Bajaj Finance
-
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో: రూ. 6,560 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తమ ఐపీవోకి (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్) సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 66–70గా నిర్ణయించింది. ఈ ఇష్యూ సెపె్టంబర్ 9న ప్రారంభమై 11న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ సెపె్టంబర్ 6న ఉంటుంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 6,560 కోట్లు సమీకరిస్తోంది.ఇందుకోసం రూ. 3,560 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ రూ. 3,000 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 214 షేర్లు చొప్పున బిడ్ చేయొచ్చు. సమీకరించే నిధులను భవిష్యత్ మూలధన అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1,258 కోట్ల నుంచి 38% పెరిగి రూ. 1,731 కోట్లకు పెరిగింది.రూ. 500 కోట్ల క్రోస్ ఇష్యూ .. ఆటో విడిభాగాల సంస్థ క్రోస్ లిమిటెడ్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ కూడా సెపె్టంబర్ 9న ప్రారంభమై 11తో ముగియనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించనుంది. క్రోస్ తాజాగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రమోటర్లు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జంషెడ్పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ 1991లో ఏర్పాటైంది. -
రూ.341 కోట్ల జీఎస్టీ ఎగవేత!.. బజాజ్ ఫైనాన్స్‌కు నోటీసు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) బజాజ్ ఫైనాన్స్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.341 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆగస్టు 3 డీజీజీఐ ఈ నోటీసు పంపింది.కేంద్ర పన్ను నిబంధనల ప్రకారం.. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్/ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్టీని ఎగవేస్తోందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మొత్తం రూ. 850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ. 150 కోట్ల వడ్డీ మాత్రమే కాకుండా.. జూన్ 2022 నుంచి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తం మీద బజాజ్ ఫైనాన్స్ రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ పొందిన వారి నుంచి బజాజ్ ఫైనాన్స్ ముందస్తు వడ్డీ వసూలు చేస్తోంది. డీజీజీఐ దీనికి కూడా టాక్స్ చెల్లించాలని పేర్కొంది. కానీ బజాజ్ ఫైనాన్స్ దీనిని నాన్-టాక్సబుల్ 'వడ్డీ ఛార్జీ'గా వర్గీకరించింది. దీంతో అధికార యంత్రాంగం సమస్యను లేవనెత్తింది. -
బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
డీలర్లకు ఫైనాన్సింగ్ ఎంపికలను మెరుగుపరచడానికి, అలాగే సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్ అనుబంధ సంస్థలైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM).. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన MoUపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & డైరెక్టర్ ధీమన్ గుప్తా.. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భట్ సంతకం చేశారు.ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మా డీలర్ భాగస్వాములు మా వ్యాపారంలో అంతర్భాగంగా ఉన్నారు. వారి కార్యకలాపాలను సులభతరం చేయడంలో వారికి సహాయపడే పరిష్కారాల కోసం చురుకుగా పని చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని ధీమాన్ గుప్తా అన్నారు.బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా మాట్లాడుతూ.. బజాజ్ ఫైనాన్స్‌లో వ్యక్తులు, వ్యాపారాలు రెండింటినీ శక్తివంతం చేసే ఫైనాన్సింగ్ సొల్యూషన్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. మేము TMPV & TPEM అధీకృత ప్రయాణీకులకు, ఎలక్ట్రిక్ వాహనాల డీలర్లకు ఆర్థిక మూలధనాన్ని అందిస్తాము. ఈ సహకారం డీలర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు. -
బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఉపశమనం
బజాజ్ ఫైనాన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కల్పించింది. బజాజ్ ఫైనాన్స్‌కు సంబంధించిన రెండు ఉత్పత్తులు ఈకామ్ (eCOM), ఆన్లైన్ డిజిటల్ ఇన్‌స్టా ఈఎంఐ (Insta EMI) కార్డ్‌పై ఉన్న ఆంక్షలను తక్షణమే తొలగించింది. ఈమేరకు కంపెనీ మే 2న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.ఈఎంఐ కార్డ్‌ల జారీతో సహా రెండు వ్యాపార విభాగాలలో రుణాల మంజూరు, పంపిణీని ఇప్పుడు పునఃప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ 15న బజాజ్ ఫైనాన్స్ లెండింగ్ ఉత్పత్తులైన ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. తమ డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు, నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉండకపోవడంతో ఆంక్షలు విధించింది.ఆర్బీఐ గత సంవత్సరం తమ రెండు రుణ ఉత్పత్తులపై వ్యాపార పరిమితులను విధించిన తర్వాత అవసరమైన మార్పులు చేసినట్లు బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 25న జనవరి-మార్చి ఫలితాలను ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీన్ని అనుసరించి, ఆంక్షలను సమీక్షించాలని ఆర్బీఐని అభ్యర్థించింది. -
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్ బజాజ్
ముంబై: బజాజ్ ఫైనాన్స్ సూక్ష్మ రుణాలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. అలాగే, వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలను తెరవనున్నట్టు చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ద్విచక్ర వాహన ఫైనాన్స్‌లోకి అడుగు పెట్టామని, ఆ తర్వాత కన్జ్యూమర్ ఫైనాన్స్‌లోకి, అనంతరం ప్రాపర్టీపై రుణాలు ఇవ్వడంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ రుణాలు, ఎంఎస్ఈ, ఇతర వాహన రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తమకు 4,000 శాఖలు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 5,000కు చేర్చనున్నట్టు పేర్కొన్నారు. 2008లో ఈ సంస్థ సేవలు ప్రారంభించగా, ప్రస్తుతం 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నట్టు సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ కాలంలో సంస్థ మార్కెట్ విలువ 450 రెట్లు పెరిగినట్టు చెప్పారు. రుణ ఆస్తులు 250 రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రికార్డ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో భారీ రుణ వృద్ధి నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 2,973 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌కు ఇది అత్యధికంకాగా.. నికర వడ్డీ ఆదాయం 28 శాతం ఎగసి రూ. 7,435 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా 3.14 మిలియన్ల క్రెడిట్ కస్టమర్ల(రుణగ్రహీతలు)ను జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 7.84 మిలియన్ల కస్టమర్లను కొత్తగా పొందినట్లు తెలియజేసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.73 శాతం నుంచి 1.14 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.41 శాతానికి దిగివచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 5,770 వద్ద ముగిసింది. -
దూసుకుపోయిన బజాజ్ ఫైనాన్స్.. డబుల్ జోరు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,596 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,002 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం వృద్ధితో రూ. 9,283 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 6,743 కోట్ల ఆదాయం సాధించింది. నికర వడ్డీ ఆదాయం 33 శాతం పుంజుకుని రూ. 7,920 కోట్లుకాగా.. కొత్త రుణాల సంఖ్య 60 శాతం ఎగసి 74.2 లక్షలకు చేరింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 30 శాతం మెరుగై రూ. 2,04,018 కోట్లను తాకాయి. రుణ నష్టాలు, కేటాయింపులు సగానికిపైగా తగ్గి రూ. 755 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ1లో ఇవి రూ. 1,750 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.96 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.46 శాతం నుంచి 0.51 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 26.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 6,408 వద్ద ముగిసింది. -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు గతంలో పేర్కొంది. ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఆఫర్ గడువు తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 750 - 799 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారికి రుణదాత గృహ రుణాలను 6.65% కంటే స్వల్ప మొత్తంలో ఎక్కువగా వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నాటికి దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, మార్చి 31 వరకు పంపిణీ చేసిన రుణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా, కొత్త గృహ రుణం కోసం చూస్తున్న వారు, అలాగే తమ ప్రస్తుత గృహ రుణాన్ని మరొక రుణదాత నుంచి బదిలీ చేయాలని చూస్తున్నవారు ఈ ఆఫర్‌కు అర్హులు. (చదవండి: ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) -
మాకు బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే బెంచ్‌మార్క్: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ
న్యూఢిల్లీ: చెల్లింపులు, మర్చంట్ ట్రాన్స్ఫర్ లావాదేవీలకు సంబంధించి టర్నోవర్ ప్రస్తుత(మార్చి) త్రైమాసికంలో 140 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు) ఉంటుందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే 50-60 శాతం వృద్ధి నమోదవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌శేఖర్ శర్మ తెలిపారు. ఇండియా డిజిటల్ సదస్సులో భాగంగా శర్మ మాట్లాడారు. తదుపరి వ్యాపార ఇంజన్‌గా రుణాల మంజూరు విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం రుణాల సంఖ్య పరంగా ప్రముఖ ఎన్బీఎఫ్సీ(బజాజ్ ఫైనాన్స్)ని పేటీఎం అధిగమించినట్టు శర్మ తెలిపారు. మార్కెట్ సైజ్‌ను అర్థం చేసుకోవడం లేదు ‘‘మాది చెల్లింపుల కంపెనీ. చెల్లింపుల ఆదాయం శరవేగంగా వృద్ధి చెందుతోంది. కానీ, పేటీఎం విజయం ఆర్థిక సేవల విక్రయంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో చెల్లింపుల నుంచి 100 మిలియన్ డాలర్లు (రూ.750కోట్లు) వస్తుందంటున్నాం. ఒక్క త్రైమాసికంలో ఇది గణనీయమైన మొత్తమే అవుతుంది. చెల్లింపుల వ్యాపారంలో మార్జిన్ 10 శాతం ఉంటుంది. దీనికి మర్చంట్ సేవలను (వర్తకులకు అందించే సేవలపై ఆదాయం) కూడా కలిపితే 140 మిలియన్ డాలర్లకు మొత్తం ఆదాయం చేరుతుంది. మార్జిన్లు 30-40 శాతం పెరుగుతాయి. చెల్లింపుల ఆదాయాన్ని (మార్కెట్ పరిమాణాన్ని) ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని శర్మ వివరించారు. బుధవారం పేటీఎం షేరు బీఎస్ఈలో కనిష్ట స్థాయి రూ.1,075ని నమోదు చేసి చివరికి రూ.1,083 వద్ద ముగియడం గమనార్హం. పేటీఎం షేరు ధరపై శర్మ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పేటీఎం పోటీ కంపెనీల షేర్లు గడిచిన ఆరు నెలల్లో 38-51 శాతం స్థాయిలో నష్టపోయినట్టు చెప్పారు. దక్షిణ అమెరికా కంపెనీల ధరలు అయితే ఏకంగా 70 శాతం పడిపోయినట్టు పేర్కొన్నారు. బజాజ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ.. పేటీఎం మూడేళ్ల కాలంలోనే బజాజ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ రుణాలను మంజూరు చేస్తున్నట్టు శర్మ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు రూ.4,000గా ఉన్నట్టు చెప్పారు. భాగస్వాములు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారని, మరింత మంది పేటీఎంలో భాగమయ్యేందుకు క్యూ కడుతున్నట్టు శర్మ ప్రకటించారు. డిసెంబర్ త్రైమాసికంలో రుణాల మంజూరు 4 రెట్లు పెరిగినట్టు పేటీఎం సోమవారం ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ 44 లక్షల రుణాలను జారీ చేసింది. వీటి మొత్తం విలువ రూ.2,180 కోట్లు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో మంజూరు చేసిన రుణాలు 8.81 లక్షలు, విలువ రూ.470 కోట్లుగా ఉన్నట్టు పేటీఎం తెలిపింది. (చదవండి: ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు..!) -
నాలుగు రోజుల తర్వాత లాభాలు
ముంబై: స్టాక్ సూచీలకు నాలుగు రోజుల తర్వాత గురువారం లాభాలొచ్చాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీ నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ కలిసొచ్చింది. ఐటీ షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగి 57,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు ఎగిసి 17,248 వద్ద నిలిచింది. ఫలితంగా సూచీల నాలుగురోజుల వరుస నష్టాలకు విరామం పడినట్లైంది. ఐటీ, ఇంధన, కన్జూమర్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ఎక్కువగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ పాలసీ కమిటీ నిర్ణయాలను బుధవారం రాత్రి ప్రకటించారు. ద్రవ్యోల్బణ కట్టడికి బాండ్ల కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది(2022)లో మూడుసార్లు., తర్వాత రెండేళ్లూ రెండుసార్లు చొప్పున వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్నారు. ఫెడ్ పరపతి నిర్ణయాలు అంచనాలకు తగ్గట్లు ఉండటంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం రాత్రి రెండున్నర లాభపడ్డాయి. ఆసియాలో ఒక్క ఇండోనేషియా గురువారం మినహా అన్ని దేశాలకు స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు రెండు నుంచి ఒకటిన్నర శాతం దూసుకెళ్లాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభంతో 58,243 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 17,373 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి అరగంట కొనుగోళ్ల మద్దతు లభించడంతో మరింత ముందుకు కదిలాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భయాలు తదితర ప్రతికూలతలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌లో తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(58,337) నుంచి 654 పాయింట్లను కోల్పోయి 57,683 వద్ద, నిఫ్టీ డే హై(17,379) నుంచి 194 పాయింట్లు పతనమై 17,185 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరి గంటలో మరోసారి కొనుగోళ్ల మద్దతుల అభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► మలేషియాలో సింగ్టెల్ డెలివరీ సెంటర్‌ను చేజిక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో రెండున్నర శాతం లాభపడి రూ.1,777 వద్ద స్థిరపడింది. ► రైల్వే సంస్థ నుంచి ఆర్డర్లను దక్కించుకోవడంతో సుబ్రాస్ షేరు నాలుగున్నర శాతం పెరిగి రూ.392 వద్ద ముగిసింది. ► ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.254 వద్ద స్థిరపడింది. సమీర్ గెహ్లాట్ పారీస్ సంస్థ తన వాటాను పదిశాతానికి తగ్గించుకోవడం షేరు పతనానికి కారణమైంది. -
ఇన్వెస్టర్లకు కోట్లలో లాభాలు తెచ్చిపెడుతున్న ఐదు కంపెనీలు..!
స్టాక్ మార్కెట్లో అందరినీ అదృష్టం ఊరికే వరించదు! వారు తీసుకునే రిస్క్ బట్టి అంతే స్థాయిలో రిటర్న్ వస్తుంది. కొన్ని నెలల కాలంలోనే లక్షాధికారిని కోట్లాధిపతిని చేయగల సత్తా కేవలం ఒక్క షేర్ మార్కెట్‌కే ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొద్ది మందికి వెంటనే అదృష్టం వరిస్తే.. మరికొందరికి కొన్ని ఏళ్లకు అదృష్టం వరిస్తుంది S/O సత్యమూర్తి సినిమాలో హీరో అల్లు అర్జున్ ని వరించినట్టు. గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ మంచి జోరు మీద ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల పంట పండుతుంది. పెట్టుబడుదారులు ఎంత ఎక్కువ కాలం ఆగితే.. అంత లాభం వస్తుంది. కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీల గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 1. అవంతి ఫీడ్స్ ఏప్రిల్ 2010లో అవంతి ఫీడ్స్ షేరు ధర రూ.1.73 వద్ద ఉంటే ప్రస్తుతం స్టాక్ రూ.545.50 వద్ద ట్రేడవుతోంది. గత 11 సంవత్సరాలలో, కంపెనీ షేర్ విలువ 34,000 శాతానికి పైగా పెరిగింది. అంటే, 2010లో రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.3.4 కోట్లుగా ఉండేది. 2. పీఐ ఇండస్ట్రీస్ వ్యవసాయ రసాయనాల విభాగంలో ప్రముఖ మార్కెట్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్ షేర్లు గత 11 ఏళ్లలో 10,000 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చాయి. ఏప్రిల్ 2010లో కంపెనీ వాటా రూ.31 వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ 15 నాటికి షేర్లు రూ.3,042కు చేరుకున్నాయి. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.1 కోటిగా ఉండేది. 3. బజాజ్ ఫైనాన్స్ ప్రముఖ రుణదాత కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లకు కలలో కూడా ఊహించని లాభాలు తీసుకొని వచ్చి పెట్టింది. ఏప్రిల్ 2010లో రూ.33.67 వద్ద ట్రేడవుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర ఇప్పుడు డిసెంబర్ 15 నాటికి రూ.7,000కు చేరుకుంది. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.20 కోట్లుగా ఉండేది. 4. ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ ప్లాస్టిక్ తయారీ వ్యాపారంలో ప్రముఖ సంస్థ అయిన ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ పెట్టుబదుదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఏప్రిల్ 2010లో రూ.11.97 వద్ద ట్రేడవుతున్న షేర్ ధర 2021 డిసెంబర్ 16 నాటికి రూ.2276కి పెరిగింది. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.1.60 కోట్లుగా ఉండేది. 5. అతుల్ లిమిటెడ్ గుజరాత్ కు చెందిన ఈ రసాయన సంస్థ గత 11 ఏళ్లలో 10,000 శాతానికి పైగా జూమ్ చేసింది. ఏప్రిల్ 2010లో స్టాక్ రూ.88.85 వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ 15 నాటికి రూ.8,659 వద్ద ట్రేడవుతోంది. (చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!) -
టీడీపీ నేతపై కేసు: ఏసీలు కొన్నాడు.. రుణం తీర్చనన్నాడు!
సాక్షి, చిత్తూరు: ఓ ఫైనాన్స్ సంస్థ రుణంతో ఏసీలు కొని, బకాయిలు కట్టనందుకు టీడీపీ మండల అధికార ప్రతినిధి హేమాద్రినాయుడుపై కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. రామభద్రాపురం గ్రామానికి చెందిన హేమాద్రినాయుడు అతని భార్య హరిణి పేరున బజాజ్‌ఫైనాన్స్‌లో 2020 జనవరి 8వ తేదీన రెండు ఏసీలు కొన్నారు. రెండు ఏసీలకు గాను రూ.1,04 లక్షలు కట్టాల్సి ఉంది. ఇందులో రూ.34,660 డౌన్ పేమెంట్ కింద బజాజ్‌ఫైనాన్స్‌కు కట్టారు. మిగిలిన మొత్తం బజాజ్ ఫైనాన్స్ సంస్థ రుణంతో, చిత్తూరులోని రిలైన్స్ మార్ట్‌లో రెండు ఏసీలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను ప్రతినెలా రూ.8,700 ఈఎంఐ కట్టాల్సి ఉంది. సెప్టెంబర్ నెలకు ఈఎంఐ కట్టలేదు. ఇందుకుగాను చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ సురేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆదివారం రామభద్రాపురంలోని హేమాద్రినాయుడు ఇంటికి కలెక్షన్ ఏజెంట్ పద్మనాభన్‌తో పాటు వచ్చారు. దీంతో ఆగ్రహించిన హేమాద్రినాయుడు తన ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం..రా అంటూ అతన్ని దుర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకొన్నారు. ‘గుడిపాల మండలం తెలుగుదేశం నాయకుడ్ని నేను, ఫోన్ చేస్తే 200 మంది ఇప్పుడే వస్తారు, నీ కథ తెలుస్తా.’ అంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ సర్పంచ్‌గా హేమాద్రినాయుడు భార్య హరిణి ప్రస్తుతం పనిచేస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ వినియోగదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వల్ల గత కొంత కాలంగా ఎఫ్డీలపై అందించే వడ్డీ రేట్లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సి)లు తగ్గించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు తీపికబురు అందించాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ 33 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీని అందించేంది. అలాగే, 66 నెలల ఎఫ్డీలపై అందించే వడ్డీ రేటు 6.6 శాతంగా, 99 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.65 శాతంగా వడ్డీని ఉండేది. కానీ, ఇప్పుడు దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. దీంతో 33 నెలల కాలపరిమితితో కూడిన రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. 66 నెలల కాలపరిమితితో రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై 6.7శాతం, 99 నెలల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. (చదవండి: భారత్‌లో రైతుల ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే..!) బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డీ వడ్డీ రేట్లు బజాజ్ ఫైనాన్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య కాలవ్యవధి గల ఎఫ్డీలకు ఇచ్చే వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు/0.30% వరకు పెంచింది. అయితే, 12-23 నెలల కాలపరిమితితో కూడిన ఎఫ్డీ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు లేదు. 24 నెలల-35 నెలల మధ్య కాలపరిమితితో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ల కోసం సంవత్సరానికి 6.4% వడ్డీ రేటు చెల్లిస్తే, 36 నెలల-60 నెలల మధ్య డిపాజిట్లకు సంవత్సరానికి 6.8% వడ్డీ రేటు చెల్లించనుంది. అయితే, ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకు ముందు ఈ రెండు సంస్థలు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. -
బ్యాంకులకు ‘మాస్టర్’ షాక్..
న్యూఢిల్లీ: స్థానిక డేటా స్టోరేజీ నిబంధనలు పాటించనందుకు గాను పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థ మాస్టర్‌కార్డుపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించడం.. ఇతర బ్యాంకులకు సంకటంగా మారింది. మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం ఉన్న 5 ప్రైవేట్ బ్యాంకులు కొత్తగా కార్డులు జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులు సమస్యలు ఎదుర్కోనున్నాయి. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకుపైనా దీని ప్రభావం పడనుంది. తరచూ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నందున కొత్త కార్డులు (డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్) జారీ చేయకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటోంది. మరోవైపు, బ్యాంకులతో పాటు బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ కార్డు వంటి సంస్థలు కూడా సమస్యలు ఎదుర్కోనున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా నివేదిక ప్రకారం .. మాస్టర్‌కార్డ్‌పై ఎక్కువగా ఆధారపడిన ఏడు సంస్థలు కొత్త కార్డులను జారీ చేయలేకపోవచ్చు. ఇతర పేమెంట్ గేట్వేలతో ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త కార్డులు జారీ చేయడానికి కనీసం 2–3 నెలలు పట్టేస్తుందని అంచనా. టెక్నాలజీని అనుసంధానం చేసుకోవాల్సి రానుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. మూడింటిపై ఎక్కువ ప్రభావం.. ఆర్బీఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్ బజాజ్ ఫిన్సర్వ్ ప్రధానంగా కార్డుల జారీ కోసం మాస్టర్కార్డ్పైనే ఆధారపడటం వల్ల వాటిపై మరింత తీవ్ర ప్రభావం పడనుంది. ‘కో–బ్రాండ్ భాగస్వాములు సహా క్రెడిట్ కార్డుల సంస్థల్లో ఆర్బీఎల్ బ్యాంకు, యస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్పై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే వీటి కార్డ్ స్కీములన్నీ కూడా మాస్టర్కార్డ్తోనే ముడిపడి ఉన్నాయి‘ అని నొమురా నివేదికలో తెలిపింది. దీని ప్రకారం ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు జారీ చేసే కార్డుల్లో 35–40 శాతం మాస్టర్‌కార్డ్‌వి ఉంటున్నాయి. అటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో భాగమైన క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్బీఐ కార్డ్ జారీ చేసేవాటిల్లో 10 శాతం మాస్టర్‌కార్డ్‌వి ఉంటున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు పూర్తిగా వీసాకి అనుసంధానమైనది కావడంతో దానిపై ప్రభావమేమీ ఉండదు. వీసాతో ఆర్బీఎల్ ఒప్పందం.. తాజా పరిణామాల నేపథ్యంలో వీసా ప్లాట్‌ఫాంపై క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు వీసా వరల్డ్‌వైడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు 8–10 వారాలు పట్టొచ్చని, తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో కో–బ్రాండెడ్ కార్డుల స్కీములు కూడా ఉన్నాయి. -
బజాజ్ గ్రూప్ @ రూ. 7.5 లక్షల కోట్లు..
ముంబై: వ్యాపార దిగ్గజం బజాజ్ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల (రూ. 7.5 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్ మైలురాయిని అధిగమించింది. దీంతో కుటుంబాల సారథ్యంలో నడుస్తూ, ఈ ఘనత సాధించిన దిగ్గజ గ్రూప్‌లలో నాలుగోదిగా నిల్చింది. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్‌లు ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నాయి. జూన్ 25న బజాజ్ గ్రూప్ కొంత సేపు ఈ మైలురాయి దాటినప్పటికీ.. మార్కెట్ క్షీణించడంతో నిలబెట్టుకోలేకపోయింది. అయితే జూలై 6న తిరిగి సాధించింది. డాలరుతో పోలిస్తే 74.55 రూపాయి మారకం ప్రకారం గ్రూప్‌లోని ఎనిమిది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సింహభాగం వాటా బజాజ్ ఫైనాన్స్‌దే (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) ఉంది. వివిధ రంగాల్లోకి విస్తరించిన బజాజ్ గ్రూప్‌లో.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫిన్సర్వ్), బజాజ్ ఆటో వంటివి కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా బజాజ్ గ్రూప్ స్టాక్స్ గణనీయంగా ర్యాలీ చేశాయి. బజాజ్ హిందుస్తాన్ షుగర్, ముకంద్ వంటివి 279, 118 శాతం మేర ఎగిశాయి. -
దుమ్మురేపిన బజాజ్ ఫైనాన్స్
ముంబై, సాక్షి: పతన మార్కెట్లోనూ ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ షేరు కదం తొక్కుతోంది. వెరసి తొలిసారి కంపెనీ విలువ రూ. 3 ట్రిలియన్ మార్క్‌ను అధిగమించింది. ఎన్ఎస్ఈలో షేరు ప్రస్తుతం 2.5 శాతం ఎగసి రూ. 5,018 సమీపంలో ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 3.02 లక్షల కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా రానున్న రెండేళ్లలో బిజినెస్ 25 శాతం చొప్పున వృద్ధి సాధించగలదంటూ కంపెనీ వేసిన అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ విలువరీత్యా తాజాగా బజాజ్ ఫైనాన్స్ 9వ ర్యాంకుకు చేరడం గమనార్హం! ర్యాలీ బాటలో గత మూడు నెలల్లో మార్కెట్లు 18 శాతమే పుంజుకున్నప్పటికీ.. బజాజ్ ఫైనాన్స్ షేరు మాత్రం 42 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడుతుండటం, ఆర్థిక రికవరీ సంకేతాలు వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2(జులై- సెప్టెంబర్)లో బజాజ్ ఫైనాన్స్ పటిష్ట పనితీరును చూపడం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల ఆస్తులను కలిగి పదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలు బ్యాంకింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెరసి బ్యాంకింగ్ లైసెన్స్ రేసులో బజాజ్ ఫైనాన్స్ ముందుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరుపట్ల రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా స్పందించింది. రూ. 5,900 టార్గెట్ ధరతో ఈ షేరుని కొనుగోలు చేయవచ్చంటూ సిఫారసు చేస్తోంది. -
ఆర్ఐఎల్ జూమ్- బజాజ్ ఫైనాన్స్ బోర్లా
మూడు రోజుల ర్యాలీ తదుపరి అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 287 పాయింట్లు ఎగసి 39,861కు చేరగా.. నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,737 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు.. అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి బజాజ్ ఫైనాన్స్ షేరు నష్టాలతో కళతప్పగా.. ఆర్ఐఎల్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొత్త రుణాలు 6.5 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు క్షీణించినట్లు బజాజ్ ఫైనాన్స్ తాజాగా వెల్లడించింది. అయితే నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం పుంజుకుని రూ. 1.37 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. కొత్త కస్టమర్లు, రుణాల విడుదల గతేడాది క్యూ2తో పోలిస్తే 50-60 శాతంగా నమోదైనట్లు వివరించింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5.4 శాతం పతనమై రూ. 3,265కు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 3,341 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ రిటైల్‌లో తాజాగా అబు ధబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో 1.2 శాతం వాటాను అబు దభి ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్‌లో నాలుగు వారాలుగా విదేశీ సంస్థలు వాటాలు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెరసి రిలయన్స్ రిటైల్‌లో 7 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా కంపెనీ రూ. 37,710 కోట్లను సమకూర్చుకుంది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబడాలా, జీఐసీ, టీపీజీ ఉన్నాయి. తాజాగా ఏడీఐఏ చేరింది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది. -
కేటీఎం 390 బైక్ : కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో బైక్ లవర్స్ కోసం కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. తన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌పై ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని అందిస్తోంది. కేటీఎం 390 బైక్ కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌ను సులువైన ఈఎంఐల ద్వారా కొనుగోలుచేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తోంది. ఆన్-రోడ్ ధర మీద 80 శాతం ఫైనాన్స్ సదుపాయాన్నిఅందిస్తోంది. తద్వారా మరింతమంది వినియోగదారులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నట్టు బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ ఫైనాన్స్ పథకాన్ని అందస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయంతో ఈ బైక్‌ను 6,999 రూపాయల సులభ వాయిదాలతో కొనుగోలు దారులు ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు అప్గ్రేడయ్యే అవకాశం కల్పిస్తున్నామని బజాజ్ ఆటోలిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ అన్నారు. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా వినియోగదారులు 95 శాతం వరకు ఫైనాన్స్ కవరేజ్, తక్కువ వడ్డీరేట్లు, హెచ్ఢీఎఫ్సీనుంచి ఇతర ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే ఆసక్తికరమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కేటీఎం డీలర్ల వద్ద లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కేటీఎం 390 ధర (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) 3.04 లక్షల రూపాయలు. ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉంది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 38,267 యూనిట్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ నెలల్లో 33,220 కేటీఎం బైక్‌ల అమ్మకాలను నమోదు చేసింది. -
బజాజ్ ఫైనాన్స్ లాభాలకు కరోనా షాక్
సాక్షి, ముంబై: కరోనా కల్లోల సమయంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎల్) నికర లాభం భారీగా పడిపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 19శాతం క్షీణించి 962 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఇది 1,195 కోట్లుగా ఉంది. కోవిడ్-19 సంక్షోభం తమ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసిందని ప్రకటించింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం మాత్రం12 శాతం ఎగిసి 3,694 కోట్ల నుంచి 4,152 కోట్లకు పెరిగింది. అలాగే ఆపరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 15 శాతం పుంజుకుని 6648 కోట్ల రూపాయలను నమోదు చేసింది. 2020, ఏప్రిల్ 30 నాటికి ఏకీకృత మారటోరియం బుక్ 38,599 కోట్ల రూపాయల నుండి 21,705 కోట్లకు తగ్గిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరోవైపు బజాజ్ ఫైనాన్స్ కంపనీ ఆరంభం(1987) నుంచి ఛైర్మన్‌గా కొనసాగుతున్న రాహుల్ బజాజ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా సంస్థను అభివృద్దిపథంలో పరుగులు పెట్టించిన ఆయన జూలై 31 నుంచి తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తన సేవలను కొనసాగిస్తారు. కంపెనీ వైస్ ఛైర్మన్, రాహుల్ బజాజ్ కుమారుడు ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు 4 శాతం నష్టాలతో ముగిసింది. తండ్రితో సంజీవ్ బజాజ్ (ఫైల్ ఫోటో) -
బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ రాజీనామా
బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జూలై 31వ తేదిన తన పదవికి రాజీనామా చేయనున్నారు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభమైనప్పటి ఈయనే పదవిలో కొనసాగుతున్నారు. రాహుల్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో కంపెనీకి తదుపరి ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ నియమితులవుతారు. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ‘‘రాహుల్ బజాజ్ 1987లో బజాజ్ ఫైనాన్స్ ప్రారంభమైనప్పటి నుంచి చైర్మన్ పదవిలో ఉన్నారు. గత 5 దశాబ్దాలుగా ఈ గ్రూప్‌నకు వివిధ బాధ్యతల్లో ఆయన సేవలందించారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రాహుల్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. అయినప్పటికీ రాహుల్ బజాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలు అందించనున్నారు ’’ అని కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది. 4.50శాతం నష్టంతో ముగిసిన షేరు రాహుల్ బజాజ్ రాజీనామా వార్తల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు 4.31శాతం నష్టంతో రూ.3292.90 వద్ద ముగిసింది. ఒకదశలో 6.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.3220.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
రేటింగ్ దెబ్బ- యాక్సిస్- బజాజ్ ఫైనాన్స్
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వారాంతాన ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ బ్లూచిప్.. బజాజ్ ఫైనాన్స్‌ల క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. కోవిడ్-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఎస్అండ్పీ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ ఫైనాన్షియల్, గిఫ్ట్ సిటీ, హాంకాంగ్ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ బాటలో ఎన్బీఎఫ్సీ.. బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం ఎస్అండ్పీ గ్లోబల్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌ల రుణ నాణ్యత క్షీణించడంతోపాటు.. క్రెడిట్ వ్యయాలు పెరిగే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. ఫలితంగా లాభదాయకత క్షీణించనున్నట్లు అంచనా వేసింది. బాండ్లను BB కేటగిరీకి సవరిస్తే ‘జంక్’ స్థాయి రేటింగ్‌కు చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల(ఎకనమిక్ రిస్కులు) నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ అభిప్రాయపడింది. నేలచూపులో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు 4.5 శాతం పతనమై రూ. 406 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 402 వరకూ జారింది. ఇక బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం నీరసించి రూ. 2793 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2770 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా.. గత నెల రోజుల్లో యాక్సిస్ బ్యాంక్ షేరు 25 శాతం లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్ 59 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్‌గ్రేడ్
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ బ్లూచిప్ బజాజ్ ఫైనాన్స్‌ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ‘జంక్’ హోదాను ప్రకటించింది. తద్వారా కోవిడ్-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ ఫైనాన్షియల్, గిఫ్ట్ సిటీ, హాంకాంగ్ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్ చేసింది. బాండ్ల రేటింగ్‌ను BB కేటగిరీకి సవరిస్తే జంక్ స్థాయికి చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఎకనమిక్ రిస్కుల నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఈ సందర్భంగా పేర్కొంది. పటిష్టం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ సగటుతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ రుణ నాణ్యత అత్యుత్తమమంటూ ఎస్అండ్పీ పేర్కొంది. అయితే అంతర్జాతీయ సంస్థలతో చూస్తే.. మొండి బకాయిలు(ఎన్పీఏలు) అధికంగా నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. అయినప్పటికీ మార్కెట్ వాటాను నిలుపుకోవడంతోపాటు, తగినన్ని పెట్టుబడులతో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఎన్బీఎఫ్సీ.. బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం ఎస్అండ్పీ గ్లోబల్ తాజాగా డౌన్‌గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. ఈ బాటలో మరో ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్‌ను సైతం BB/ప్రతికూలం/B నుంచి BB/watch Negative/Bకు డౌన్‌గ్రేడ్ చేసింది. ఇదే విధంగా ఇండియన్ బ్యాంక్ రేటింగ్‌ను క్రెడిట్ వాచ్‌గా సవరించింది. రానున్న త్రైమాసికాలలో బ్యాంక్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనపడనున్నట్లు ఎస్అండ్పీ అంచనా వేసింది. అలహాబాద్ బ్యాంక్ విలీనంతోపాటు.. కోవిడ్-19 కారణంగా బ్యాంక్ అధిక రిస్కులను ఎదుర్కొనే అవకాశమున్నట్లు ఎస్అండ్పీ భావిస్తోంది. కొనసాగింపు.. ఇతర బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్‌లకు గతంలో ఇచ్చిన రేటింగ్స్‌ను కొనసాగించనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. అయితే మణప్పురం ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్ప్‌ల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్‌ల రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. -
ఎస్బీఐ మార్కెట్ క్యాప్‌ను అధిగమించిన బజాజ్ ఫైనాన్స్
ఎన్బీఎఫ్సీ రంగానికి చెందిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ మంగవారం దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. మార్కెట్ ముగింపు తర్వాత ఇరు కంపెనీల మార్కెట్ క్యాప్‌లను పరిశీలిస్తే..., బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.1.76లక్షల కోట్లుగా నమోదవగా, ఎస్బీ మార్కెట్ క్యాప్ రూ.1.71లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన టాప్-100 కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ 12వ స్థానానికి చేరుకోగా, ఎస్బీఐ 13వ స్థానానికి దిగివచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ కంపెనీలు టాప్-10లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు 2016లో లిస్ట్ అయ్యి అదే ఏడాది 40శాతం పెరిగింది. 2017లో 109శాతం, 2018లో 51శాతం, 2019లో 60శాతం ర్యాలీ చేసింది. మొత్తం మీద లిస్ట్ అయిన నాటి నుంచి షేరు ఏకంగా 712శాతం లాభపడింది. అయితే కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మారిటోరియం విధింపు తర్వాత ఎన్పీఏల మరింత పెరగవచ్చనే అందోళనలతో ఈ షేరు ఏడాది ప్రారంభం నుంచి 33శాతం నష్టాన్ని చవిచూసింది. మరింత అప్‌ట్రెండ్‌కు అవకాశం: బ్రోకరేజ్‌లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఈ షేరు ఇటీవల ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. అలాగే టార్గెట్ ధరను రూ.3700గా నిర్ణయించింది. నిన్నటి ముగింపు ధర(రూ.2841.85)తో పోలిస్తే నిర్ణయించిన టార్గెట్ ధర 30శాతం అప్‌సైడ్ పోటెన్షియల్ను కలిగి ఉంది. మరో బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా బజాజ్ ఫైనాన్స్ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. -
క్విక్ హీల్- బజాజ్ ఫైనాన్స్‌కు Q4 షాక్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ సర్వీసులు అందించే క్విక్ హీల్ టెక్నాలజీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నిరాశామయ పనితీరు ప్రదర్శించడంతో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. క్విక్ హీల్ టెక్నాలజీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐటీ, డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే క్విక్ హీల్ టెక్నాలజీస్ నికర లాభం 71 శాతం పడిపోయి రూ. 8 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 25 శాతం క్షీణించి రూ. 64 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 75 శాతం క్షీణించి రూ. 10.2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో క్విక్ హీల్ టెక్ షేరు 10.5 శాతం కుప్పకూలింది. రూ.104 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బజాజ్ ఫైనాన్స్ రూ. 948 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4తో పోలిస్తే ఇది 19 శాతం క్షీణతకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 36 శాతం పెరిగి రూ. 7231 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 5 శాతం పతనమై రూ.1896 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1865 వరకూ దిగజారింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! బజాజ్ గ్రూప్‌లోని ఈ ఎన్బీఎఫ్సీ కంపెనీలో ప్రమోటర్లకు 56.2 శాతం వాటా ఉంది.