పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ ఒక బంగారు గని. ఈ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఒక్కొసారి ఏడాదిలోపు మారిపోతాయి. సినిమాలో చెప్పినట్టు ఒక్క ఏడాదిలో కోటీశ్వరుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. అయితే, ఇందులో ఏదైనా తేడా జరిగిన కూడా బికారి అవ్వడం కూడా ఖాయం. ఇది అలా ఉంటే, ఒక కంపెనీ షేర్లు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. వాళ్లు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపడుతుంది. స్టాక్ ఆఫ్ ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ కంపెనీ ఒక ఏడాదిలో తన వాటాదారులకు 19275% రిటర్న్లను అందించింది.
ఫిబ్రవరి 19, 2021న రూ.0.40గా ఉన్న పెన్నీ స్టాక్ ధర ఈ రోజు బీఎస్ఈలో రూ.77కి పెరిగింది. ఏడాది క్రితం ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలు ఈ రోజు రూ.1.93 కోట్లుగా మారి ఉండేవి. ఇదే కాలంలో సెన్సెక్స్ 13.39% పెరిగింది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ కంపెనీ షేర్ విలువ 27.18% పడిపోయింది. అక్టోబర్ 19న గరిష్టంగా రూ.186కు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.793.83 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కలిగిన రూ.0.09 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి రూ.0.26 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment