e-commerce company Amazon
-
అమెజాన్ కోటీశ్వరులు 4,152 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది 1.5 లక్షల మంది వర్తకులు తమ వేదికపైకి కొత్తగా వచ్చారని ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఆదివారం వెల్లడించింది. కోవిడ్–19 ఉన్నప్పటికీ ఇక్కడి విక్రేతలు విజయవంతం అయ్యారని తెలిపింది. అమెజాన్ ఇండియా ఎస్ఎంబీ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 70,000 పైచిలుకు వర్తకులు మొత్తం సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఉత్పత్తులను 15 అంతర్జాతీయ అమెజాన్ వెబ్సైట్ల ద్వారా ఎగుమతి చేశారు. ఉత్తర అమెరికా, ఈయూ, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా నుంచి భారత ఉత్పత్తులకు డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. 2020లో రూ.1 కోటి, ఆపైన విక్రయాలు నమోదు చేసినవారు 4,152 మంది ఉన్నారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది కరోడ్‌పతి సెల్లర్స్ సంఖ్య 29% పెరిగింది. వేదికపై 20 కోట్లకుపైగా.. సహేలీ కార్యక్రమం ద్వారా మహిళా వర్తకుల వ్యాపారం 15 రెట్లు అధికమైంది. చేనేత, చేతివృత్తులవారు 2.8 రెట్లు తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. 55,000 స్థానిక స్టోర్స్ అమెజాన్‌తో చేతులు కలిపాయి. 10 లక్షల పైచిలుకు చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలతో కలిసి కంపెనీ పనిచేస్తోంది. వీరిలో విక్రేతలు, డెలివరీ, లాజిస్టిక్స్ భాగస్వాములు, కిరాణా వర్తకులు, డెవలపర్స్, కంటెంట్ క్రియేటర్స్, రచయితలు ఉన్నారు. ఆన్లైన్ సెల్లర్స్ 7 లక్షల పైమాటే. బీటూబీ మార్కెట్‌ప్లేస్‌లో 3.7 లక్షల మంది సెల్లర్స్ ఉన్నారు. వీరు జీఎస్టీ ఆధారిత 20 కోట్లకుపైగా ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నారు. రచయితలకూ ఆదాయం.. నవంబర్ 30 నాటికి కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ (కేడీపీ) వేదిక ద్వారా రచయితలు రూ.45 కోట్లకుపైగా ఆర్జించారు. కేడీపీ ఏటా రెండు రెట్లు పెరుగుతోంది. వందలాది మంది రచయితలు ఒక్కొక్కరు రూ.1 లక్షకుపైగా రాయల్టీ పొందారు. అలెక్సా కోసం భారత్‌కు చెందిన ఒక లక్ష మంది డెవలపర్లు పనిచేస్తున్నారు. వీరు అలెక్సా స్కిల్స్ కిట్ ద్వారా 30,000 పైగా నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. వేలాది స్మార్ట్ హోం ఉపకరణాలు అలెక్సాతో అనుసంధానించవచ్చు. అలెక్సాతో కూడిన 100కు పైచిలుకు స్మార్ట్ స్పీకర్స్, ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇదీ అమెజాన్ లక్ష్యం.. సుమారు రూ.7,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ ఇండియా ప్రకటించింది. 2025 నాటికి ఒక కోటి చిన్న, మధ్యతరహా వ్యాపారులను ఆన్లైన్ వేదికపైకి తీసుకురావడం, రూ.74,000 కోట్లకు ఆన్లైన్ ఎగుమతులను చేర్చడం, అదనంగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. -
అమెజాన్‌లో నకిలీలకు చెక్..!
న్యూఢిల్లీ: ఆన్లైన్ అంగళ్లలో బ్రాండెడ్ కంపెనీల వస్తువులకు బదులుగా కస్టమర్లకు నకిలీలు అందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ మంగళవారం ‘ప్రాజెక్ట్ జీరో’ను ప్రారంభించింది. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో విజయవంతంగా అమలుచేసిన ఈ ప్రాజెక్టును తాజాగా భారత్‌లో ప్రారంభించడం ద్వారా తమ ప్లాట్‌ఫాంలో ఇక నుంచి నకిలీల బెడద ఉండబోదని అమెజాన్ కస్టమర్ ట్రస్ట్ అండ్ పార్ట్నర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేష్ మెహతా ప్రకటించారు. -
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
-
అమెజాన్ నుంచి ఇక ‘కిరాణా నౌ’
త్వరలో దేశవ్యాప్తంగా విక్రయాలు దీనికోసం చిరు వ్యాపారులతో జట్టు ‘సాక్షి’తో అమెజాన్ డెరైక్టర్ అమిత్ పాండే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిత్యావసర వస్తువుల్ని ఆన్‌లైన్‌లోకి తేవడానికి ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సిద్ధమయింది. ఇందుకోసం ‘కిరాణా నౌ’ పేరిట చిన్నచిన్న కిరాణా వర్తకులతో చేతులు కలుపుతోంది. బెంగళూరులో కంపెనీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ఆరంభించింది. దుకాణదారులు స్మార్ట్‌ఫోన్ ఉంటే ‘కిరాణా నౌ’లో భాగస్వాములుత కావొచ్చు. ప్రస్తుతానికి కస్టమర్ తన మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే ఆన్లైన్లో సరుకులను ఆర్డర్ చేయాలి. 4 గంటల్లోపు డెలివరీ చేస్తారు. వ్యాపారులను సమాయత్తం చేసేందుకు 18 నగరాల్లో తమ బృందాలు నిమగ్నమయ్యాయని అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ డెరైక్టర్ అమిత్ దేశ్‌పాండే తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పెట్టుబడులు రూ.12,000 కోట్లు... భారత్‌లో రూ.12,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైనట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలియజేశారు. ఇందులో భాగంగానే 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో హైదరాబాద్‌లోని కొత్తూరులో గిడ్డంగి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ‘మే’ నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ గిడ్డంగి... భారత్‌లో కంపెనీకి అతిపెద్దదిగా మారుతుంది. దీంతో 9 రాష్ట్రాల్లో కంపెనీ నిర్వహిస్తున్న 10 గిడ్డంగుల మొత్తం సామర్థ్యం 10 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది. ఈ గిడ్డంగితో దక్షిణాది రాష్ట్రాలకు ఉత్పత్తులను వేగంగా డెలివరీ ఇచ్చేందుకు కంపెనీకి వీలవుతుందన్నారు. పెద్ద నగరాల వాటా సగమే... అమెజాన్ వ్యాపారంలో పెద్ద నగరాల వాటా 50 శాతం ఉండగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా 50 శాతం నమోదవుతోందని అమిత్ దేశ్‌పాండే చెప్పారు. 50 శాతం కస్టమర్లు మొబైల్ ఫోన్ ద్వారా ఆర్డర్లిస్తున్నారని తెలియజేశారు. ‘దేశవ్యాప్తంగా 22వేల మంది వ్యాపారులు అమెజాన్‌తో చేతులు కలిపారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 3 వేల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ముత్యాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాల వ్యాపారులు దేశవ్యాప్తంగా విస్తరణకు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రాముఖ్యత ఉన్న నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరల వంటి ఉత్పత్తులకు ఆన్లైన్ వేదిక కల్పించనున్నాం. గిడ్డంగి ఏర్పాటైతే వ్యాపారం గణనీయంగా పెరుగుతుంది’ అని చెప్పారు.