Housing Finance
-
ఎఫ్డీపై అధిక వడ్డీ ఇస్తున్న సంస్థలు
-
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో: రూ. 6,560 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తమ ఐపీవోకి (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్) సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 66–70గా నిర్ణయించింది. ఈ ఇష్యూ సెపె్టంబర్ 9న ప్రారంభమై 11న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ సెపె్టంబర్ 6న ఉంటుంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 6,560 కోట్లు సమీకరిస్తోంది.ఇందుకోసం రూ. 3,560 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ రూ. 3,000 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 214 షేర్లు చొప్పున బిడ్ చేయొచ్చు. సమీకరించే నిధులను భవిష్యత్ మూలధన అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1,258 కోట్ల నుంచి 38% పెరిగి రూ. 1,731 కోట్లకు పెరిగింది.రూ. 500 కోట్ల క్రోస్ ఇష్యూ .. ఆటో విడిభాగాల సంస్థ క్రోస్ లిమిటెడ్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ కూడా సెపె్టంబర్ 9న ప్రారంభమై 11తో ముగియనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించనుంది. క్రోస్ తాజాగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రమోటర్లు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జంషెడ్పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ 1991లో ఏర్పాటైంది. -
రిలయన్స్ హోమ్‌పై సెబీ
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల అక్రమ మళ్లింపులో అనిల్ అంబానీ ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆడిటింగ్ తదితరాల వివరాలను బయటపెట్టింది. వీటి ప్రకారం అప్పటి కంపెనీ బోర్డు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సంబంధిత యాజమాన్యం వీటిని పట్టించుకోలేదు. కంపెనీ విధానాలను వ్యతిరేకంగా రుణాలను విడుదల చేసింది. అసంపూర్తి డాక్యుమెంటేషన్, క్రెడిట్ పాలసీ నిబంధనల ఉల్లంఘన ద్వారా రుణ మంజూరీ జరిగింది. రుణ విడుదల అంశాలను సమీక్షిస్తూ బోర్డు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వెరసి సాధారణ కార్పొరేట్ రుణ విధానాలకు పాతరవేశారు. వీటన్నిటి వెనుక మాస్టర్‌మైండ్ అనిల్ అంబానీదేనని సెబీ అభిప్రాయపడింది. ఇతర వివరాలు ఇలా.. ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధుల అక్రమ మళ్లింపు జరిగినట్లు కంపెనీకి చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించిన పీడబ్ల్యూసీ, ఫోరెన్సిక్ ఆడిటర్ గ్రాంట్ థార్న్టన్ వెల్లడించాయి. గ్రాంట్ థార్న్‌టన్‌ను రుణదాతల కన్సార్షియంకు అధ్యక్షత వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నియమించింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం సాధారణ కార్పొరేట్ లోన్ ప్రొడక్ట్‌లో భాగంగా విడుదల చేసిన రుణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. 2018 మార్చి31కల్లా రూ. 900 కోట్ల రుణాలు విడుదలకాగా.. 2019 మార్చి31కల్లా రూ. 7,900 కోట్లకు జంప్‌చేశాయి. రుణగ్రహీత సంస్థలలో నెగిటివ్ నెట్‌వర్త్, అతితక్కువ ఆదాయం, బిజినెస్ కార్యకలాపాలు, లాభార్జన లేకపోవడం తదితర పలు ప్రతికూలతలున్నాయి. ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి మాత్రమే రుణాలను పొందడం, రుణాలతో పోలిస్తే తక్కువ ఈక్విటీ మూలధనం, రుణాలు అందుకునే ముందుగానే ఏర్పాటుకావడం, రుణ దరఖాస్తు రోజునే రుణ మంజూరీ తదితర అక్రమాలు నెలకొన్నాయి. ఇక 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్‌వరకూ బీవోబీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ తొలి నివేదిక 2020 జనవరిలో వెలువడింది. ఈ కాలంలో కార్పొరేట్ రుణ విధానాలకింద ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 14,577 కోట్లకుపైగా రుణాలు విడుదలయ్యాయి. వీటిలో రూ. 12,487 కోట్లకుపైగా నిధులు సంబంధిత 47 సంస్థలకే చేరాయి. 2019 అక్టోబర్ 31కల్లా రూ. 7,984 కోట్ల రుణాలు వసూలుకావలసి ఉంటే.. దాదాపు రూ. 2,728 కోట్లు మొండిబకాయిలుగా నమోదయ్యాయి. తదుపరి నివేదికలలో గ్రూప్‌లోని పలు ఇతర కంపెనీలకు సైతం రుణాలు విడుదలైనట్లు నివేదిక పేర్కొంది. -
ఐపీవోకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్‌బీఎఫ్‌సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్‌కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది. కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
ఏఐఎఫ్‌ల పెట్టుబడుల రికవరీపై పిరమల్ ధీమా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. -
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
3.13 లక్షల మంది కస్టమర్లు: హెచ్డీఎఫ్సీ
ముంబై: క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) వినియోగదార్ల సంఖ్య 3.13 లక్షలు దాటిందని గృహ రుణ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ప్రధాన మంత్రి అవాస యోజన (పీఎంఏవై) పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎల్ఎస్ఎస్ కస్టమర్లు రూ.67,000 కోట్ల రుణాలను అందుకున్నట్టు సంస్థ ఎండీ రేణు సూద్ కర్నాడ్ వెల్లడించారు. ‘ప్రభుత్వం ఈ పథకం కింద సబ్సిడీ రూపంలో రూ.48,250 కోట్లు సమకూర్చింది. ఇందులో హెచ్డీఎఫ్సీ కస్టమర్లు 15 శాతంపైగా వాటాతో రూ.7,200 కోట్లు అందుకున్నారు. 92 శాతానికి పైగా కొత్త రుణ దరఖాస్తులు డిజిటల్ మార్గాల ద్వారా వచ్చాయి. మహమ్మారికి ముందు ఇది 20 శాతం కంటే తక్కువగా ఉంది. గుజరాత్ నుంచి అత్యధిక వినియోగదార్లు ఉన్నారు. సీఎల్ఎస్ఎస్ కింద ఉత్తమ పనితీరు కనబర్చిన గృహ రుణ సంస్థగా అవార్డు పొందాం’ అని వివరించారు. చదవండి: వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్‌ఫోన్ మీ సొంతం! -
అఫర్డబుల్ హౌస్ లోన్స్ .. వారికి కష్ట కాలమే!
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణరంగ వ్యయాలు పెరిగి పోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అదిప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1-6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8-13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడిసరుకు ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20-25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
క్యూ2లో పెరగనున్న సెక్యూరిటైజేషన్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల సెక్యూరిటైజేషన్ భారీగా ఎగసే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. క్యూ2(జులై–సెపె్టంబర్)లో సెక్యూరిటైజేషన్ 45 శాతం జంప్‌చేయనున్నట్లు ఇక్రా రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వీటి విలువ రూ. 25,000 కోట్లను తాకవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 17,200 కోట్ల విలువైన సెక్యూరిటైజేషన్ నమోదుకాగా.. గతేడాది(2020–21) క్యూ2లో ఈ విలువ రూ. 15,200 కోట్లకు చేరింది. ఒకేతరహా ఇల్లిక్విడ్ ఫైనాన్షియల్ అసెట్స్‌ను క్రోడీకరించి మార్కెట్లో విక్రయించగల సెక్యూరిటీలుగా రీప్యాకేజింగ్ చేయడాన్ని సెక్యూరిటైజేషన్‌గా పేర్కొనే సంగతి తెలిసిందే. వీటిని సంబంధిత ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆర్బీఐ తీసుకువచి్చన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో సెక్యూరిటైజేషన్ మార్కెట్ విస్తరించనున్నట్లు ఇక్రా తెలియజేసింది. దీంతో గత నెలలో పరిమాణరీత్యా 60 శాతం సెక్యూరిటైజేషన్ నమోదైనట్లు వెల్లడించింది. తొలి అర్ధభాగంలో... సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ. 42,200 కోట్ల సెక్యూరిటైజేషన్‌కు వీలున్నట్లు ఇక్రా అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ. 22,700 కోట్లు మాత్రమేకాగా.. ఈ ఏడాది సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ. 1.2 లక్షల కోట్లను తాకనున్నట్లు తాజాగా అభిప్రాయపడింది. ఇది 40% అధికమని తెలియజేసింది. -
కొంపముంచే రుణాలు, తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలు
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలకు నిరర్థక రుణాలు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) గండికొట్టాయి. జూన్‌తో అంతమైన మొదటి త్రైమాసికంలో లాభం గణనీయంగా తగ్గిపోయి రూ.153 కోట్లకు పరిమితమైంది. ఎన్పీఏలకు రూ.830 కోట్లను పక్కన పెట్టడం ఇందుకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.817 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 4.5 శాతం పెరిగి రూ.1,275 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.32 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ.8,652 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో రూ.7,650 కోట్లు గృహ రుణాలే ఉన్నాయి. రుణాల మంజూరులో 152 శాతం పురోగతి చూపించింది. ‘‘ఎన్పీఏలకు చేసిన కేటాయింపుల వల్లే మా నికర లాభం తగ్గిపోయింది. దీనికితోడు వేతన వ్యయాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని దాటి వచ్చామన్న బలమైన నమ్మకంతో ఉన్నాం. రానున్న కాలంలో మంచి వృద్ధి పథంలో కొనసాగుతాం’’ అని సంస్థ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. మూడోదశలోని వసూలు కాని రుణాలు మొత్తం రుణాలో 5.93 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.83 శాతంగానే ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడడం వల్ల వసూళ్లు మందగించాయని.. వసూళ్లపై మరింత దృష్టి సారిస్తామని విశ్వనాథగౌడ్ చెప్పారు. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్.. 'ఇండియాబుల్స్' చేతికి
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగంలో మరో విలీనానికి తెరతీస్తూ గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్)లో విలీనానికి ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. ప్రతీ 100 ఎల్వీబీ షేర్లకు (రూ. 10 ముఖవిలువ) ఐహెచ్ఎఫ్ షేర్లు 14 (రూ. 2 ముఖవిలువ) కేటాయించనున్నారు. విలీన సంస్థకు ఇండియాబుల్స్ గ్రూప్ ప్రమోటరు సమీర్ గెహ్లాట్ .. వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఐహెచ్ఎఫ్ ఎండీ గగన్ బంగా, ఎల్వీబీ సీఈవో పార్థసారథి ముఖర్జీ జాయింట్ ఎండీలుగాను, ఐహెచ్ఎఫ్ ఈడీ అజిత్ మిట్టల్.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉంటారు. ఎల్వీబీ, ఐహెచ్ఎఫ్లు శుక్రవారం ఈ విషయాలు వెల్లడించాయి. కార్యకలాపాలు మరింత మెరుగుపర్చుకునేందుకు, కొత్త విభాగాల్లోకి కూడా ప్రవేశించేందుకు ఈ విలీనంతో తోడ్పాటు లభించగలదని ఎల్వీబీ పేర్కొంది. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడంతో పాటు, వ్యాపార పరిమాణాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడగలదని ఐహెచ్ఎఫ్ వివరించింది. విలీనంతో దేశీయంగా వ్యాపార పరిమాణం, లాభదాయకత విషయంలో టాప్ 8 ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటిగా తమది ఆవిర్భవిస్తుందని ఐహెచ్ఎఫ్ పేర్కొంది. రెండు సంస్థల వ్యాపార పరిమాణం ఇలా .. తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు స్థానిక ప్రజల ఆర్థిక అవసరాల కోసం 1926లో లక్ష్మీ విలాస్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం.. ఎల్వీబీ డిపాజిట్లు రూ. 30,787 కోట్లు కాగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 24,123 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలానికి రూ. 630 కోట్ల నష్టం నమోదు చేసింది. స్థూల మొండిబాకీలు 13.9% నికర మొండిబాకీలు 7.6%గా ఉన్నాయి. దాదాపు 21.86 లక్షల ఖాతాదారులు, 4,881 మంది ఉద్యోగులు ఉండగా, దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 150 పట్టణాల్లో 569 శాఖలు ఉన్నాయి. మరోవైపు, ఇండియాబుల్స్ గ్రూప్‌లో భాగమైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నికర విలువ ప్రస్తుతం రూ. 17,792 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు రూ. 3,084 కోట్ల లాభాలు ఆర్జించింది. స్థూల నిరర్థక ఆస్తులు 0.79%, నికర నిరర్థక ఆస్తులు 0.59%గా ఉంది. గృహ రుణాల మార్కెట్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కార్యకలాపాలతో ఇప్పటిదాకా మొత్తం రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది. విలీనానంతరం 40వేల కోట్ల మార్కెట్ క్యాప్ .. గతేడాది డిసెంబర్ చివరి నాటికి విలీన సంస్థ నికర విలువ రూ. 19,472 కోట్లుగాను, లోన్ బుక్ దాదాపు రూ. 1,23,393 కోట్లుగానూ ఉంటుంది. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 20.6 శాతంగా ఉండనుంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఇది 10.875 శాతంగా ఉంటే సరిపోతుంది. అటు స్థూల మొండిబాకీలు 3.5 శాతానికి, నికర ఎన్పీఏలు 2 శాతానికి పరిమితం అవుతాయి. 800 శాఖలు, 14,302 మంది ఉద్యోగులు ఉండనున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంటుందని గగన్ బంగా తెలిపారు. విలీనానికి కారణాలు.. ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వరుసగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన ప్రభావంతో 2018 సెప్టెంబర్‌లో ఆర్థిక మార్కెట్లు అస్తవ్యస్తంగా మారినప్పట్నుంచి ఐహెచ్ఎఫ్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. డిసెంబర్ క్వార్టర్లో ఐహెచ్ఎఫ్ రుణాల మంజూరీ అంతక్రితం త్రై మాసికంతో పోలిస్తే 65% పడిపోయింది. మార్చి క్వార్టర్లో కాస్త మెరుగుపడినప్పటికీ.. సాధారణ స్థాయికన్నా తక్కు వే ఉంటోంది. సంక్షోభం రాకముందు ప్రతి క్వార్టర్లో ఐహెచ్ఎఫ్ సుమారు రూ. 10,000 కోట్ల మేర రుణా లు మంజూ రు చేసేది. ఇది గణనీయంగా తగ్గింది. నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. మరోవైపు, ఎల్వీబీ మొండిబాకీలు ఏకంగా 13.95 శాతానికి పెరిగిపోగా, క్యాపిటల్ అడెక్వసీ రేషియో నియంత్రణ సంస్థ నిర్దేశిత స్థాయికన్నా తక్కువగా 7.57 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో విలీనంతో ఇరు సంస్థలకు లబ్ధి చేకూరగలదని అంచనా. విలీన వార్తలతో శుక్రవారం బీఎస్ఈలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 92.75 వద్ద క్లోజయ్యింది. అటు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు దాదాపు అరశాతం పెరిగి రూ. 903.15 వద్ద ముగిసింది. ఇరు సంస్థలకు ప్రయోజనాలేంటంటే.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్) నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే ఆస్తులు, అప్పుల మధ్య భారీ వ్యత్యాసాల సమస్య పరిష్కారమవుతుంది. ఇక, ఇతరత్రా రిటైల్ బ్యాంకింగ్ పథకాలను ప్రవేశపెట్టేందుకు కూడా సాధ్యపడుతుంది. ఐబీహెచ్ ప్రధానంగా పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎల్వీబీ దక్షిణాదిలో ఎక్కువగా విస్తరించి ఉంది. దీంతో ఈ విలీనం ద్వారా ఐబీహెచ్ దక్షిణాదిలో కూడా కార్యకలాపాలు విస్తరించడానికి వీలుపడనుంది. మరోవైపు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) విషయానికొస్తే.. విలీనంతో క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి మెరుగుపడటంతో పాటు వ్యాపార పరిమాణం కూడా పెరుగుతుంది. అటు వ్యాపార వృద్ధికి మరిన్ని పెట్టుబడులు లభిస్తాయి. అటు క్లయింట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఆర్బీఐ అనుమతులు కీలకం.. ఈ విలీన ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి విలీనాల్లో బ్యాంకు లైసెన్సును వేరే సంస్థకు బదలాయించేందుకు ఆర్బీఐ అంగీకరించదని, కాబట్టి లైసెన్సు ఎల్వీబీ పేరు మీదే కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విలీనానంతరం ఏర్పడే సంస్థలో ఐహెచ్ఎఫ్ ప్రమోటర్లకు 19.5% వాటాలు ఉంటాయి. ప్రస్తుతం వారికి ఐహెచ్‌ఎఫ్‌లో 21.6% వాటాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బ్యాంకులో ప్రమోటర్లు పది శాతానికి మించి వాటాలు ఉంచుకునేందుకు ఆర్బీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాబుల్స్ గ్రూప్ అటు రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు కూడా సాగిస్తున్న నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్ వ్యాపారాల విలీనానికి ఆర్బీఐ ఎలా స్పందిస్తుందన్నది కూడా చూడాల్సిన విషయమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి డీల్స్‌పై ఆర్బీఐ అంత సానుకూలత చూపలేదని వారు పేర్కొన్నారు. అటు షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మొదలైన నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుందని గగన్ బంగా చెప్పారు. -
పీఎన్బీ హౌసింగ్‌లో పీఎన్బీ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో తనకున్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించింది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ గ్రూప్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ వర్డే పార్ట్నర్స్కు 2.17 కోట్ల షేర్లను (సుమారు 13 శాతం వాటాలు) విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 1,8151.6 కోట్లుగా ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పీఎన్బీ పేర్కొంది. వీటి ప్రకారం.. జనరల్ అట్లాంటిక్ సంస్థకు షేరు ఒక్కింటికి రూ. 850 చొప్పున సుమారు 1.09 కోట్ల షేర్లను, వర్డే పార్ట్నర్స్కు కూడా ఇదే రేటు కింద మరో 1.09 కోట్ల షేర్లను విక్రయించనుంది. డీల్ కింద రెండు సంస్థలు చెరి రూ. 925.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్ 31 ఆఖరు నాటికి పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పీఎన్బీకి 32.79 శాతం వాటాలు ఉన్నాయి. విక్రయానంతరం పీఎన్బీ వాటాలు 19.78 శాతంగా ఉంటాయని, ప్రమోటరుగానే కొనసాగుతుందని పీఎన్బీహెచ్ఎఫ్ఎల్ వెల్లడించింది. ప్రాధాన్యేతర ఆస్తుల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ. 8,600 కోట్లు సమీకరించాలని పీఎన్బీ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎక్స్పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలో మొత్తం 42 లక్షల షేర్లను విక్రయించి రూ. 32 కోట్లు సమీకరించింది. శుక్రవారం బీఎస్ఈలో పీఎన్బీ షేరు 0.05 శాతం పెరిగి రూ. 95.40 వద్ద, పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేరు 4% పెరిగి రూ. 865.70 వద్ద క్లోజయ్యింది. -
బంధన్ చేతికి గృహ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ తాజాగా గృహ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది. ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేశాయి. రెండు పక్షాలకు ఇది ప్రయోజనకరమైన ఒప్పందంగా హెచ్డీఎఫ్సీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు గృహ్ ఫైనాన్స్‌కి, మరింత వైవిధ్యమైన సెక్యూర్డ్ రుణాల పోర్ట్‌ఫోలియో దక్కడం ద్వారా బంధన్ బ్యాంక్‌కు ఇది లాభించగలదన్నారు. విలీన సంస్థలో 15 శాతం దాకా వాటాలను అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరతామని, అనుమతి లభించని పక్షంలో నిబంధనల ప్రకారం 10 శాతం లోపునకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికల్లో భాగంగా డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టినట్లు, ఇందులో భాగంగానే గృహ్ ఫైనాన్స్ కొనుగోలు చేస్తున్నట్లు బంధన్ బ్యాంక్ సీఈవో చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. విలీనానంతరం బంధన్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో అన్సెక్యూర్డ్ రుణాల వాటా 86 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందన్నారు. విలీన బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 4,182 బ్యాంకింగ్ అవుట్‌లెట్స్, 476 ఏటీఎంలు ఉంటాయి. రుణ పోర్ట్‌ఫోలియోలో 58 శాతం మైక్రో ఫైనాన్స్ రుణాలు, 28 శాతం రిటైల్ హోమ్ లోన్స్, 14 శాతం ఇతరత్రా రుణాలు ఉంటాయి. తగ్గనున్న బంధన్ హోల్డింగ్స్ వాటాలు .. ప్రస్తుతం బంధన్ బ్యాంక్‌లో మాతృ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు (బీఎఫ్హెచ్ఎల్) 82.28 శాతం వాటాలు ఉన్నాయి. అటు గృహ్ ఫైనాన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 57.83% వాటాలు ఉన్నాయి. విలీనానంతరం బంధన్ బ్యాంక్‌లో బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాటా 60.27%కి తగ్గుతుంది. అటు హెచ్‌డీఎఫ్‌సీకి 15% వాటాలు దక్కుతాయి. ఆ తర్వాత కొన్ని వాటాలను పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు లేదా సెకండరీ మార్కెట్లలో విక్రయించడం ద్వారా దీన్ని క్రమంగా 10% లోపునకు తగ్గించుకుంటుంది. ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలో బంధన్ బ్యాంక్‌లో బీహెచ్ఎఫ్ఎల్ తన వాటాలు 82.3% నుంచి 40%కి తగ్గించుకోవాలి. కానీ అది జరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో బంధన్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ జీతభత్యాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటికీ ఇటీవల సడలించింది. తాజా డీల్ పూర్తయినా బంధన్ బ్యాంక్‌లో బీహెచ్ఎఫ్ఎల్ వాటా 60.27% స్థాయికి మాత్రమే తగ్గుతుంది. దీంతో.. వాటాలను మరింత తగ్గించుకోవడానికి బీహెచ్ఎఫ్ఎల్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉండనుంది. ఇక, అటు హెచ్‌డీఎఫ్‌సీకి విలీన బ్యాంకులో ప్రమోటరు హోదా లభిస్తుంది.ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీకి.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 19.72% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాంకులో ప్రమోటరుగా ఉన్న సంస్థ మరో బ్యాంకులో ప్రమోటరుగా 10%కి మించి వాటాలు ఉండకూడదు దీంతో విలీన సంస్థలో ప్రారంభ దశలో 15.44% వాటాలు ఉన్నప్పటికీ.. హెచ్డీఎఫ్సీ కూడా క్రమంగా దీన్ని పది శాతం లోపునకు తగ్గించుకోవాల్సి రానుంది. సోమవారం బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్లు 5.21 శాతం క్షీణించి రూ. 501.10 వద్ద క్లోజయ్యాయి. గృహ్ ఫైనాన్స్ షేరు 3.9 శాతం క్షీణించి రూ. 306.20 వద్ద క్లోజయ్యింది. గృహ్ ఫైనాన్స్.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో ఆగా ఖాన్ ఫౌండేషన్, హెచ్డీఎఫ్సీ కలిసి గృహ్ ఫైనాన్స్ ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాల ప్రకారం.. గృహ్ ఫైనాన్స్ దాదాపు రూ. 2,738 కోట్ల రుణాలు ఇచ్చింది. మొత్తం లోన్ బుక్ పరిమాణం రూ. 16,663 కోట్లుగా ఉంది. ప్రధానంగా రిటైల్ విభాగంపై దృష్టి పెడుతున్న గృహ్ ఫైనాన్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 220 కోట్ల నికర లాభం ఆర్జించింది. బంధన్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్‌కు.. 938 శాఖలు, 30,431 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం డిపాజిట్లు రూ. 33,869 కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 33,373 కోట్లుగా ఉన్నాయి. బంధన్ బ్యాంక్ ప్రధానంగా తూర్పు భారతదేశ రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా మైక్రోఫైనాన్స్ లోన్సే ఉన్నాయి. అటు గృహ్ ఫైనాన్స్ పశ్చిమాది రాష్ట్రాల్లో .. గృహ రుణాల కేటగిరీలో కార్యకలాపాలు సాగిస్తోంది. షేర్ల మార్పిడి ఇలా.. డీల్ ప్రకారం.. గృహ్ ఫైనాన్స్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బంధన్ బ్యాంక్‌కి చెందిన 568 షేర్లు లభిస్తాయి. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రమోటర్ హోల్డింగ్‌ను తగ్గించుకోవడానికి, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించుకోవడానికి బంధన్ బ్యాంక్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లుగా ఉంటుంది. బంధన్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 59,800 కోట్లుగా ఉండగా, గృహ్ ఫైనాన్స్ విలువ రు. 23,224 కోట్లుగా ఉంది. -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు మరింత చేయూత
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) ప్రతినిధులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్న ఈ రంగాల పునరుద్ధరణకు సూచనలు చేశారు. అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) అయిన ఐఎల్ఎఫ్ఎస్ వరుసగా రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో, అది ఆర్థిక సేవల మార్కెట్లో ద్రవ్య లభ్యత సమస్యకు దారితీసిన విషయం తెలిసిందే. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రధానికి తెలియజేసినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా చెప్పారు. ‘‘ఐఎల్ఎఫ్ఎస్ సంక్షో భం తర్వాత ప్రభుత్వం పలు సానుకూల చర్యలను తీసుకుంది. అయితే, ఇవి సరిపోవని సంకేతమిస్తున్నాం. అందుకే దీన్ని ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు. పరిశ్రమల ఆందోళనల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవస్థాపరంగా అతి ముఖ్యమైన ఎన్బీఎఫ్సీలను ప్రజల నుంచి డిపాజిట్ల సేకరణకు అనుమతించాలని, నేషనల్ హౌసింగ్ బ్యాంకు నుంచి రుణాలు పొందే అవకాశం హెచ్ఎఫ్సీలకు కల్పించాలని కంపెనీల ప్రతినిధులు ప్రధానిని కోరారు. మొత్తం రుణాల్లో వ్యక్తుల గృహ రుణాల వాటా 50%కి మించి ఉండాలన్న నిబంధనకు 2020 డిసెం బర్ వరకు గడువు ఇవ్వాలని కూడా కోరారు. ఇండియాబుల్స్ గ్రూపు చైర్మన్ సమీర్ గెహ్లాట్, డీహెచ్ఎఫ్ఎల్ చైర్మన్ కపిల్ వాద్వాన్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎండీ దినంత్ దుబాసీ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్బీఎఫ్సీ... ఏం జరుగుతోంది?
స్టాక్ మార్కెట్లను గత ఐదేళ్లుగా చూస్తున్న వారినెవరినైనా అత్యద్భుతంగా పెరిగిన రంగమేదని అడిగితే ఠక్కున ‘ఎన్బీఎఫ్సీ’ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ రంగంలోని షేర్లు ఎన్నో రెట్లు పెరిగాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని జనానికిచ్చే ఈ సంస్థలు... బ్యాంకులకన్నా వేగంగా వృద్ధి చెందాయి. అందుకే వీటి షేర్లూ అలానే పెరిగాయి. ఐఎల్ఎఫ్ఎస్... తన చెల్లింపుల్లో తొలిసారి డిఫాల్టయింది ఆగస్టులో. ఆ తరవాత ఐదుసార్లు ఇలాంటి పరిస్థితే వచ్చినా... బయటపెట్టలేదు. అయితే ఈ నెల్లో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) నుంచి కొన్న రూ.300 కోట్ల రుణపత్రాల్ని మ్యూచ్‌వల్ ఫండ్ సంస్థ డీఎస్పీ బ్లాక్‌రాక్ కొంత నష్టానికి మార్కెట్లో ఒకేసారి తెగనమ్మేసింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీల విషయంలో భయాలు రేగాయి. పలువురు విశ్లేషకులు... ఇవి చెబుతున్న ఆస్తులకు, వీటి రుణాలకు పొంతన లేదని వ్యాఖ్యానించటంతో పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి నుంచి మొదలు... ఎన్బీఎఫ్సీ షేర్లు పేకమేడల్లా కూలుతున్నాయి. ఇది ఇతర ఆర్థిక సంస్థల షేర్లకూ పాకింది. సూచీలు పతనమవటంతో భయాలు మరింత పెరుగుతున్నాయి. నిజానికి తాము డీఎస్పీ బ్లాక్‌రాక్ విక్రయంతో... డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అవుతుందేమోనన్న భయాలు పెరిగాయి. కానీ డీహెచ్ఎఫ్ఎల్ వీటిని ఖండిస్తోంది. తమ పరిస్థితి చాలా పటిష్ఠంగా ఉందని చెబుతోంది. ఆ సంస్థ షేరు మాత్రం దాదాపు వారంరోజుల్లో సగానికిపైగానే పతనమైంది. డీఎస్పీ కూడా... వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనన్న ఉద్దేశంతో తాము విక్రయించామే తప్ప ఆ సంస్థపై అపనమ్మకంతో కాదని చెబుతోంది. కానీ ఈ షేరు పతనం ఆగటం లేదు. అదే దార్లో పీఎన్బీ హౌసింగ్, కెన్‌ఫిన్ హోమ్స్ వంటివీ పతనమవుతున్నాయి. నిధులు సమీకరించేదిలా... ఎన్బీఎఫ్సీలు తమకు కావాల్సిన నిధులను బాం డ్లు, డిబెంచర్లు విక్రయించటం ద్వారా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం ద్వారా సమీకరిస్తుంటాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగితే వీటి సమీకరణ రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రుణాలు మరింత ప్రియమవుతాయి. అందుకే ఈ షేర్లలో అమ్మకాలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థలు గనక దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే వాటిపై వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దాదాపు 1 శాతం తక్కువకు వస్తాయన్న కారణంతో ఇవి స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. ఇపుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కనక వీటికి నిధుల సమీకరణ భారమవుతుంది. నిజానికి ఇక్కడే అసలు సమస్య వస్తుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ... వీటి అప్పుల విలువ పెరిగి, ఆస్తుల విలువ తగ్గుతుంది. ఇప్పటికే చాలా సంస్థలు ఈ పరిస్థితికి వచ్చేశాయని, ఇదే ఈ షేర్ల పతనానికి అసలు కారణమని మరికొందరు చెబుతున్నారు. ‘‘డీహెచ్ఎఫ్ఎల్ అప్పుల్లో దాదాపు 12 శాతం మరో మూడు నెలల్లో మెచ్యూరిటీకి రానున్నాయి. వీటికి సంబంధించిన ఆస్తులు మాత్రం 9 శాతమే కావటం గమనార్హం. అంటే మూడునెలల్లో మెచ్యూరిటీకి వచ్చేవాటిలోనే 3 శాతం అప్పులు ఎక్కువగా ఉన్నట్లు లెక్క’’ అని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ తెలియజేసింది. చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇలా ఆస్తులకన్నా అప్పులు స్వల్పంగా ఎక్కువ ఉన్నవే. పైపెచ్చు ఐఎల్ఎఫ్ఎస్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తగినంత నిధులు లేవని, అవి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులివ్వలేవని వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి ఎన్బీఎఫ్సీ షేర్లలో అమ్మకాలకు కారణమవుతున్నాయి. -
పీఎన్బీ హౌసింగ్‌లో వాటా విక్రయం!
ముంబై: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలియజేసింది. కార్లైల్ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పీఎన్బీకి 32.79 శాతం వాటా, కార్లైల్ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.1,024 కోట్లకు విక్రయించింది. తాజా వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ 3.4 శాతం లాభంతో రూ.1,232 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.62,252 కోట్లుగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. -
స్టాక్స్ వ్యూ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.1,197 టార్గెట్ ధర: రూ.1,600 ఎందుకంటే: భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా 25 శాతానికి పైగా చక్రగతిన రుణ వృద్ధి సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ అనుసరిస్తున్న రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు, డిజిటైజేషన్‌ను వినియోగించుకుంటున్న తీరు, ఉత్పాదకత మెరుగుదల తదితర అంశాల కారణంగా ఈ లక్ష్యాలను కంపెనీ సాధించగలదని విశ్వసిస్తున్నాం. అందుబాటు ధరల గృహరంగానికి డిమాండ్ బాగా పెరుగుతుండటంతో నిర్వహణ ఆస్తులు 2022–23 ఆర్థిక సంవత్సరం కల్లా రూ.4 లక్షల కోట్లకు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సమస్యలతో సతమతం అవుతుండటంతో ఆస్తులు తనఖాగా ఇచ్చే రుణాల(ఎల్ఏపీ)కు డిమాండ్ బాగా ఉండగలదని కంపెనీ భావిస్తోంది. రెరా అమలు కారణంగా కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ కూడా జోరందుకోగలుగుతుందని అంచనా. విదేశీ వాణిజ్య రుణ(ఈసీబీ) నిబంధనలను ఆర్బీఐ సరళీకరించడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశమే. ఇప్పటివరకూ టాప్ 20 నగరాలపైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీ చిన్న నగరాలు, పట్టణాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ సిటీ హోమ్ లోన్లు, ఈ–హోమ్ లోన్లకు ప్రాధాన్యత ఇస్తోంది. రాబడి నిష్పత్తులు ఉత్తమమైన స్థాయిలోనే ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 30 శాతానికి పైగా, రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 2.8 శాతనానికి పైగా ఉన్నాయి. గృహ రుణాలకు డిమాండ్ పెరుగుతుండటం, కంపెనీ ట్రాక్ రికార్డ్ బలంగా ఉండటం... సానుకూలాంశాలు. రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం ఏర్పడితే, అది ఈ కంపెనీపై తీవ్రమైన ప్రభావమే చూపించవచ్చు. డిఫాల్ట్‌లు పెరగడం, రిస్క్ వెయిటేజ్ పెంచడం, రీ ఫైనాన్స్ విషయంలో వడ్డీరేట్లపై పరిమితి వంటి అంశాలపై నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినతరం చేయడం.. ఇవి ప్రతికూలాంశాలు. మారుతీ సుజుకీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.8,890 టార్గెట్ ధర: రూ.10,525 ఎందుకంటే: అంచనాలను మించిన అమ్మకాలు సాధించినా ఈ ఏడాది ఈ షేర్ పెద్దగా పెరగలేదు. ఇంధన ధరలు అధికంగా పెరగడం, జపాన్ కరెన్సీ యెన్ బలపడటం, మాతృకంపెనీ సుజుకీ. టయోటాతో భాగస్వామ్యం విషయంలో పురోగతి పెద్దగా లేకపోవడం తదితర అంశాలు దీనికి కొన్ని కారణాలు. అయితే గతంలో ఇంధన ధరలు పెరిగినా, వాహన విక్రయాలు తగ్గిన దాఖలాలు లేవు. ఇంధన ధరలు పెరిగినా డిమాండ్‌పై పెద్దగా ప్రభావం లేదని డీలర్లంటున్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ఈ కంపెనీ అధిక సంఖ్యలో అందిస్తోంది. సీఎన్జీతో నడిచే ఆరు మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఈ వాహనాలకు డిస్కౌంట్లు ఇవ్వనవసరం లేదు. పైగా ధరల నిర్ణయంలో కంపెనీకి స్వేచ్ఛ ఉంటుంది. కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. అయితే వ్యయ నియంత్రణ పద్ధతులతో పాటు వాహనాల ధరలను పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని కంపెనీ ధీమాగా ఉంది. టొయోటాతో మారుతీ సుజుకీ మాతృకంపెనీ సుజుకీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫలితంగా టయోటా ఎలక్ట్రానిక్ వాహన టెక్నాలజీ మారుతీకి అందనున్నది. వివిధ రకాల వాహనాలను అందుబాటులోకి తేవడం, డిస్కౌంట్లు తగ్గించడం, మాతృకంపెనీ సుజుకీకి చెల్లించాల్సిన రాయల్టీ తగ్గనుండటం, గుజరాత్ ప్లాంట్ పునర్వ్యవస్థీకరణ తదితర అంశాల కారణంగా కంపెనీ నిర్వహణ లాభ మార్జిన్ 2 శాతం పెరిగి 14 శాతానికి చేరగలదని అంచనా. అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటం, మార్జిన్లు అధికంగా ఉండటం, మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్ మోడళ్లను పెంచుతుండటం, జపాన్ కరెన్సీ యెన్ ప్రభావం తగ్గే అవకాశాలు, మార్కెట్ వాటా పెరుగుతుండటం, ...ఇవన్నీ సానుకూలాంశాలు. ఏడాది కాలంలో ఈ షేర్ రూ.10,525కు చేరుతుందని అంచనా వేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
పీఎన్బీని దాటిన ‘హౌసింగ్ ఫైనాన్స్’
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బ నుంచి బైటపడటానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నానా తంటాలు పడుతోంది. అయితే, దీని ప్రతికూల ప్రభావాలతో దాని మార్కెట్ విలువ గణనీయంగా హరించుకుపోయింది. అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (పీఎన్‌బీహెచ్‌ఎఫ్) కన్నా మాతృ సంస్థ పీఎన్బీ మార్కెట్ క్యాప్ తగ్గిపోయింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి పీఎన్‌బీహెచ్‌ఎఫ్ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 21,172 కోట్లు కాగా పీఎన్బీ విలువ రూ. 21,105 కోట్లకు చేరింది. మాతృసంస్థ కన్నా పీఎన్‌బీహెచ్‌ఎఫ్ విలువ రూ. 68 కోట్లు అధికం కావడం గమనార్హం. గురువారం బీఎస్ఈలో పీఎన్బీ షేరు 1.19 శాతం లాభంతో రూ. 76.45 వద్ద ముగియగా, పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేరు 0.44 శాతం క్షీణించి రూ. 1,265 వద్ద క్లోజయ్యింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో పీఎన్బీకి 32.96 శాతం వాటాలు ఉన్నాయి. స్కామ్ బైటపడకముందు ఫిబ్రవరిలో పీఎన్బీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న దానికి రెట్టింపు స్థాయిలో రూ. 44,625 కోట్ల పైచిలుకు ఉండేది. అయితే, రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం వెలుగుచూసినప్పట్నుంచీ షేరు పతనమవుతూ వస్తోంది. ఇక నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలతో ఆర్థిక ఫలితాల కారణంగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పీఎన్బీ స్టాక్ సుమారు 15 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ షేరు పెట్టుబడికి అంత అనువైనది కాకపోవచ్చంటూ ఎడెల్వీస్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ నుంచి తొలి హౌసింగ్ ఫండ్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి అందరికీ ఇల్లు అన్న నినాదం ఇవ్వడమే కాకుండా ఆ దిశగా పలు చర్యలు చేపడుతుండటంతో ఈ రంగంలో వృద్ధి అవకాశాల నుంచి ఇన్వెస్టర్లకు రాబడులను పంచే లక్ష్యంతో ‘హౌసింగ్ అపర్చూనిటీస్’ పేరుతో థీమాటిక్ ఫండ్ ను ప్రవేశపెడుతున్నట్లు హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని హౌసింగ్ ఫైనాన్స్, స్టీల్, సిమెంటు, పెయింట్స్, టైల్స్, వుడెన్ ప్యానెల్స్, శానిటరీవేర్, హోమ్ అప్లయెన్సెస్ తదితర షేర్లలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. ఇది క్లోజ్డ్ ఎండెడ్ థీమాటిక్ పథకం. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారు 1,140 రోజుల వరకు వైదొలగడానికి ఉండదు. నవంబర్ 16న ప్రారంభమైన ఈ ఎన్ఎఫ్వో నవంబర్ 30న ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.5,000గా నిర్ణయించారు. ఈ పథకానికి ఫండ్ మేనేజర్‌గా శ్రీనివాసరావు రావూరి వ్యవహరిస్తున్నారు. గరిష్టంగా 80 నుంచి 85 శాతం ఈక్విటీల్లో, మిగిలిన మొత్తం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. -
తగ్గిన హెచ్డీఎఫ్సీ నికరలాభం
క్యూ1లో రూ.2,734 కోట్లు... న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో...గతేడాది ఇదేకాలంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించి రూ. 2,797 కోట్ల నుంచి రూ. 2,734 కోట్లకు తగ్గింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ. 13,531 కోట్ల నుంచి రూ. 14,463 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన హెచ్డీఎఫ్సీ నికరలాభం రూ. 1,871 కోట్ల నుంచి రూ. 1,556 కోట్లకు పడిపోయింది. స్టాండెలోన్ నికరలాభాన్ని గతేడాది జూన్ క్వార్టర్‌తో పోల్చిచూడరాదని, ఆ క్వార్టర్లో హెచ్డీఎఫ్సీ ఈర్గో జనరల్ షేర్లను విక్రయించడంతో రూ. 275 కోట్ల వన్‌టైమ్ ప్రత్యేక కేటాయింపును లాభనష్టాల ఖాతాలో చూపించినట్లు హెచ్డీఎఫ్సీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. తాజా త్రైమాసికంలో కంపెనీ స్టాండెలోన్ ఆదాయం రూ. 8,393 కోట్ల నుంచి రూ. 8,142 కోట్లకు తగ్గింది. ముగిసిన త్రైమాసికంలో వ్యక్తిగత రుణ పంపిణీలు 21 శాతం వృద్ధిచెందాయని, 2017 జూన్ 30నాటికి తమ మొత్తం లోన్ బుక్ రూ. 2.66 లక్షల కోట్ల నుంచి రూ. 3.13 లక్షల కోట్లకు చేరిందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం స్థూల మొండి బకాయిలు రూ. 3,513 కోట్లని (1.12 శాతం) కంపెనీ ప్రకటన పేర్కొంది. -
సెంట్రల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీని కొంటున్న బీఓబీ
ముంబై: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఒక సబ్సిడరీ చేతులు మారనుంది. సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ (సీబీహెచ్ఎఫ్ఎల్)ను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీహెచ్ఎఫ్ఎల్లో సెంట్రల్ బ్యాంక్‌కు 64 శాతం వాటా వుంది. మిగిలిన వాటా హడ్కో, యూటీఐ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ల వద్ద వుంది. చర్చలు తుదిదశలో వున్నాయని, సెంట్రల్ బ్యాంక్ తన వాటానంతటినీ విక్రయించడానికి అంగీకరించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే సీబీహెచ్ఎఫ్ఎల్లో ఇతర షేర్‌హోల్డర్ల వాటాల్ని కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా సంప్రదించిందీ, లేనిదీ తెలియరాలేదు. -
ఈ నెల 25 నుంచి పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నది. రూ.750-775 ధర శ్రేణిగా గల ఈ ఐపీఓ ఈ నెల 27న ముగియనున్నది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. మొత్తం షేర్లలో 2.5 లక్షల షేర్లను అర్హత గల ఉద్యోగులకు కేటాయిస్తారు. ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 19 ఈక్విటీ షేర్లకు బిడ్ చేయాలి. -
ఎల్ఐసీ నొముర మ్యూచువల్ ఫండ్ నుంచి వైదొలగం: ఎల్ఐసీ
హైదరాబాద్: ఎల్ఐసీ నొముర మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి వైదొలగడం లేదని ఎల్ఐసీ మంగళవారం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను తగ్గించుకోవాలనుకుంటున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని వివరించింది. నొముర మ్యూచువల్ ఫండ్ నుంచి వైదొలుగుతున్నట్లు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు వచ్చిన వార్తలు ఊహాజనితాలేనని పేర్కొంది. ఎల్ఐసీ నొముర మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ప్రస్తుతమున్న తమ స్థితి అలానే కొనసాగుతుందంది.