చిన్న డిపాజిట్లపై అధిక రాబడులు
చిన్న మొత్తాల డిపాజిట్‌దారులను ఆకర్షించే దిశగా.. సుమారు రూ. 25,000 ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా దాదాపు 8 శాతం పైగా వడ్డీ అందించనున్నట్లు బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ స్కీము ప్రకారం 12–13 నెలల వ్యవధికి వార్షికంగా 7.8 శాతం మేర, 24–35 నెలల కాలావధికి 8 శాతం, 36–60 నెలల కాలానికి చేసే డిపాజిట్లపై 8.05 శాతం రాబడులు అందించనున్నట్లు వివరించింది.
రూ. 1 కోటి దాకా డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా మరో పావు శాతం వడ్డీ రేటు వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఈ స్థాయి రాబడులు అందుకోవడానికి ఎన్‌సీఆర్, గ్రేటర్ ముంబై ప్రాం తంలో కనీస డిపాజిట్ విలువ రూ. 75,000గాను, మిగతా ప్రాంతాల్లో రూ. 50,000గాను ఉంది. దీనితో డిపాజిటర్ల సంఖ్య 60 శాతం పెరగగలదని, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పరిమాణం రెట్టింపై రూ. 8,500 కోట్లకు చేరగలదని సంస్థ భావిస్తోంది.