డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) బజాజ్ ఫైనాన్స్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.341 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆగస్టు 3 డీజీజీఐ ఈ నోటీసు పంపింది.
కేంద్ర పన్ను నిబంధనల ప్రకారం.. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్/ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్‌టీని ఎగవేస్తోందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మొత్తం రూ. 850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.
రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ. 150 కోట్ల వడ్డీ మాత్రమే కాకుండా.. జూన్ 2022 నుంచి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తం మీద బజాజ్ ఫైనాన్స్ రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.
వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ పొందిన వారి నుంచి బజాజ్ ఫైనాన్స్ ముందస్తు వడ్డీ వసూలు చేస్తోంది. డీజీజీఐ దీనికి కూడా టాక్స్ చెల్లించాలని పేర్కొంది. కానీ బజాజ్ ఫైనాన్స్ దీనిని నాన్-టాక్సబుల్ 'వడ్డీ ఛార్జీ'గా వర్గీకరించింది. దీంతో అధికార యంత్రాంగం సమస్యను లేవనెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment