customers service
-
కస్టమర్ల నుంచి అదే పనిగా ఫిర్యాదులు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
జోధ్‌పూర్: కస్టమర్ల నుంచి అదే పనిగా ఫిర్యాదులు వస్తున్నందున దీనికి మూల కారణాలను నియంత్రణ సంస్థలు, అంబుడ్స్‌మెన్ గుర్తించి, అందుకు వ్యవస్థాపరమైన పరిష్కారం చూపాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ అంబుడ్స్‌మెన్ వార్షిక సమావేశం జోధ్‌పూర్‌లో జరిగింది. దీనిని ఉద్దేశించి శక్తికాంతదాస్ మాట్లాడారు. కస్టమర్ల ఫిర్యాదులకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఫైనాన్షియల్ వ్యవస్థ ముఖచిత్రం మారుతోంది. కానీ, అంతర్గత సూత్రాలైన కస్టమర్లకు మెరుగైన సేవలు, కస్టమర్లకు రక్షణ, పారదర్శకత, సరైన ధర, నిజాయితీ వ్యవహారాలు, బాధ్యాయుతమైన వ్యాపార నడవడిక, కన్జ్యూమర్ డేటా, గోప్యత పరిరక్షణ అన్నవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వీటికితోడు మనమంతా కలసి కస్టమర్లకు వైవిధ్యాన్ని చూపాలి’’అని చెప్పారు. కస్టమర్ల అనుభవాన్ని మరింత మెరుగు పరిచేందుకు అంబుడ్స్‌మెన్ తగినన్ని మార్పులు తీసుకురాగలదన్నారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
3.13 లక్షల మంది కస్టమర్లు: హెచ్డీఎఫ్సీ
ముంబై: క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) వినియోగదార్ల సంఖ్య 3.13 లక్షలు దాటిందని గృహ రుణ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ప్రధాన మంత్రి అవాస యోజన (పీఎంఏవై) పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎల్ఎస్ఎస్ కస్టమర్లు రూ.67,000 కోట్ల రుణాలను అందుకున్నట్టు సంస్థ ఎండీ రేణు సూద్ కర్నాడ్ వెల్లడించారు. ‘ప్రభుత్వం ఈ పథకం కింద సబ్సిడీ రూపంలో రూ.48,250 కోట్లు సమకూర్చింది. ఇందులో హెచ్డీఎఫ్సీ కస్టమర్లు 15 శాతంపైగా వాటాతో రూ.7,200 కోట్లు అందుకున్నారు. 92 శాతానికి పైగా కొత్త రుణ దరఖాస్తులు డిజిటల్ మార్గాల ద్వారా వచ్చాయి. మహమ్మారికి ముందు ఇది 20 శాతం కంటే తక్కువగా ఉంది. గుజరాత్ నుంచి అత్యధిక వినియోగదార్లు ఉన్నారు. సీఎల్ఎస్ఎస్ కింద ఉత్తమ పనితీరు కనబర్చిన గృహ రుణ సంస్థగా అవార్డు పొందాం’ అని వివరించారు. చదవండి: వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్‌ఫోన్ మీ సొంతం! -
మీ అంచనాల్ని అందుకోలేకపోయాం, ఏం చేస్తాం చెప్పండి..అంతాకరోనా ఎఫెక్ట్
ముంబై: కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోయినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ సీఈవో వినోద్ కన్నన్ అంగీకరించారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కస్టమర్లకు ఆయన ఒక లేఖ రాశారు. సేవల్లో ఇటీవలి నెలకొన్న అవాంతరాలతో ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావడాన్ని, ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌ను చేరుకునేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి రావడాన్ని అంగీకరించారు. ‘‘విమాన ప్రయాణం అన్నది ఒక లావాదేవీ కాకుండా, సంతోషరమైన ఒక మరపురాని అనుభూతిగా మిగల్చాలని మేరు కోరుకుంటాము. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వెబ్సైట్ కానీ, యాప్ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసు. విమానాశ్రయాల్లో ఆన్‌గ్రౌండ్ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
We Care for You: వాట్సాప్ సర్వీస్ ద్వారా శాంసంగ్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్ బై అపాయింట్మెంట్’. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ కేఫ్‌లలో అపాయింట్మెంట్ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్వాయిస్లను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్లో జమ అవుతుంది. ఈ సర్వీస్ ద్వారా గేలక్సీ ట్యాబ్స్, స్మార్ట్ వాచీలు, బడ్స్ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్ అడ్వాంటేజ్ ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్ బెనిఫిట్(రిఫరెన్స్ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఆన్లైన్ సేవలు 3 రోజల పాటు పనిచేయవని బ్యాంకు తెలిపింది. రేపట్నుంచి వరుసగా 3 రోజులు మే 21, 22, 23 రోజుల్లో మెయింటెనెన్స్ కారణంగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 1.15 గంటల వరకు, అలాగే మే 23న 2.40 గంటల నుంచి 6.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ట్వీట్లో తెలిపింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తున్నాయి. మే 31 వరకు ఇది అమలులో ఉండనుంది. చదవండి: Paytm: ఎల్పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/LNMnKjORMR— State Bank of India (@TheOfficialSBI) May 20, 2021 -
రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం
ముంబై: రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రత, కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్ తొలి ప్రాధాన్యతలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దినేష్ కుమార్ మూడేళ్ల కాలానికి చైర్మన్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కోవిడ్–19 నేపథ్యంలో పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఆర్బీఐ నిర్దేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కంపెనీలకు తగిన మద్దతు అందించడానికి బ్యాంక్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. ► రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. అయితే ఇక్కడ రుణ పునర్వ్యవస్థీకరణను కోరుతున్న కస్టమర్ల సంఖ్యను చూస్తే, బ్యాంక్ నిర్వహించదగిన స్థాయిలోనే ఈ పరిమాణం ఉంది. ► మూలధనం విషయంలో బ్యాంక్ పరిస్థితి పటిష్టంగా కొనసాగుతోంది. ► ఎస్బీఐ డిజిటల్ సేవల వేదిక అయిన ‘యోనో’ను ప్రత్యేక సబ్సిడరీ (పూర్తి అనుబంధ సంస్థ)గా వేరు చేయాలన్న అంశంపై పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. తగిన సమయంలో ఆయా అంశలను వెల్లడిస్తాం. -
అమెజాన్‌లో నకిలీలకు చెక్..!
న్యూఢిల్లీ: ఆన్లైన్ అంగళ్లలో బ్రాండెడ్ కంపెనీల వస్తువులకు బదులుగా కస్టమర్లకు నకిలీలు అందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ మంగళవారం ‘ప్రాజెక్ట్ జీరో’ను ప్రారంభించింది. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో విజయవంతంగా అమలుచేసిన ఈ ప్రాజెక్టును తాజాగా భారత్‌లో ప్రారంభించడం ద్వారా తమ ప్లాట్‌ఫాంలో ఇక నుంచి నకిలీల బెడద ఉండబోదని అమెజాన్ కస్టమర్ ట్రస్ట్ అండ్ పార్ట్నర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేష్ మెహతా ప్రకటించారు. -
ఆన్‌లైన్‌కు ‘ఎక్స్‌పీరియెన్స్’!
సాక్షి, బిజినెస్ విభాగం:ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నా... ఇప్పటికీ ఏదైనా ఉత్పత్తిని కొనుక్కోవాలంటే స్వయంగా చూసి, సంతృప్తి చెందాకే కొనేవారి సంఖ్యే ఎక్కువ. వీళ్లంతా ఆఫ్‌లైన్ స్టోర్స్‌కే ఓటేస్తుంటారు. ఆన్లైన్ సంస్థలు కూడా దీన్ని గుర్తించాయి. అందుకే... ఈ కస్టమర్స్‌కు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఏడాదిలో 11 స్టోర్స్.. ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌కు అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దుస్తులు, ఫర్నిషింగ్స్ రిటైల్ సంస్థ ఫ్యాబ్ ఇండియా ఏడాది వ్యవధిలోనే 11 సెంటర్స్‌ను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 30 సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. డిజిటల్ ప్రపంచానికే పరిమితమైన పెప్పర్ఫ్రై వంటి బ్రాండ్లు కూడా కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉపయోగిస్తున్నాయి. కొనుగోలుదారులు తాము కొనుక్కోవాలనుకునే ఫర్నిచర్‌ను తాకి, చూసి, అనుభూతి చెందాలనుకుంటున్నారని... అందుకే తామూ ఆఫ్‌లైన్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ బాట పట్టామని సంస్థ వర్గాలు తెలిపాయి. కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫర్నిచర్‌ను ఎంచుకునేందుకు పెప్పర్ఫ్రై స్టూడియోస్ తోడ్పడుతున్నాయని, చూడటానికి వచ్చే వారిలో 50 శాతం మందికి పైగా కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో పెప్పర్ఫ్రై తమ ఆఫ్‌లైన్ వ్యూహాన్ని మరింత భారీగా విస్తరిస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ఆఖర్లో 29 స్టూడియోస్ ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 52కి చేరింది. అదే బాటలో చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థలు.. ఆన్లైన్ మాధ్యమం ద్వారా అరంగేట్రం చేసిన వన్ ప్లస్ తొలిసారిగా బెంగళూరులో ఎక్స్పీరియన్స్ స్టోర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు చెన్నై, ఢిల్లీలో కూడా ప్రారంభించింది. భారతీయ కొనుగోలుదారులు ఏదైనా కొనడానికి ముందు నేరుగా చూడటానికే ప్రాధాన్యమిస్తారని.. అందుకే ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ప్రీమియం కొనుగోలుదారులు తాము కొనుక్కునే ఉత్పత్తికి సంబంధించి అదనపు హంగులు కూడా కోరుకుంటారని.. అందుకే ప్రీమియం కాఫీ ఇవ్వడం వంటి సేవలు అందించడం ద్వారా ప్రత్యేక అనుభూతి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వన్ ప్లస్ పోటీ సంస్థ షావోమీ కూడా ఇదే తరహాలో చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో అయిదు ఎంఐ హోమ్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవలే రీలాంచ్ చేసిన జావా బైక్ బ్రాండ్ సంగతి తీసుకుంటే.. వీటి స్టోర్స్‌కి వచ్చే కొనుగోలుదారులు ఆయా బైక్‌ల పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవచ్చు. జావా సంబంధ టీ షర్టులు, యాక్సెసరీస్‌ను కొనుక్కోవచ్చు. లేదా లోపలే ఏర్పాటు చేసిన చిన్న పాటి లైబ్రరీలో పుస్తకాలు తిరగేయొచ్చు. అమ్మకాల్లోనూ వృద్ధి .. ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌తో అమ్మకాలూ గణనీయంగానే పెరుగుతున్నాయి. సాధారణంగా స్టోర్‌ను రీడెవలప్ చేస్తే అమ్మకాల వృద్ధి 6–7 శాతం మేర ఉంటుందని, కానీ ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌తో 30 శాతం దాకా వృద్ధి ఉంటోందని ఫ్యాబ్ ఇండియా వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఆన్లైన్ ఆర్డరుతో పోలిస్తే తమ స్టూడియోకి వచ్చే వినియోగదారులిచ్చే ఆర్డరు విలువ సగటున మూడు రెట్లు ఎక్కువగా ఉంటోందని పెప్పర్ఫ్రై వర్గాలు తెలిపాయి. తమ ఆదాయాల్లో దాదాపు 30 శాతం వాటా స్టూడియోస్ నుంచే ఉంటోందని వివరించాయి. స్టూడియో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అమ్మకాలు 90–100 శాతం దాకా కూడా పెరుగుతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపాయి. ఆదాయాల్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ వాటాను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 45 శాతానికి పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. సాధారణంగా ఇంటి అలంకరణ, లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్ చాలా ఏళ్లుగా ఎక్స్పీరియన్స్ స్టోర్స్‌ను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటి ద్వారా తాము అందించే విస్తృత శ్రేణిని ఒకే దగ్గర షోకేస్ చేసేందుకు వీలవుతుందని రోకా బాత్రూమ్ ప్రొడక్ట్స్ వర్గాలు తెలిపాయి. 50,000 చ.అ.లకు మించిన విస్తీర్ణం ఉండేలా భారీ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ ఎండీ వసంత్ కుమార్ పేర్కొన్నారు. అయితే, కేవలం ఉత్పత్తులను డిస్ప్లే చేయడం, ధరల విషయాల గురించి తెలియజేయడం మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ ఉద్దేశం కాదు. కొనుగోలుదారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో షాపింగ్ అనుభూతినివ్వడమే వీటి లక్ష్యమని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
గిఫ్టా..? ఓ కార్డిచ్చేద్దాం!!
న్యూఢిల్లీ: వివాహాది శుభకార్యాలు, ఇతరత్రా సందర్భాలకు ఏం గిఫ్టులివ్వాలనేది చాలా మందికి పెద్ద సమస్యే? దానిపై సందర్భాన్ని బట్టి అయితే ఇంట్లో వాళ్లతో, లేకుంటే స్నేహితులతో చర్చోపచర్చలు సహజం. ఇదిగో... ఈ పరిస్థితిని చూశాకే గిఫ్ట్ కార్డుల ట్రెండ్ మొదలయింది. అందరికీ వీటి గురించి అర్థమయ్యాక ఈ ట్రెండ్ బాగా జోరందుకుంది. ఈ ప్రీ–పెయిడ్ గిఫ్ట్ కార్డులు ఇటు కొనుగోలుదారులు.. అటు వ్యాపార సంస్థలు... ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ పెర్సిస్టెన్స్ మార్కెట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా గిఫ్ట్ కార్డ్ మార్కెట్ ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2024 నాటికి 698 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. క్విక్సిల్వర్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం దేశీ మార్కెట్ విలువ సుమారు 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పెరగనుంది. దేశీయంగా గిఫ్ట్ కార్డుల కొనుగోలుకు సంబంధించి 90 శాతం లావాదేవీలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని రీసెర్చ్ సంస్థల అధ్యయనాల్లో వెల్లడైంది. రూ. 3వేల కోట్ల మార్కెట్.. రిటైల్, కార్పొరేట్ కస్టమర్స్‌కు గిఫ్ట్ కార్డ్ సొల్యూషన్స్ అందించే క్విక్సిల్వర్ నివేదిక ప్రకారం.. 2018–19లో 75 కోట్ల పైచిలుకు గిఫ్ట్ కార్డు లావాదేవీలు జరిగాయి. ఈ మార్కెట్ పరిమాణం రూ.3,000 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ సందర్భాల్లో బహుమతిగా ఇచ్చేందుకే కాకుండా సొంతానికి కూడా గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పెద్ద మార్కెట్ ప్లేస్‌లు, ఆఫ్‌లైన్ బ్రాండ్ స్టోర్స్ మొదలైన వాటిల్లో గిఫ్ట్ కార్డుల లభ్యత దాదాపు మూడు రెట్లు పెరిగింది. ‘సంప్రదాయ బహుమతులతో పోలిస్తే గిఫ్ట్ కార్డులను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గిఫ్టుల కోసం షాపింగ్ చేయాలంటే బద్ధకించే వారు ఆఖరు నిమిషంలోనే వీటిని ఎంచుకునే వారు. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ మారుతోంది‘ అని క్విక్సిల్వర్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు ప్రతాప్ టీపీ తెలిపారు. బహుమతులు ఇచ్చేవారి ధోరణుల్లో మార్పులను ఈ ట్రెండ్ సూచిస్తోందని మోగే మీడియా చైర్మన్ సందీప్ గోయల్ అభిప్రాయపడ్డారు. ‘సాధారణంగా మనం ఇచ్చే గిఫ్టు అవతలివారికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది, అది వారికి కూడా ఇష్టమైనదేనా అన్నది మనకి కచ్చితంగా తెలిసే అవకాశాలు తక్కువ. అందుకే గిఫ్ట్ కార్డు రూపంలో ఇస్తే.. అందుకునేవారు తమకు కావాల్సినది కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ధోరణి.. సాధారణంగా గిఫ్ట్ కార్డుల మార్గాన్ని ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. దీంతో అమెజాన్ గిఫ్ట్‌కార్డ్స్ వంటి వాటికి కార్పొరేట్ మార్కెట్టే ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్రమంగా రిటైల్ కస్టమర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు కూడా కాస్త వైవిధ్యమైన కార్డులను ప్రవేశపెడుతున్నాయి. అమెజాన్ స్టోర్‌లో తొలిసారిగా షాపింగ్ చేసేవారికి గిఫ్ట్‌కార్డులు అనువైనవిగా ఉంటాయని అమెజాన్ పేమెంట్స్ డైరెక్టర్ షరీక్ ప్లాస్టిక్వాలా తెలిపారు. భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, కర్ణాటకలోని దావణగెరె, మహారాష్ట్రలోని బీడ్ వంటి ప్రాంతాల్లో గిఫ్ట్ కార్డులకు మంచి డిమాండ్ ఉంటోందని ఆయన పేర్కొన్నారు. అమెజాన్ గిఫ్ట్ కార్డులను కేవలం షాపింగ్‌కు మాత్రమే కాకుండా కరెంటు, నీటి బిల్లులు కట్టేందుకు, ఫ్లయిట్స్.. హోటల్ బుకింగ్స్ మొదలైన వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. 35 ఏళ్ల లోపు వారే అధికం.. దేశీయంగా గిఫ్ట్ కార్డు యూజర్లలో 85 శాతం మంది 35 ఏళ్ల లోపు వయస్సుగలవారే. ఈ కార్డుల వినియోగంలో టాప్ 10 మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్, పట్నా, ఇండోర్, జైపూర్, ఆగ్రా, భువనేశ్వర్, చండీగఢ్, కొచి, సోనిపట్, లక్నో ఉన్నాయి. ఈ నగరాల్లో వినియోగం మూడు రెట్ల నుంచి అయిదు రెట్ల దాకా పెరిగింది. కొత్త సీసాలో.. ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న గిఫ్ట్ కార్డులు వాస్తవానికి గతంలోనూ ఉండేవి. అప్పుడవి గిఫ్ట్ చెక్కుల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్వరూపం మారింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దశాబ్దాలుగా గిఫ్ట్ చెక్కులు జారీ చేసేదని బ్రాండ్ బిల్డింగ్డాట్కామ్ వ్యవస్థాపకుడు అంబి పరమేశ్వరన్ తెలిపారు. షాపర్స్ స్టాప్, క్రాస్‌వర్డ్, లైఫ్‌స్టయిల్ వంటి సంస్థలు గిఫ్ట్ కార్డుల సంస్కృతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడిక ఆన్లైన్ గిఫ్ట్ వోచర్లు.. మళ్లీ మార్కెట్లో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. రిటైలర్లకు లాభం.. కొనుగోలుదారులకు గిఫ్ట్ కార్డులు సౌకర్యవంతంగానే ఉంటున్నాయి. అదే సమయంలో వీటిని అమ్మే రిటైల్ సంస్థలకు ఇవి లాభసాటిగా కూడా ఉంటున్నాయి. కార్డులన్నీ ప్రీ–పెయిడ్ కావడం వల్ల .. దాన్ని గిఫ్ట్‌గా అందుకున్న వారు కొనుగోళ్లు జరపడానికి ముందుగానే సదరు రిటైలర్ల ఖాతాలో డబ్బు చేరినట్లే. పైగా .. చాలా మటుకు కార్డుల విలువలో 60–90 శాతం దాకా మాత్రమే వినియోగం ఉంటోంది. ఇలా మిగిలిపోయిన మొత్తం అంతా గిఫ్ట్ కార్డులు జారీ చేసిన సంస్థలకు లాభమే. -
కస్టమర్ల చాయిస్ స్మార్ట్ హోమ్స్
సాక్షి, హైదరాబాద్: గృహ నిర్మాణ రంగంలో స్మార్ట్ హోమ్స్ డిమాండ్ శరవేగంగా పెరుగుతుంది. ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువూ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానమై ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ స్మార్ట్ హోమ్స్ మార్కెట్ 893 మిలియన్ డాలర్లుగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని పూర్వాంకర ఎండీ ఆశీష్ పూర్వాంకర అంచనా వేశారు. గత దశాబ్ద కాలంగా డెవలపర్ల దృక్పథాన్ని మార్చిన పలు అంశాలను ఆయన చర్చించారు. అవేంటంటే.. దేశంలో ఈ–కామర్స్ కంపెనీల సక్సెస్‌తో రియల్టీ రంగంలోకి కూడా స్టార్టప్స్ ఎంట్రీ ఇచ్చాయి. దశాబ్ద కాలంగా ప్రాపర్టీ క్రయ విక్రయాలు, నిర్వహణ సేవలను అందించే కంపెనీలు జోరందుకున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ హోమ్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువూ ఇంటర్నెట్, రిమోట్ కంట్రోల్‌తో నడిచే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు సౌకర్యవంతంగాను, ఎంటర్టైన్మెంట్, భద్రత కలిగిస్తుంది. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఇంటిని, ఇంట్లోని ప్రతి వస్తువును ఆపరేట్ చేసే వీలుంటుంది. గత పదేళ్లలో రియల్టీ పరిశ్రమ డిజిటల్ వైపు మళ్లింది. నిర్మాణాల్లో డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), మిషన్ లెర్నింగ్ వంటి ఆటోమేటెడ్ టెక్నాలజీల వినియోగంపై దృష్టిసారించారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుంచి పుణె, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు వంటి నాన్–మెట్రో నగరాల వైపు డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు. ►నిర్మాణ సామగ్రి, డిజైన్, టెక్నాలజీ అన్నింట్లోనూ డెవలపర్లు పర్యావరణహితమైనవి కోరుకుంటున్నారు. డిజైన్‌తో పాటూ నిర్మాణ సామగ్రి వినియోగంలోనే గ్రీన్ ఉత్పత్తులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో గత పదేళ్లలో నిర్మాణ రంగంలో గ్రీన్ టెక్నాలజీ పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. సీనియర్ సిటిజన్స్, సింగిల్ ఉమెన్, సింగిల్ ఓనర్స్ ఇలా సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా వేర్వేరు నివాస ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఆయా వయస్సు, లింగ భేదాలకు తగ్గట్లుగా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ►ఈ మధ్య కాలంలో అఫడబుల్ విభాగానికి విపరీతమైన డిమాండ్ వస్తుంది. దీంతో చిన్న, పెద్ద డెవలపర్లు అందరూ అఫడబుల్ ప్రాజెక్ట్‌ల మీద దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ పన్ను రాయితీలు, వడ్డీ మినహాయింపుల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు సొంతింటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. -
బ్యాంకు ఖాతాదారులపై మరో బాదుడు
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే సర్‌ఛార్జీల పేరుతో కస్టమర్లపై భారం వేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు , ఇకపై బ్యాంకింగ్ జీఎసీటీ ట్యాక్స్‌ను కూడా కస్టమర్లపైనే వేయనున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ మేయిన్‌టెన్ చేస్తున్నవారికి అందించే ఉచిత సర్వీసులమీద కూడా జీఎస్టీ బాదుడుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. అంటే కస్టమర్లకు అందించే సర్వీసులు ఇక భారం కానున్నాయి. ముఖ్యంగా చెక్ బుక్ జారీ, క్రెడిట్ కార్డ్ మంజూరు, ఏటీఎంల వాడకం, ఫ్యూయల్ సర్ఛార్జ్ రిఫండ్స్ వంటి సేవలపై ప్రభుత్వం జీఎస్టీ విధించనుంది. తద్వారా దాదాపు రూ. 40,000 కోట్ల ట్యాక్స్ , పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టనుంది. రెండు నెలల క్రితం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జీఎస్టీ విధింపుపై బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లాంటి బ్యాంకులు జీఎస్టీ బాదుడుకు సిద్ధం కానున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. దీంతో దేశంలో ఉన్న అన్ని మేజర్ బ్యాంకులు18శాతం జీఎస్టీ విధింపునకు తమ సమ్మతిని తెలియచేశాయట. అయితే ఎంత జీఎస్టీ విధించాలన్నదానిపై తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అలాగే చాలా బ్యాంకులు ఈ డిసెంబరునుంచే జీఎస్టీ వడ్డనకు సిద్ధమవుతున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో కేజీ కన్నన్ పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే కస్టమర్ల పన్ను చెల్లింపులు నేరుగా ప్రభుత్వానికే వెళ్ళిపోతాయని అభిప్రాయపడ్డారు. సీజీఎస్టీ చట్టం లోని షెడ్యూల్ 2 ప్రకారం ఇతర నాన్ బ్యాంకింగ్ రంగాల్లో కూడా జీఎస్టీ అమలుపై ఆదాయన పన్ను శాఖ కసరత్తులు చేస్తుంది. ఈ నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్ బ్యాంకులైన డీబీఎస్, సిటీబ్యాంక్ కూడా ఉన్నాయి. -
పెరుగుతున్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. డేటా వినియోగం భారీగా వృద్ది చెందుతోందని, ఈ ఏడాది ఆగస్టులో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 46.36 కోట్లకు పెరిగిందని టెలికం డిపార్ట్మెంట్(డీఓటీ) తెలిపింది. అంతకు ముందటి నెల జూలైలో ఉన్న వినియోగదారుల సంఖ్య(46 కోట్లు)తో పోల్చితే 0.74 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. డాట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ∙ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టులో మొత్తం ఫోన్ వినియోగదారుల సంఖ్య 97.3 లక్షలు పెరిగి 118.9 కోట్లకు చేరింది. వీరిలో వైర్‌లైన్ ఫోన్ వినియోగదారుల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 0.84 శాతం వృద్ధిచెంది 116.7 కోట్లకు ఎగసింది. ∙ఈ ఆగస్టులో మొత్తం ఫోన్ కనెక్షన్లు అధికంగా ముంబైలో పెరిగాయి. ముంబైలో 19.35 లక్షల ఫోన్ కనెక్షన్లు పెరిగాయి. -
‘డాట్సన్ గో, గో ప్లస్’ కొత్త వేరియంట్లు
చెన్నై: జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్.. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ‘డాట్సన్ గో, గో ప్లస్’ కార్లలో కొత్త వేరియంట్లను బుధవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. దాదాపు 100కు పైగా అప్డేట్స్, 28 నూతన ఫీచర్లు ఈ వేరియంట్లలో ఉన్నట్లు ప్రకటించింది. గో బ్రాండ్ ధర రూ.3.29 లక్షలు కాగా, గో ప్లస్ ధర రూ.3.83 లక్షలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పీటర్ క్లిస్సోల్డ్ మాట్లాడుతూ.. ‘ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాం. కారును కొనుగోలు చేసే ముందు కస్టమర్లు డీలరు వద్దకు వెళ్లి సర్వీస్ బాగుందనే విషయం తెలుసుకున్న తరువాత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 270 అవుట్లెట్లు ఉండగా.. ఈ ఏడాదిలో మరింత మంది డీలర్లు జతకానున్నారని అంచనావేస్తున్నాం. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. దక్షిణ ఆఫ్రికా, నేపాల్‌తో పాటు మరికొన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్స్ కొనసాగుతున్నాయి. తాజా వేరియంట్లలో మ రింత సౌకర్యవంతమైన, సురక్షితమైన జపనీస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంది.’ అని వ్యాఖ్యానించారు. -
60 వేల వరకు వడ్డీ లేని రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో ముందడుగు వేసింది. డిజిటల్ పేమెంట్స్ సాధనం అయిన అమెజాన్ పే తాజాగా అమెజాన్ పే ఈఎంఐ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. వాయిదాల్లో చెల్లించేలా అర్హులైన కస్టమర్లకు ఉపకరణాల కొనుగోలుకు రూ.60,000 వరకు రుణం మంజూరు చేస్తారు. క్రెడిట్ కార్డు లేని, డెబిట్ కార్డు ఉన్నా ఈఎంఐ సౌకర్యం పొందలేని వినియోగదార్ల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన డిజిటల్ లెండింగ్ స్టార్టప్ కంపెనీ క్యాపిటల్ ఫ్లోట్‌తో అమెజాన్ చేతులు కలిపింది. 3, 6 నెలల వాయిదాల్లో రుణం చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఉండదు. వాయిదాలు ఆరు నెలలు దాటితే కాలాన్నిబట్టి వడ్డీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లేదు. 60 సెకన్లలోనే రుణం జారీ చేస్తారు. ఎక్స్చేంజ్ ఆఫర్ లేకుండా కనీసం రూ.8,000 ఆపైన ఖరీదైన ఒక ఐటెమ్ కొనుగోలుపై మాత్రమే లోన్ ఇస్తారు. రుణం ఇలా పొందండి.. కార్డ్‌లెస్ ఈఎంఐ పొందాలంటే అమెజాన్ ఐడీ తప్పనిసరి. కొనుగోలు హిస్టరీ ఆధారంగా రుణం ఇచ్చేది నిర్ణయిస్తారు. ఆధార్ నంబర్, వోటర్ ఐడీ లేదా పాన్ నంబర్ ఉండాలి. కస్టమర్లు ముందుగా అమెజాన్ యాప్‌లోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐని ఎంచుకోవాలి. అడిగిన వివరాలు పొందుపరచాలి. ఆధార్ నంబరుతో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ పంపి వెరిఫై చేసుకుంటారు. ఎంత రుణం వచ్చేది స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. అమెజాన్ వెబ్సైట్లో వాయిదాల్లో విక్రయానికి ఉన్న ఉత్పత్తిని కార్ట్‌లోకి చేర్చుకోవాలి. చెకింగ్ ఔట్ సమయంలో ఈఎంఐ మెనూలోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐ ఎంచుకోవాలి. ఈఎంఐ ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. వాయిదాల చెల్లింపుకు డెబిట్ కార్డును అనుసంధానించాలి. మొబైల్స్ అమ్మకాల్లో 10 శాతం వాటా: అమెజాన్ భారత మొబైల్స్ విక్రయాల్లో 10 శాతం వాటా దక్కించుకున్నట్టు అమెజాన్ వెల్లడించింది. ఆన్లైన్లో మొబైల్స్ అమ్మకాల్లో 33–35 శాతం వాటా చేజిక్కించుకున్నామని అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ లీడర్ నిశాంత్ సర్దానా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘కంపెనీ వెబ్సైట్లో 2,500 రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఇందులో 250 దాకా ఎక్స్‌క్లూజివ్ మోడళ్లు ఉంటాయి. ఇన్ని రకాల ఫోన్లను నిల్వ చేయడం రిటైల్ దుకాణ వర్తకులకు సాధ్యం కాదు. ఎక్స్చేంజ్, నెల వాయిదాల్లో ఫోన్లను ఆఫర్ చేస్తున్నాం. రూ.500ల కనీస ఈఎంఐతో ఫోన్‌ను కొనుక్కోవచ్చు’ అని తెలిపారు. గతేడాది పండుగల సీజన్‌తో పోలిస్తే ఈసారి రెండింతల అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. -
కస్టమర్లే టార్గెట్ : ఉబెర్ కొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ ఇండియా సరికొత్త ప్రణాళికలతో దూసుకు వస్తోంది. భారత్‌లో ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులే లక్ష్యంగా వ్యూహ రచన చేసింది. డారా ఖోస్రోషహీ నాయకత్వంలో ఉబెర్ ఇండియా ఇక్కడి మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తోంది. నెట్వర్క్ లో కనెక్టివిటీ పరిస్థితుల్లోనూ, అలాగే తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లలో కూడా బాగా పని చేయడానికి వీలుగా ఉబెర్ యాప్‌లో 'లైట్' వెర్షన్‌ను లాంచ్ చేసింది. అంతేకాదు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ ఉబెర్‌లైట్ వెర్షన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. త్వరలోనే భారతీయ భాషలు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ , గుజరాతీ భాషల్లో విడుదల చేయనుంది. తద్వారా భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రధాన ప్రత్యర్థి ఓలాను ఢీకొట్టేందుకు సిద్దపడుతోంది. టైర్ -3 నగరాలలో దాని వినియోగదారుల సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి, ప్రజాదరణను పెంచుకోటానికి ఉబెర్ తన యాప్‌లో డేటా-లైట్ సంస్కరణను ప్రవేశపెట్టింది. స్థానిక కస్టమర్లకు ఆకట్టుకునేలా వారికి అందబాటుల్లో భాషల్లో యాప్‌ను లాంచ్ చేయనుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఉబెర్ లైట్ రానున్న నెలల్లో దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ఉబెర్ ప్రకటించింది. ఏడు భారతీయ భాషలలో దీన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లకు రైడ్-బుకింగ్ అనుభవాన్ని సాధ్యమైనంత మృదువుగా, సన్నిహితంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం యూజర్లతో మాట్లాడుతున్నామని ఉబెర్ రైడర్ ప్రొడక్షన్ హెడ్ పీటర్ డెంగ్ చెప్పారు. -
బ్యాంకుల వద్ద హెల్ప్‌డెస్క్‌లు
మచిలీపట్నం : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా పారా లీగల్ వాలంటీర్లతో వారికి సేవలు అందించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు చెప్పారు. బుధవారం జిల్లా జడ్జి తన చాంబర్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారులు నగదు డిపాజిట్, తీసుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పారా లీగల్ వాలంటీర్లను బ్యాంకుల వద్ద ఉంచి నగదు డిపాజిట్ చేసే సమయంలో, తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతోపాటు సంబంధిత ఫారాలను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బుధవారం నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయని, అవసరమైనన్ని రోజులు ఈ సేవలు అందజేస్తామన్నారు. మచిలీపట్నం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, ఆంధ్రాబ్యాంక్ ఫౌండర్స బ్రాంచ్, సిండికేట్ బ్యాంక్, గూడూరులో ఎస్బీఐ బ్యాంక్, పెడనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వద్ద పారాలీగల్ వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని 11 మండల న్యాయసేవాధికార కమిటీల పరిధిలోని బ్యాంకుల వద్ద పారాలీగల్ వాలంటీర్ల సేవలను అందజేస్తామన్నారు. నగదు డిపాజిట్ చేసే సమయంలో దళారీల ప్రమేయం లేకుండా పారాలీగల్ వాలంటీర్లు చూస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు.