Bajaj Housing Finance Home Loan Rates: మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(బిహెచ్ఎఫ్ఎల్) నేడు (అక్టోబర్ 1) గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం & ఉపాధి ఉన్న దరఖాస్తుదారులు ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహితలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో తెలిపింది.
ఇప్పటికే ఉన్న గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి. సెప్టెంబర్ 21న హెచ్‌డీఎఫ్‌సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని తెలిపింది. రుణ మొత్తం, ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుంది.
(చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్!)
Comments
Please login to add a commentAdd a comment