ICRA: NBFCs growth to be stronger due to unsecured loans market - Sakshi
Sakshi News home page

ఎన్‌బీఎఫ్‌సీలు అవుట్‌లుక్‌ మరింత మెరుగు: ఐసీఆర్‌ఏ

Published Fri, Jul 21 2023 1:11 AM | Last Updated on Fri, Jul 21 2023 11:57 AM

NBFCs growth to be stronger due to unsecured loans market - Sakshi

నాన్‌–బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ–రిటైల్‌) హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ–రిటైల్‌) రుణాలు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తన అవుట్‌లుక్‌ను ఎగువముఖంగా సవరించింది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని రిటైల్‌ రుణాలు (ఏయూఎం) 2023 మార్చి నాటికి రూ.14 లక్షల కోట్లు ఉంటే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది 18 నుంచి 20 శాతం పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది.

ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 12 నుంచి 14 శాతంగా ఉంది. ఇక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల రిటైల్‌ రుణాలు 2023 మార్చి నాటికి రూ.7లక్షల కోట్లయితే, 2023–24లో 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 నుంచి 13 శాతం. ఇక మౌలిక రంగానికి సంబంధించి మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు మార్చి 2023 నాటికి రూ.40 లక్షల కోట్లయితే, ఈ విభాగంలో 2023–24లో క్రితం అంచనాల (10 నుంచి 12 శాతం)కన్నా  అధికంగా 13 నుంచి 15 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement