Housing Finance Company
-
ఎఫ్డీపై అధిక వడ్డీ ఇస్తున్న సంస్థలు
-
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆర్బీఐ కొరడా
నిబంధనలు పాటించని మూడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీలను విధించింది.సెంట్రల్ బ్యాంక్ గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కొక్కటి రూ. 5లక్షలు, అలాంటి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ. 3.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం, 1987లోని సెక్షన్ 52A నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఆర్బీఐ ఈ జరిమానాలు విధించింది.రూ.75 లక్షలు, ఆపైడి రుణాల మంజూరులో గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ తమ ప్రమాణాలను పాటించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 'ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్'పై ఆర్బీఐ ఆదేశాలకు విరుద్ధంగా కొంతమంది రుణగ్రహీతలకు రుణం వాస్తవ పంపిణీ/చెక్ జారీ తేదీ కంటే ముందు కాలానికి రుణాలపై వడ్డీని వసూలు చేసిందని ఆర్బీఐ కనుగొంది.ఇక హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయానికి వస్తే "2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ కస్టమర్ల రిస్క్ వర్గీకరణను చేపట్టడంలో విఫలమైంది. ఖాతాల రిస్క్ వర్గీకరణను కాలానుగుణంగా సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు" అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ముకుతాడు
ముంబై: ఆర్థిక అంశాల విషయంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు నిబంధనలను కఠినతరం చేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ డిపాజిట్ల మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఒక ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. కొన్ని నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తున్నట్లు ఒకవైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ఫిబ్రవరి 29వ తేదీలోపు ఈ ముసాయిదా పత్రంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది. హెచ్ఎఫ్సీల డిపాజిట్ల చెల్లింపులకు సంబంధించి నిధుల లభ్యత అవసరాల నిర్వహణను మెరుగుపరచుకోవడంపై కూడా ఈ సర్క్యులర్‌లో ఆర్బీఐ దృష్టి సారించింది. ప్రతిపాదిత తాజా ముసాయిదా ప్రకారం, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌లు లేని హెచ్ఎఫ్సీలు పబ్లిక్ డిపాజిట్లను స్వీకరించలేవు. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంతో పాటు నిర్దిష్ట రుసుము ఆధారిత కార్యకలాపాలలోకి హెచ్‌ఎఫ్‌సీలను అనుమతించే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతితో, రిస్క్ షేరింగ్ లేకుండా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులతో కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి కొన్ని హెచ్ఎఫ్సీలకు అనుమతి లభిస్తోంది. ఇది రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి వర్తిస్తుంది. అటుపై దీనిపై సమీక్ష, దీనికి అనుగుణంగా తదుపరి అనుమతులు ఉంటాయి. ప్రస్తుతం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం (120 నెలల లోపు) తర్వాత తిరిగి చెల్లించే విధంగా పబ్లిక్ డిపాజిట్లను ఆమోదించడానికి లేదా పునరుద్ధరించడానికి అనుమతిఉంది. తక్షణం అమలు... 120 నెలల వరకూ డిపాజిట్ల ఆమోదం లేదా పునరుద్ధరణకు వీలుంది. దీనిని 5 సంవత్సరాలకు తగ్గించాలన్నది తాజా ముసాయిదా ఉద్దేశం. అయితే ఈ నిబంధన తక్షణం అమల్లోకి వచి్చనట్లు కూడా ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొనడం గమనార్హం. ‘‘ఇకమీదట, ఈ సర్క్యులర్ తేదీ నుండి హెచ్ఎఫ్సీలు ఆమోదించిన లేదా పునరుద్ధరించిన పబ్లిక్ డిపాజిట్లను 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ గడువు 60 నెలలకు పరిమితం అయ్యింది. అయితే ఇప్పటికే అరవై నెలల కంటే ఎక్కువ మెచ్యూరిటీతో ఉన్న డిపాజిట్లు ఆయా హెచ్ఎఫ్సీల ప్రస్తుత రీపేమెంట్ ప్రొఫైల్ ప్రకారం తిరిగి చెల్లించడం జరుగుతుంది’’అని ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొంది. ఒకవేళ ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్ కనీస పెట్టుబడి గ్రేడ్ కంటే తక్కువగా ఉంటే, అటువంటి హెచ్ఎఫ్సీలు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ పొందే వరకు ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్దరించలేవని, లేదా తాజా డిపాజిట్లను అంగీకరించలేవని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక డిపాజిట్ తీసుకునే హెచ్ఎఫ్సీలు కలిగి ఉన్న పబ్లిక్ డిపాజిట్ల పరిమాణ సీలింగ్ (పరిమితి) ప్రస్తుతం తమ సొంత నికర నిధుల్లో 3 రెట్లు ఉంటే, దీనిని తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 1.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, తాజా ముసాయిదా ప్రకారం వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రకృతి వైపరీత్యాలు/విపత్తుల కారణంగా ముందస్తు–మెచ్యూర్ ఉపసంహరణ అనుమతులకు హెచ్ఎఫ్సీలకు వీలుకలుగుతోంది. ఎన్బీఎఫ్సీ నిబంధనలతో సమన్వయం.. తాజా చర్యల ద్వారా ఇతర నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) బాటలోకి హెచ్‌ఎఫ్‌సీలను తీసుకురావాలని భావిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుండి హెచ్ఎఫ్సీల నియంత్రణను బదిలీ చేసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ 2020 అక్టోబర్ 22వ తేదీన తొలిసారి ఈ సంస్థల కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. హెచ్ఎఫ్సీలు –ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనల మధ్య మరింత సమన్వయం తీసుకురావడం కోసం దశలవారీగా ప్రయత్నం జరుగుతుందని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్ట చేసింది. ఏప్రిల్ నుంచి తాజా రుణ ‘చార్జీ’ నిబంధనల అమలు... బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)రుణ ఎగవేతలపై జరిమానా చార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన సవరిత ‘ఫెయిర్ లెండింగ్ విధానం’ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది.బ్యాంకులు– నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లిపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా చార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా చార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి చార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు. -
ఎన్బీఎఫ్సీలు అవుట్‌లుక్ మరింత మెరుగు: ఐసీఆర్ఏ
నాన్–బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–రిటైల్) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ–రిటైల్) రుణాలు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తన అవుట్‌లుక్‌ను ఎగువముఖంగా సవరించింది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని రిటైల్ రుణాలు (ఏయూఎం) 2023 మార్చి నాటికి రూ.14 లక్షల కోట్లు ఉంటే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది 18 నుంచి 20 శాతం పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 12 నుంచి 14 శాతంగా ఉంది. ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రిటైల్ రుణాలు 2023 మార్చి నాటికి రూ.7లక్షల కోట్లయితే, 2023–24లో 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 నుంచి 13 శాతం. ఇక మౌలిక రంగానికి సంబంధించి మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు మార్చి 2023 నాటికి రూ.40 లక్షల కోట్లయితే, ఈ విభాగంలో 2023–24లో క్రితం అంచనాల (10 నుంచి 12 శాతం)కన్నా అధికంగా 13 నుంచి 15 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. -
3.13 లక్షల మంది కస్టమర్లు: హెచ్డీఎఫ్సీ
ముంబై: క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) వినియోగదార్ల సంఖ్య 3.13 లక్షలు దాటిందని గృహ రుణ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ప్రధాన మంత్రి అవాస యోజన (పీఎంఏవై) పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎల్ఎస్ఎస్ కస్టమర్లు రూ.67,000 కోట్ల రుణాలను అందుకున్నట్టు సంస్థ ఎండీ రేణు సూద్ కర్నాడ్ వెల్లడించారు. ‘ప్రభుత్వం ఈ పథకం కింద సబ్సిడీ రూపంలో రూ.48,250 కోట్లు సమకూర్చింది. ఇందులో హెచ్డీఎఫ్సీ కస్టమర్లు 15 శాతంపైగా వాటాతో రూ.7,200 కోట్లు అందుకున్నారు. 92 శాతానికి పైగా కొత్త రుణ దరఖాస్తులు డిజిటల్ మార్గాల ద్వారా వచ్చాయి. మహమ్మారికి ముందు ఇది 20 శాతం కంటే తక్కువగా ఉంది. గుజరాత్ నుంచి అత్యధిక వినియోగదార్లు ఉన్నారు. సీఎల్ఎస్ఎస్ కింద ఉత్తమ పనితీరు కనబర్చిన గృహ రుణ సంస్థగా అవార్డు పొందాం’ అని వివరించారు. చదవండి: వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్‌ఫోన్ మీ సొంతం! -
బ్యాంకులతో పోలిస్తే తక్కువే..అందుబాటు ధరల్లో హోమ్ లోన్లు!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు(హెచ్ఎఫ్సీ లు)గృహ రుణాల్లో మార్కెట్ వాటాను బ్యాంకుల కు కోల్పోతున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. హెచ్ఎఫ్సీల నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం) వేగవంతమైన వృద్ధి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటాను కోల్పోనున్నట్టు అంచనా వేసింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం 2022–23లో 10–12 శాతం పెరుగుతాయని పేర్కొంది. క్రితం ఆర్థిక సంవ్సరంలో వృద్ధి 8 శాతంగా ఉన్నట్టు తెలిపింది. బ్యాంకులు గృహ రుణాల విభాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నందున, హెచ్ఎఫ్సీల ఆస్తులు వృద్ధి చెందినా, మార్కెట్ వాటాను కాపాడుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులకు మార్కెట్ వాటా నష్టపోవడాన్ని ప్రస్తావించింది. గృహ రుణాల్లో బ్యాంకుల వాటా 4 శాతం పెరిగి 2022 మార్చి నాటికి 62 శాతంగా ఉన్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గృహ రుణాల్లో బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకోవడం సమీప కాలంలో ఆగకపోవచ్చని క్రిసిల్ తెలిపింది. గృహ రుణాల్లో దేశంలోనే అదిపెద్ద సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ వెళ్లి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం అవుతుండడం ఈ విభాగంలో బ్యాంకుల వాటా మరింత పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అందుబాటు గృహ రుణాలు ఇక హెచ్ఎఫ్సీలు మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఆశావహ పరిస్థితి అందుబాటు ధరల గృహ రుణాల్లో మాత్రమే ఉన్నట్టు క్రిసిల్ వెల్లడించింది. ఈ విభాగంలో బ్యాంకుల నుంచి పోటీ చాలా తక్కువగా ఉండడాన్ని ఇందుకు మద్దతుగా పేర్కొంది. 2022–23లో అందుబాటు ధరల గృహ రుణాల్లో 18–20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ‘‘సంప్రదాయ వేతన ఉద్యోగుల విభాగంలో గృహ రుణాల పరంగా బ్యాంకులతో పోటీ పడడం హెచ్ఎఫ్సీలకు సవాలే అవుతుంది. ఎందుకంటే వాటికి నిధుల సమీకరణ వ్యయాలు అధికంగా ఉండడం వల్లే’’అని క్రిసిల్ వివరించింది. హెచ్ఎఫ్సీలకు నిధుల సమీకరణ కష్టమేమీ కాదంటూ, బ్యాంకులకు మాత్రం తక్కువ వ్యయాలకే డిపాజిట్లు (కాసా) అందుబాటులో ఉండడం అనుకూలతగా పేర్కొంది. నియంత్రణ పరమైన నిబంధనలు కఠినంగా మారుతుండడం, కార్పొరేట్ బాండ్ మార్కెట్ బలంగా లేకపోవడంతో హెచ్ఎఫ్సీలు తమ వ్యాపార నమూనాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హెచ్ఎఫ్సీలు బ్యాంకులతో భాగస్వామ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచన చేసింది. తద్వారా ఒకరి బలాలు మరొకరికి సానుకూలిస్తాయని పేర్కొంది. 202–23లో హెచ్ఎఫ్సీల గృహ రుణాలు 15 శాతం వృద్ధిని చూస్తాయని అంచనా వేసింది. డెవలపర్ ఫైనాన్స్, ప్రాపర్టీపై ఇచ్చే రుణాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని పేర్కొంది. -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు సానుకూలం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం మేర వృద్ధిని చూస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఏయూఎం వృద్ధి ప్రధానంగా చివరి త్రైమాసికం (2022 జనవరి-మార్చి)లో నమోదైనట్టుగా పేర్కొంది. హెచ్ఎఫ్సీల ఆస్తులు 10 శాతం పెరగ్గా, ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్ ఆస్తులు 8.5 శాతం, హోల్‌సేల్ ఆస్తులు 12 శాతం చొప్పున వృద్ధి చెందాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు (ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు కాకుండా) మొత్తం మీద 9–11 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ సంస్థలు ఇచ్చిన రుణాలనే ఆస్తులుగా పరిగణిస్తారు. నిధుల మార్గాలు ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీలు) ఇష్యూలను చేపట్టడం అన్నది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎన్నో త్రైమాసికాల కనిష్టానికి చేరినట్టు ఇక్రా నివేదిక తెలియ జేసింది. 2021-22 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం తగ్గాయని, 2020-21 మొదటి త్రైమాసికంలోని ఇష్యూలతో పోల్చినా 65 శాతం తక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెపో రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితుల్లో వీటి ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతగా లేదని తెలిపింది. కమర్షియల్ పేపర్ల రూపంలో నిధుల సమీకరణ గత కొన్ని నెలల్లో కొంత పుంజుకున్నట్టు పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమం, పోటీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు మార్జిన్లను కాపాడుకు నేందుకు స్వల్పకాల నిధుల వాటాను పెంచుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు గతంలో పేర్కొంది. ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఆఫర్ గడువు తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 750 - 799 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారికి రుణదాత గృహ రుణాలను 6.65% కంటే స్వల్ప మొత్తంలో ఎక్కువగా వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నాటికి దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, మార్చి 31 వరకు పంపిణీ చేసిన రుణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా, కొత్త గృహ రుణం కోసం చూస్తున్న వారు, అలాగే తమ ప్రస్తుత గృహ రుణాన్ని మరొక రుణదాత నుంచి బదిలీ చేయాలని చూస్తున్నవారు ఈ ఆఫర్‌కు అర్హులు. (చదవండి: ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) -
కొత్త ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. క్రెడిట్ స్కోరు 750 పైగా ఉండాలి అలాగే, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. వీరికి మాత్రమే గృహ రుణాలు 6.65% వడ్డీ రేటుకు లభిస్తాయి. 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా ఈ వడ్డీ రేటును పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరి షరతు ఏమిటంటే కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందడానికి అర్హులు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!) -
గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత పెరగడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాల ఊతంతో హోమ్ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత హౌసింగ్‌కు డిమాండ్ పుంజుకోవడంతో పండుగ సీజన్ సందర్భంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు 6.5 శాతానికే హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ‘గత కొన్నాళ్లుగా ఆదాయ స్థాయులు ఎంతో కొంత పెరగ్గా దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉండిపోయాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహాలు మరింత అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. చౌక వడ్డీ రేట్లు కూడా గృహ రుణాలు తీసుకోవడానికి ఒక కారణంగా నిలుస్తున్నాయి. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు కాస్త పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’ అని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సూద్ కర్నాడ్ తెలిపారు. రెడీమేడ్ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటోందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. పండుగ సీజన్, ఆ తర్వాత కూడా రెడీమేడ్ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు పలు బ్యాంకులు, పండుగ సీజన్‌కు ముందే గృహ రుణాల రేట్లను తగ్గించాయని కోలియర్స్ ఇండియా కొత్త సీఈవో రమేష్ నాయర్ చెప్పారు. -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
Bajaj Housing Finance Home Loan Rates: మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(బిహెచ్ఎఫ్ఎల్) నేడు (అక్టోబర్ 1) గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం & ఉపాధి ఉన్న దరఖాస్తుదారులు ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహితలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో తెలిపింది. ఇప్పటికే ఉన్న గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి. సెప్టెంబర్ 21న హెచ్డీఎఫ్సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని తెలిపింది. రుణ మొత్తం, ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుంది. (చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్!) -
గృహ రుణ సంస్థలకు ఆర్బీఐ కొత్త ఆదేశాలు
ముంబై: లిక్విడిటీ కవరేజీ రేషియో సహా పలు నిబంధనలకు సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ నిర్వహణ, ఆస్తుల వర్గీకరణ, లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) ఇందులో ఉన్నాయి. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా హెచ్ఎఫ్సీల వ్యవహార శైలి లేకుండా చూడడమే ఈ ఆదేశాల్లోని ఉద్దేశమని ఆర్బీఐ తెలిపింది. డిపాజిట్లు స్వీకరించే, డిపాజిట్లు స్వీకరించని, రూ.100 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన హెచ్ఎఫ్సీలు లిక్విడిటీ రిస్క్ నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. రూ.10,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్ని నాన్ డిపాజిట్ హెచ్ఎఫ్సీలు, అదే విధంగా అన్ని రకాల హెచ్ఎఫ్సీలు 2021 డిసెంబర్ 1 నాటికి కనీసం 50 శాతం ఎల్‌సీఆర్‌ను నిర్వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కష్టకాలం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) రుణాల వృద్ధి అవకాశాలను లిక్విడిటీ సంక్షోభం దెబ్బతీసిందని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2019–20) కూడా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బలహీన మార్కెట్ పరిస్థితులు సైతం హెచ్ఎఫ్సీ ఆస్తుల నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీలు 13–15 శాతం మధ్య రుణాల వృద్ధిని నమోదు చేస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2019–20లో ఇది 14–16 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. బలహీన నిర్వహణ పరిస్థితుల కారణంగా ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి ఉంటుందని అంచనా వేసింది. ఇళ్ల రుణాల విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ప్రస్తుతమున్న 1 శాతం నుంచి మధ్య కాలానికి 1.3 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ప్రాజెక్టు రుణాలను కూడా కలిపి చూస్తే మొత్తం మీద హెచ్ఎఫ్సీల ఎన్పీఏలు 1.4 శాతం నుంచి 1.8 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది 18 శాతంగా ఉన్న మార్జిన్లు 14 శాతానికి పరిమితమవుతాయని అభిప్రాయపడింది. 2020 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలోనే ఉండొచ్చని పేర్కొంది. గత కొన్నేళ్లుగా మోర్ట్గేజ్ ఫైనాన్స్‌ను ఎన్బీఎఫ్సీలు సురక్షితంగా భావించడం జరిగిందని, ప్రధానంగా ఈ విభాగం నిద్రాణంగా ఉండడం వల్లేనని గుర్తు చేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దివాలా తీయడం ఫలితంగా ఈ రంగంలో నిధుల సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయని ఇక్రా వివరించింది. ఇళ్ల రుణాల పోర్ట్‌ఫోలియో హెచ్ఎఫ్సీలకు, ఇతర రుణదాతులకు 18 శాతం నుంచి 13 శాతానికి దిగొచ్చినట్టు తెలిపింది. ఊహించని మార్కెట్ సంక్షోభాలను ఎదురైతే ఎదుర్కొనేందుకు హెచ్ఎఫ్సీలు నిధుల నిల్వలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయని తన నివేదికలో పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ, ఐఐఎఫ్‌సీఎల్ సహా...
రేటు కోత బాటలో మరిన్ని బ్యాంకులు న్యూఢిల్లీ: కనీస (బేస్) రుణ రేటు తగ్గింపు బాటలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ, ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్సీఎల్సహా మరికొన్ని బ్యాంకులు నిలిచాయి. సోమవారం ఆయా నిర్ణయాలను ఒక్కసారి చూస్తే... హెచ్డీఎఫ్సీ: పావు శాతం రేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.65 శాతానికి చేరింది. గృహ రుణ రేటు కొత్త కస్టమర్లకు 9.65 శాతంగా ఉంటుంది. అయితే మహిళల విషయంలో ఈ రేటు 9.60 శాతంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ రేట్లు 9.9 శాతం, 9.85 శాతంగా ఉన్నాయి. మంగళవారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. కెనరాబ్యాంక్: పావుశాతం రేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.65 శాతానికి తగ్గింది. 7వ తేదీ నుంచీ తాజా రేటు అమలవుతుంది. స్టాన్‌చార్ట్: పావుశాతం రేటు తగ్గింది. దీనితో ఈ రేటు 9.5 శాతానికి తగ్గింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వచ్చింది. కార్పొరేషన్ బ్యాంక్: 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.7 శాతానికి తగ్గింది. 8వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఐఐఎఫ్‌సీఎల్: 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 9.7 శాతానికి దిగింది. తక్షణం ఈ రేటు అమలవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: రేటు 10 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ 21 నుంచీ అమలయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. కాగా బీపీసీఎల్ మాత్రం 15 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. ఇప్పటికే పలు బ్యాంకులు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం తగ్గించిన నేపథ్యంలో (2015లో మొత్తంగా 1.25 శాతం రెపోరేటు కోత- ప్రస్తుతం 6.75 శాతం) ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించే పనిలో బ్యాంకులు నిమగ్నమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌సహా పలు బ్యాంకింగ్ దిగ్గజాలు ఇప్పటికే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి. కనీస రుణ రేటు తగ్గింపు వల్ల దీనికి అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా రుణ రేట్ల భారం తగ్గుతుంది. -
డీహెచ్ఎఫ్ఎల్ అంబాసిడర్ షారూక్
హైదరాబాద్: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు షారూక్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని డీహెచ్ఎఫ్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కపిల్ వాధ్వాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ 30 ఏళ్ల ప్రస్థానంలో ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. భారత్‌లో రెండో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించామని వివరించారు. సొంత ఇల్లు సాధించడమనేది ప్రతి కుటుంబానికి భద్రమైన భవిష్యత్తుకు తొలి మెట్టు అని, దీని కోసం తోడ్పడే డీహెచ్ఎఫ్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని షారూక్ ఖాన్ పేర్కొన్నారు. -
ట్రెడా షో ప్రారంభం
నేడు, రేపు కూడా అందుబాటులో సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనుగోలు అంటే మామూలు విషయం కాదు. స్థలం కొనుగోలు నుంచి అందమైన ఇల్లు కట్టుకునే వరకు అన్నీ దగ్గరుండి చూసుకోవాలనుకుంటారు. దీని కోసం ఎక్కడెక్కడో తిరిగి వివరాలు సేకరించే సమస్య లేకుండా అన్ని వివరాలు ఒకే చోట లభ్యమయ్యేలా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అవకాశం కల్పిస్తోంది. మూడు రోజుల ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది. ప్రదర్శనలో 180 స్టాళ్లు: నగదు పొదుపు నుంచి బ్యాంకులు అందించే రుణ సదుపాయాల వరకు అన్నింటి సమాచారం ఈ షో అందిస్తుంది. రియల్టర్లను, డెవలపర్లను, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కొనుగోలుదారులకు నాణ్యమైన ఇళ్లను అందించడమే ఈ ప్రాపర్టీ షో లక్ష్యమని ట్రెడా అధ్యక్షులు దశ్థ్ర్రెడ్డి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మెటీరియల్ తయారీదారులు, ఇంటీరియర్ డిజైనర్లు, బ్యాంకులు వంటి ఎన్నో సంస్థలు పాల్గొనే ఈ ప్రాపర్టీషోలో డెవలపర్లు 180 స్టాళ్ల ద్వారా వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇప్పటికే 40 వేల సందర్శకులు వారి పేర్లను నమోదుచేసుకున్నారు. ప్రవేశం ఉచితం. ఈ అవకాశాన్ని నగరవాసులతోపాటు, ప్రవాసాంధ్రులు, నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. లక్కీ డిప్ విజేతగా ఆర్. మహేష్ (కూపన్ నంబర్: 35476) మారుతీ ఆల్టో కారును గెలుచుకున్నాడు. ఇంటి శోభ: ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇటీవల అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని కోసం ఆర్కిటెక్చర్లపైన ఆధారపడుతున్నారు. అందమైన ఏవియేషన్ ఆపై చక్కని గాలి వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్ రూపొందించడంలో ఆర్కిటెక్చర్లదే ప్రధాన పాత్ర. దీనికోసం స్థిరాస్తి వ్యాపారులు ఆర్కిటెక్చర్లతో అపార్ట్మెంట్లు, డ్యూప్లెక్స్ నిర్మాణాలు, విల్లాలకు డిజైన్లు చేయిస్తున్నారు. మదిని దోచే ముచ్చటైన రూపాలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.