రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడుల కారణంగా గత కొద్ది రోజుల నుంచి స్టాక్ మార్కెట్ పడిపోతున్న.. కరోనా మహమ్మారి తర్వాత మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెట్టింది. ఇప్పటికీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా రాబోయే కాలంలో సూచీలు జీవన కాల గరిష్ట స్థాయికి చేరుకొనున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తాయి. ఇది అలా ఉంటే, ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం మదుపరులకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చి పెట్టింది.
భారతదేశపు అతిపెద్ద ఇంటీరియర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 2003 మే నెల 16న రూ.0.63 రూపాయలుగా ఉన్న షేర్ ధర నేడు 169.55 రూపాయలకు చేరుకుంది. అంటే, 18 ఏళ్లలో కాలంలో 269 రేట్లకు పైగా గ్రీన్ ప్లై షేర్ ధర పెరిగింది. 2003 మే నెల 16న రూ.1,00,000 విలువ గల గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ కొని ఉన్న వారికి ఇప్పుడు రూ.2.69 కోట్లకు పైగా లాభం వచ్చేది.
చాలా మందికి స్టాక్ మార్కెట్ మీద ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలని ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేయలని సూచిస్తున్నారు. అలాంటి వారు మాత్రమే, అధిక లాభాలను గడిస్తారని పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ మీద పరిజ్ఞానం పెంచుకొని అధిక లాభాలను పొందాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
(చదవండి: ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. లబోదిబో అంటున్న రష్యా బిలియనీర్స్!)
Comments
Please login to add a commentAdd a comment