
ఎల్‌ఐసీ నొముర మ్యూచువల్ ఫండ్ నుంచి వైదొలగం: ఎల్‌ఐసీ
హైదరాబాద్: ఎల్‌ఐసీ నొముర మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ నుంచి వైదొలగడం లేదని ఎల్‌ఐసీ మంగళవారం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను తగ్గించుకోవాలనుకుంటున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని వివరించింది. నొముర మ్యూచువల్ ఫండ్ నుంచి వైదొలుగుతున్నట్లు, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు వచ్చిన వార్తలు ఊహాజనితాలేనని పేర్కొంది. ఎల్‌ఐసీ నొముర మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ప్రస్తుతమున్న తమ స్థితి అలానే కొనసాగుతుందంది.