స్టాక్ మార్కెట్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనే పదాన్ని మనం తరుచూగా వింటాం. ఈ స్టాక్స్‌లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాల్ని గడించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడాదిలో లక్షాది కారులు కాస్తా కోటీశ్వరులు కావొచ్చు. చిన్న కంపెనీలకు పెద్దగా పబ్లిసిటీ ఉండదు. కానీ, ఇలాంటి కంపెనీలు రోజులు గడిచే కొద్ది మదుపరులకు అదిరిపోయే లాభాలను తెచ్చి పెడతాయి. అయితే, ఇందుకోసం స్టాక్‌మార్కెట్‌పై ఖచ్చితమైన అవగాహన, ఓపిక చాలా అవసరం. అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే భారీగా నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఒక్క దిబ్బకు బికారి కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్
అయితే, తాజాగా ఒక కంపెనీ పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని తీసుకొచ్చింది. ఆ కంపెనీ పేరు ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్. ఈ కంపెనీ షేరు విలువ గత ఏడాది(2021) మార్చి 19న రూ .0.80 వద్ద ఉంటే, అదే కంపెనీ ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్ షేరు విలువ ఈ ఏడాది మార్చి 21న రూ.21.05 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ కాలంలో సెన్సెక్స్ 24 శాతం లాభపడింది. ఏడాది క్రితం రూ.లక్ష విలువ చేసే ఈ కంపెనీ స్టాక్ కొని ఉంటే వాటి విలువ నేడు రూ.24.31 లక్షలకు చేరేది. అంటే, గత ఏడాది ఎవరు అయితే రూ.1 లక్ష విలువ చేసే షేర్లను కొని దగ్గర పెట్టుకుంటారో, వారికి ఇప్పుడు రూ.రూ.23 లక్షలు లాభం వచ్చేది.
అయితే ఈ రోజు మధ్యాహ్నం సెషన్లో స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్లో రూ .21.15 వద్ద నిలిచిపోయింది. ఈ రోజు షేరు 4.75 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఈ కంపెనీ 1988 నుంచి ఎల్ఈడీ వీడియో డిస్ ప్లేలు, ఎల్ఈడీ లుమినైర్స్, హై-ఎండ్ ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ & టెలికాం సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తుంది. బీఎస్ఈలో మొత్తం 0.53 లక్షల షేర్లు చేతులు మారగా, రూ.11.31 లక్షల టర్నోవర్ నమోదైంది. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.116.46 కోట్లకు పడిపోయింది.
(చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ మేనియా.. అప్పుడెమో థియేటర్ల పేరు..ఇప్పుడు సరికొత్తగా..)
Comments
Please login to add a commentAdd a comment