స్టాక్ మార్కెట్‌లో అందరినీ అదృష్టం ఊరికే వరించదు! వారు తీసుకునే రిస్క్ బట్టి అంతే స్థాయిలో రిటర్న్ వస్తుంది. కొన్ని నెలల కాలంలోనే లక్షాధికారిని కోట్లాధిపతిని చేయగల సత్తా కేవలం ఒక్క షేర్ మార్కెట్‌కే ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొద్ది మందికి వెంటనే అదృష్టం వరిస్తే.. మరికొందరికి కొన్ని ఏళ్లకు అదృష్టం వరిస్తుంది S/O సత్యమూర్తి సినిమాలో హీరో అల్లు అర్జున్ ని వరించినట్టు.
గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ మంచి జోరు మీద ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల పంట పండుతుంది. పెట్టుబడుదారులు ఎంత ఎక్కువ కాలం ఆగితే.. అంత లాభం వస్తుంది. కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీల గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. అవంతి ఫీడ్స్
ఏప్రిల్ 2010లో అవంతి ఫీడ్స్ షేరు ధర రూ.1.73 వద్ద ఉంటే ప్రస్తుతం స్టాక్ రూ.545.50 వద్ద ట్రేడవుతోంది. గత 11 సంవత్సరాలలో, కంపెనీ షేర్ విలువ 34,000 శాతానికి పైగా పెరిగింది. అంటే, 2010లో రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.3.4 కోట్లుగా ఉండేది.
2. పీఐ ఇండస్ట్రీస్
వ్యవసాయ రసాయనాల విభాగంలో ప్రముఖ మార్కెట్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్ షేర్లు గత 11 ఏళ్లలో 10,000 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చాయి. ఏప్రిల్ 2010లో కంపెనీ వాటా రూ.31 వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ 15 నాటికి షేర్లు రూ.3,042కు చేరుకున్నాయి. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.1 కోటిగా ఉండేది.
3. బజాజ్ ఫైనాన్స్
ప్రముఖ రుణదాత కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లకు కలలో కూడా ఊహించని లాభాలు తీసుకొని వచ్చి పెట్టింది. ఏప్రిల్ 2010లో రూ.33.67 వద్ద ట్రేడవుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర ఇప్పుడు డిసెంబర్ 15 నాటికి రూ.7,000కు చేరుకుంది. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.20 కోట్లుగా ఉండేది.
4. ఆస్ట్రల్ పాలీ టెక్నిక్
ప్లాస్టిక్ తయారీ వ్యాపారంలో ప్రముఖ సంస్థ అయిన ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ పెట్టుబదుదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఏప్రిల్ 2010లో రూ.11.97 వద్ద ట్రేడవుతున్న షేర్ ధర 2021 డిసెంబర్ 16 నాటికి రూ.2276కి పెరిగింది. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.1.60 కోట్లుగా ఉండేది.
5. అతుల్ లిమిటెడ్
గుజరాత్ కు చెందిన ఈ రసాయన సంస్థ గత 11 ఏళ్లలో 10,000 శాతానికి పైగా జూమ్ చేసింది. ఏప్రిల్ 2010లో స్టాక్ రూ.88.85 వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ 15 నాటికి రూ.8,659 వద్ద ట్రేడవుతోంది.
(చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!)
Comments
Please login to add a commentAdd a comment