న్యూఢిల్లీ: ఆన్‌లైన్ అంగళ్లలో బ్రాండెడ్ కంపెనీల వస్తువులకు బదులుగా కస్టమర్లకు నకిలీలు అందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ మంగళవారం ‘ప్రాజెక్ట్ జీరో’ను ప్రారంభించింది. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో విజయవంతంగా అమలుచేసిన ఈ ప్రాజెక్టును తాజాగా భారత్‌లో ప్రారంభించడం ద్వారా తమ ప్లాట్‌ఫాంలో ఇక నుంచి నకిలీల బెడద ఉండబోదని అమెజాన్ కస్టమర్ ట్రస్ట్ అండ్ పార్ట్‌నర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేష్ మెహతా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment