నిబంధనలు పాటించని మూడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీలను విధించింది.
సెంట్రల్ బ్యాంక్ గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కొక్కటి రూ. 5లక్షలు, అలాంటి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ. 3.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం, 1987లోని సెక్షన్ 52A నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఆర్బీఐ ఈ జరిమానాలు విధించింది.
రూ.75 లక్షలు, ఆపైడి రుణాల మంజూరులో గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ తమ ప్రమాణాలను పాటించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 'ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్'పై ఆర్బీఐ ఆదేశాలకు విరుద్ధంగా కొంతమంది రుణగ్రహీతలకు రుణం వాస్తవ పంపిణీ/చెక్ జారీ తేదీ కంటే ముందు కాలానికి రుణాలపై వడ్డీని వసూలు చేసిందని ఆర్బీఐ కనుగొంది.
ఇక హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విషయానికి వస్తే "2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ కస్టమర్ల రిస్క్ వర్గీకరణను చేపట్టడంలో విఫలమైంది. ఖాతాల రిస్క్ వర్గీకరణను కాలానుగుణంగా సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు" అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment