ముంబై: క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్‌ఎస్‌ఎస్) వినియోగదార్ల సంఖ్య 3.13 లక్షలు దాటిందని గృహ రుణ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ప్రధాన మంత్రి అవాస యోజన (పీఎంఏవై) పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎల్‌ఎస్‌ఎస్ కస్టమర్లు రూ.67,000 కోట్ల రుణాలను అందుకున్నట్టు సంస్థ ఎండీ రేణు సూద్ కర్నాడ్ వెల్లడించారు. ‘ప్రభుత్వం ఈ పథకం కింద సబ్సిడీ రూపంలో రూ.48,250 కోట్లు సమకూర్చింది.
ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు 15 శాతంపైగా వాటాతో రూ.7,200 కోట్లు అందుకున్నారు. 92 శాతానికి పైగా కొత్త రుణ దరఖాస్తులు డిజిటల్ మార్గాల ద్వారా వచ్చాయి. మహమ్మారికి ముందు ఇది 20 శాతం కంటే తక్కువగా ఉంది. గుజరాత్ నుంచి అత్యధిక వినియోగదార్లు ఉన్నారు. సీఎల్‌ఎస్‌ఎస్ కింద ఉత్తమ పనితీరు కనబర్చిన గృహ రుణ సంస్థగా అవార్డు పొందాం’ అని వివరించారు.
చదవండి: వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్‌ఫోన్ మీ సొంతం!
Comments
Please login to add a commentAdd a comment