ముంబై: లిక్విడిటీ కవరేజీ రేషియో సహా పలు నిబంధనలకు సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సీలు) ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ నిర్వహణ, ఆస్తుల వర్గీకరణ, లోన్ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ) ఇందులో ఉన్నాయి. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా హెచ్‌ఎఫ్‌సీల వ్యవహార శైలి లేకుండా చూడడమే ఈ ఆదేశాల్లోని ఉద్దేశమని ఆర్‌బీఐ తెలిపింది. డిపాజిట్లు స్వీకరించే, డిపాజిట్లు స్వీకరించని, రూ.100 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన హెచ్‌ఎఫ్‌సీలు లిక్విడిటీ రిస్క్ నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ కోరింది. రూ.10,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్ని నాన్ డిపాజిట్ హెచ్‌ఎఫ్‌సీలు, అదే విధంగా అన్ని రకాల హెచ్‌ఎఫ్‌సీలు 2021 డిసెంబర్ 1 నాటికి కనీసం 50 శాతం ఎల్‌సీఆర్‌ను నిర్వహించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment