రైడర్స్‌కి గుడ్‌న్యూస్ కేటీఎం సంస్థ తన బైకులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కేటీఎంలో ఎంట్రీ లెవల్ లైట్‌వెయిట్ బైక్ 250 అడ్వెంచర్ ధరను తగ్గించింది. బైక్ ప్రమోషన్‌లో భాగంగా కేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణ అవసరాలతో పాటు లాండ్‌రైడ్‌కి కూడా వెళ్లగలిగేలా అడ్వెంచర్ 250 బైక్‌ని కేటీఎం మార్కెట్‌లోకి తెచ్చింది. 250 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ బైకుపై రూ. 25,000 డిస్కౌంట్‌ని సంస్థ అందిస్తోంది. ఆఫర్ వర్తింపుతో హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ. 2,28,480గా ఉంది. అడ్వెంచర్ 250 బైకుపై అందిస్తోన్న డిస్కౌంట్ 2020 జులై 14 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కేటీఎం తెలిపింది. ధర తగ్గింపుతో కేటీఎంలో పాపులర్ మోడల్ డ్యూక్‌కి అడ్వెంచర్‌కి మధ్య ధరల వత్యాసం బాగా తగ్గిపోయింది.
రోజువారి రవాణా అవసరాలు తీర్చడంతో పాటు వీకెండ్‌లో లాంగ్ టూర్ వేసేందుకు వీలుగా బైకర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్వెంచర్‌ను డిజైన్ చేసినట్టు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ తెలిపారు.
అడ్వెంచర్ బైకు 248 సీసీ ఫోర్ వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పాటు డబ్ల్యూపీ అపెక్స్ సస్పెన్షన్, ఏబీఎస్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment