ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో భారీ రుణ వృద్ధి నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 2,973 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌కు ఇది అత్యధికంకాగా.. నికర వడ్డీ ఆదాయం 28 శాతం ఎగసి రూ. 7,435 కోట్లకు చేరింది.
ఈ కాలంలో కొత్తగా 3.14 మిలియన్ల క్రెడిట్ కస్టమర్ల(రుణగ్రహీతలు)ను జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 7.84 మిలియన్ల కస్టమర్లను కొత్తగా పొందినట్లు తెలియజేసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.73 శాతం నుంచి 1.14 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.78 శాతం నుంచి 0.41 శాతానికి దిగివచ్చాయి.
బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం నీరసించి రూ. 5,770 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment