![Bajaj Auto unveils new financing plan for KTM 390 bike - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/27/bajaj%20auto.jpg.webp?itok=lBX0j8bF)
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో బైక్ లవర్స్ కోసం కొత్త ఫైనాన్సింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. తన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌పై ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని అందిస్తోంది. కేటీఎం 390 బైక్ కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌ను సులువైన ఈఎంఐల ద్వారా కొనుగోలుచేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తోంది.
ఆన్-రోడ్ ధర మీద 80 శాతం ఫైనాన్స్ సదుపాయాన్నిఅందిస్తోంది. తద్వారా మరింతమంది వినియోగదారులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నట్టు బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ ఫైనాన్స్ పథకాన్ని అందస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయంతో ఈ బైక్‌ను 6,999 రూపాయల సులభ వాయిదాలతో కొనుగోలు దారులు ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలామంది కస్టమర్లు అప్‌గ్రేడయ్యే అవకాశం కల్పిస్తున్నామని బజాజ్ ఆటోలిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ అన్నారు. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా వినియోగదారులు 95 శాతం వరకు ఫైనాన్స్ కవరేజ్, తక్కువ వడ్డీరేట్లు, హెచ్‌ఢీఎఫ్‌సీనుంచి ఇతర ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే ఆసక్తికరమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కేటీఎం డీలర్ల వద్ద లభిస్తుందని కంపెనీ చెప్పింది.
ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో ప్రారంభించిన కేటీఎం 390 ధర (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) 3.04 లక్షల రూపాయలు. ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉంది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 38,267 యూనిట్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ నెలల్లో 33,220 కేటీఎం బైక్‌ల అమ్మకాలను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment