రూ. 7,000 కోట్ల సమీకరణ లక్ష్యం
సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్‌బీఎఫ్‌సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్‌కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది.
కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్‌బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment