రూ. 66–70 శ్రేణిలో షేరు ధర
సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు ఇష్యూ
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తమ ఐపీవోకి (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్) సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 66–70గా నిర్ణయించింది. ఈ ఇష్యూ సెపె్టంబర్ 9న ప్రారంభమై 11న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ సెపె్టంబర్ 6న ఉంటుంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 6,560 కోట్లు సమీకరిస్తోంది.
ఇందుకోసం రూ. 3,560 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ రూ. 3,000 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 214 షేర్లు చొప్పున బిడ్ చేయొచ్చు. సమీకరించే నిధులను భవిష్యత్ మూలధన అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1,258 కోట్ల నుంచి 38% పెరిగి రూ. 1,731 కోట్లకు పెరిగింది.
రూ. 500 కోట్ల క్రోస్ ఇష్యూ ..
ఆటో విడిభాగాల సంస్థ క్రోస్ లిమిటెడ్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ కూడా సెపె్టంబర్ 9న ప్రారంభమై 11తో ముగియనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించనుంది. క్రోస్ తాజాగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రమోటర్లు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జంషెడ్‌పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ 1991లో ఏర్పాటైంది.
Comments
Please login to add a commentAdd a comment