
సాక్షి, ముంబై: బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించి భళా అనిపించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే.. క్యూ3లో నికర లాభం ఏకంగా 52 సాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికానికి బజాజ్ ఫైనాన్స్ లాభం రూ. 1614కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 42 శాతం దూసుకుపోయి రూ. 4537కు చేరింది. కొత్త రుణాలు 13 శాతం పెరిగాయని బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఫలితాలు అదరగొట్టడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు బుధవారం ట్రేడింగ్‌లో దూసుకుపోయి నూతన గరిష్ఠాలను తాకింది. బుధవారం షేరు 5 శాతం పెరిగి రూ. 4426 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 4444 గరిష్ఠాన్ని తాకడం విశేషం.
మూడో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 40.6 శాతం పెరిగి రూ. 7011 కోట్లను చేరింది. కంపెనీ ఏయూఎం 35 శాతం వృద్ధితో 1.45 లక్షల కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో స్థూల ఎన్‌పీఏలు ఎలాంటి మార్పు లేకుండా 1.61 శాతం వద్ద ఉండగా, నికర ఎన్‌పీఏలు స్వల్పంగా పెరిగి 0.7 శాతానికి చేరాయి. ఈ కాలంలో రుణ నష్టాలు రూ. 831 కోట్లుకాగా, ప్రొవిజన్లు రూ. 451కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment