న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది.
ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్తో లేదా వారి స్వంత ప్రాక్టీస్లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు.
క్రెడిట్ స్కోరు 750 పైగా ఉండాలి
అలాగే, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. వీరికి మాత్రమే గృహ రుణాలు 6.65% వడ్డీ రేటుకు లభిస్తాయి. 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా ఈ వడ్డీ రేటును పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరి షరతు ఏమిటంటే కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందడానికి అర్హులు.
(చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!)
Comments
Please login to add a commentAdd a comment