ్రేడ్ రావడం సంతోషాన్నిస్తోందన్నారు. జీఎస్టీ అమలును ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల అడుగుగా అందరూ గుర్తిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణలో భారతదేశం పురోగమిస్తోంది.ఇక తమ దృష్టి అంతా ఇన్ఫ్రా సంస్కరణలపై ఉండనుందన్నారు. గత మూడేళ్లుగా నిర్మాణ రంగం కీలక రంగంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ మార్గంలో నడుస్తోంది..భారతదేశం సంస్కరణల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్న పలువురు ఇప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకోవాలన్నారు. మూడు సంవత్సరాల్లో తాము చేపట్టిన సంస్కరణలు వేగవంతమైన పథం పెరుగుదలకు దారితీశాయని.. అయితే మూడీ గుర్తింపు ఆలస్యంగా లభించిందని పేర్కొన్నారు. అలాగే రేటింగ్స్‌కు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని జైట్లీ స్పష్టం చేశారు. -
ప్రోత్సహించడంలో మీకు మీరే సాటి!
సెల్ఫ్‌చెక్ చిన్న పిల్లలను తిడుతుంటే వారికి కోపం వస్తుంది, అది అలాగే కొనసాగిస్తే అభద్రతాభావం నెలకొంటుంది. సొంతవారిపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇల్లే కాదు, ఆఫీసూ అంతే. ఉద్యోగుల మీద మేనేజర్ చీటికిమాటికీ చిర్రుబుర్రులాడుతుంటే వారిపై వారు విశ్వాసాన్ని కోల్పోతారు. ఆఫీసులో మీరు సీనియర్ అయితే సాటి ఉద్యోగులను ప్రోత్సహించే బాధ్యత మీది కూడానూ. తోటివారిని ప్రోత్సహించటం వల్ల వ్యక్తిగతంగా వారు అభివృద్ధి సాధిస్తారు. మీలో ప్రోత్సహించే గుణం ఉందా? 1. తోటి ఉద్యోగులు ఇచ్చే సలహాలు, సూచనల గురించి ఆలోచిస్తారు. అవి ఆచరణయోగ్యంగా ఉంటే అవలంబిస్తారు. ఎలాంటి ఇగోలకు తావివ్వరు. ఎ. అవును బి. కాదు 2. విజయాలు సాధించటం వల్ల ఎంత పేరొస్తుందో వివరిస్తారు. వారిలో ప్రేరణ కలిగిస్తారు. ఎ. అవును బి. కాదు 3. గోల్స్ ఎంత ముఖ్యమైనవో, ఎంతమేర కష్టపడాలో చెప్తారు. ఎ. అవును బి. కాదు 4. ఇంతకు ముందు విజయాల్లో వారి పాత్ర ఎంత ఉందో వివరిస్తారు. వారి సహకారం కావాలని అడుగుతారు. ఎ. అవును బి. కాదు 5. అభినందన ద్వారా స్ఫూర్తి కలుగుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. ఉద్యోగస్తుల్లో అంతర్గతంగా ఉన్న స్కిల్స్‌ను బయటకు తీయటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఉద్యోగుల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తారు. బహుమతులు ఇచ్చి ప్రోత్సíß స్తారు. ఎ. అవును బి. కాదు 8. పొరపాటును తెలియపరుస్తారే కాని అవమానాలకు గురిచేయరు. ఎ. అవును బి. కాదు 9. ఆఫీసు వాతావరణంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వరు. టాలెంట్ ఉన్నవాళ్లని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు 10. ఉద్యోగుల సందేహాలను తీర్చటానికి ముందుంటారు. మీ అనుభవాన్ని వారితో పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు మీ ఉద్యోగులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. వారిలోని సామర్థ్యాలు వెలికితీయటానికి ప్రయత్నిస్తారు. మీలోని ఈ లక్షణాన్ని కేవలం ఆఫీసుకే పరిమితం చేయరు. మీ కుటుంబసభ్యులు, తెలిసిన వారినందరినీ మంచి పనులు చేయటానికి ప్రోత్సహిస్తారు. -
ఉగ్రవాదులను కీర్తించడం మానండి
-
ఉగ్రవాదులను కీర్తించడం మానండి
♦ పాకిస్తాన్‌కు భారత్ స్పష్టీకరణ ♦ సార్క్ సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగం ఇస్లామాబాద్/న్యూఢిల్లీ : ఉగ్రవాదులను కీర్తించడం, ఉగ్ర సంస్థలను ప్రోత్సహించడం మానుకోవాలని పాకిస్తాన్‌కు భారత్ విస్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకుని, వాటిని ఒంటరిని చేయాలంటూ 7వ సార్క్ దేశాల హోంమంత్రుల సదస్సులో తన వాణి వినిపించింది. గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ సదస్సులో భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. పాక్ చర్యల్ని తూర్పారబట్టారు. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అని విడిగా లేవని, ఉగ్ర చర్యల్ని కంటితుడుపు చర్యగా ఖండించకూడదని పేర్కొన్నారు. ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులుగానో లేదా అమరవీరులుగానో కీర్తించకూడదన్నారు. భారతదేశానికో, సార్క్ సభ్యులకో తానీ సందేశం ఇవ్వడంలేదని, ప్రపంచ మానవాళి కోసం కోరుతున్నానని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాది బుర్హాన్ వాని భారత దళాలు ఎన్కౌంటర్ చేసిన తర్వాత అతనిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీర్తించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ.. ఉగ్రవాదాన్ని ఎవరు సమర్థించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్ర చర్యలకు దక్షిణాసియా ఎక్కువ ప్రభావితం అవుతోందన్న రాజ్‌నాథ్.. పఠాన్‌కోట్, ఢాకా, కాబూల్ దాడులను ప్రస్తావించారు. ఆతిథ్య దేశ ప్రధాని షరీఫ్, హోంమంత్రి చౌధరి నిసార్ అలీ ఖాన్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని కేవలం ఖండించడాన్ని రాజ్‌నాథ్ తప్పుబట్టారు. ఖండిస్తే సరిపోదని, దానిని తుడిచిపేట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉగ్రవాదం అణిచివేతపై సార్క్ ప్రాంతీయ సదస్సు, అదనపు ప్రోటోకాల్ తీర్మానాలను అమలు చేయాలని, సంయుక్త పోరాటానికి ఇదెంతో కీలకమని చెప్పారు. డ్రగ్స్ మాఫియా, నకిలీ నోట్ల మాఫియా ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారని, దీన్ని సార్క్ నియంత్రించాలని అన్నారు.. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఉగ్రవ్యతిరేక వ్యవస్థ మెరుగుకోసం నిపుణుల భేటీ ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి అవకాశమిచ్చినందుకు రాజ్‌నాథ్ సార్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ మీడియాకు అవకాశమివ్వలేదు.. సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగాన్ని కవర్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చిన మీడియాను సభలోకి అనుమతించలేదు. వారిని పాక్ అధికారులు దూరంగా పెట్టారు. దీనిపై పాక్, భారత అధికారుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. అంతకుముందు పాక్ హోం మంత్రితో కరచాలనం చేయడానికి రాజ్‌నాథ్ ఇష్టపడలేదు. పాక్ ఇచ్చిన మధ్యాహ్న భోజనాన్నీ తినకుండానే వెళ్లిపోయారు. సదస్సుకు ముందు ఇతర దేశాల ప్రతినిధులతో కలసి ప్రధాని షరీఫ్‌ను రాజ్‌నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి మధ్య ఏవిధమైన చర్చలు జరగలేదు. కాగాఉగ్రవాద నిర్మూలకకు సార్క్ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ చెప్పారు. మోదీని కలసిన రాజ్‌నాథ్.. ఢిల్లీకి తిరిగొచ్చిన రాజ్‌నాథ్ విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లి ప్రధాని మోదీని కలుసుకుని సదస్సు గురించి తెలిపారు. అది సాధారణమే..: రాజ్‌నాథ్ ప్రసంగాన్ని మీడియాలో ప్రసారం కానివ్వలేదన్న వార్తలపై భారత్ స్పందించింది. ‘సార్క్ సంప్రదాయం ప్రకారం ఆతిథ్య దేశం ఇచ్చే ప్రారంభ ప్రకటనను మాత్రమే మీడియాలో ప్రసారం చేస్తారు. మిగతా చర్చలు, ప్రసంగాలను ప్రసారం చేసేందుకు మీడియాకు అవకాశం ఇవ్వరు అది సాధారణమే’ అని స్పష్టం చేసింది. -
'ఆయనకు ఫిరాయింపులే ప్రియం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చూపించే శ్రద్ధ పాలనా వ్యవహారాల్లో లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. బుధవారం కొత్త టీచర్ల నియామకం సందర్భంగా ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కార్యక్రమానికి వెళ్లారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ ఫిరాయింపు సందర్భంగా కండువా కప్పడానికి.. 8,926 మంది నవ ఉపాధ్యాయులను చంద్రబాబు కార్యక్రమం మధ్యలో వదిలేసి వెళ్లారు. దీంతో చేసేదేంలేక అధికారులు చంద్రబాబు వచ్చేంత వరకు టీచర్లను వెయిట్ చేయించారు. ముఖ్యమంత్రి చర్యతో అధికారులతో పాటు ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న టీచర్లలో స్పూర్తిని నింపాల్సిన కార్యక్రమంలో సాక్షాత్తూ.. ముఖ్యమంత్రే ఇలా దిగజారుడుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
కరీంనగర్లో రక్తదాన గణపయ్య
-
ఆయనే నాకు స్ఫూర్తి!
మా ఆయన బంగారం ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, ప్రోత్సహించడంలో షారుక్‌ఖాన్ ముందుంటారు. సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి నన్ను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తారు. అవసరమైన సలహాలు ఇస్తారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు షారుక్. సమాజసేవ విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి. క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తన సక్సెస్మంత్రగా చేసుకున్నారు షారుక్. బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎంత కష్టాన్నయినా తేలికగా తీసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం చిన్న విషయాలకు భావోద్వేగాలకు గురవుతారు. ‘‘కొత్తవాళ్ల ముందు మాట్లాడడానికి నాకు బెరుకు’’ అంటారుగానీ ఒక్కసారి వాళ్లకు దగ్గరైతే చాలు సన్నిహితమైపోతారు. వాళ్ల కష్టసుఖాల్లో భాగం అవుతారు.పిల్లలకు మించిన బెస్ట్‌ఫ్రెండ్స్ అతనికి ఈ లోకంలో ఎవరూ లేరు. మౌనంగా ఉండడం షారుక్‌కు ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవరూ లేకపోతే పెంపుడు జంతువుల దగ్గరికి వెళ్లి మరీ ముచ్చటపెడతారు! - గౌరీఖాన్ -
మధ్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు