మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎమ్) 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ కింద ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మార్కెట్ పోటీకి అనుగుణంగా కారు రుణాలపై ప్రస్తుతం ఉన్న 7.05 శాతం వడ్డీ రేటును కూడా 6.80 శాతానికి బ్యాంకు తగ్గించింది.
కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి ఉంటాయని బీఓఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ రేటు రుణగ్రహీతల క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుందని తెలిపింది. బ్యాంకు ఇప్పటికే తన బంగారం, గృహ నిర్మాణం & కారు రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. "రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వల్ల వినియోగదారులు తమ రుణాలపై మరింత ఆదా చేసుకోవచ్చు అని, ఇది వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని బీఓఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు.
(చదవండి: మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా)
Comments
Please login to add a commentAdd a comment