![Bajaj Auto Introduces Husqvarna Brand Of Premium Bikes - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/7/BIKE.jpg.webp?itok=H4njF1Pj)
న్యూఢిల్లీ: ఆ్రస్టియా మోటార్ సైకిల్ కంపెనీ కేటీఎమ్ ఉత్పత్తి చేస్తున్న హస్వానా ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్‌ను.. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ బ్రాండ్‌లోని విట్‌పిలెన్ 250, స్వార్ట్‌పిలెన్ 250 మోడళ్లను ఇక్కడి మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. అత్యంత శక్తివంతమైన ఈ రెండు మోడళ్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కేటీఎం షోరూంల ద్వారా కొనుగోలు చేయవచ్చని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ వెల్లడించారు. ఇక కేటీఎం ఏజీలో బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే కాగా, 1903 నుంచి మార్కెట్లో ఉన్న స్వీడిష్ మోటార్ సైకిల్ బ్రాండ్‌ను తాజాగా భారత బైక్ ప్రియులకు ఇక్కడ పరిచయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment