ఆయనే నాకు స్ఫూర్తి!
మా ఆయన బంగారం
ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, ప్రోత్సహించడంలో షారుక్‌ఖాన్ ముందుంటారు. సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి నన్ను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తారు. అవసరమైన సలహాలు ఇస్తారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు షారుక్. సమాజసేవ విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి.
క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తన సక్సెస్‌మంత్రగా చేసుకున్నారు షారుక్. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఎంత కష్టాన్నయినా తేలికగా తీసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం చిన్న విషయాలకు భావోద్వేగాలకు గురవుతారు. ‘‘కొత్తవాళ్ల ముందు మాట్లాడడానికి నాకు బెరుకు’’ అంటారుగానీ ఒక్కసారి వాళ్లకు దగ్గరైతే చాలు సన్నిహితమైపోతారు. వాళ్ల కష్టసుఖాల్లో భాగం అవుతారు.పిల్లలకు మించిన బెస్ట్‌ఫ్రెండ్స్ అతనికి ఈ లోకంలో ఎవరూ లేరు. మౌనంగా ఉండడం షారుక్‌కు ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవరూ లేకపోతే పెంపుడు జంతువుల దగ్గరికి వెళ్లి మరీ ముచ్చటపెడతారు!
- గౌరీఖాన్