ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంకేతాలిచ్చారు. అయితే ఇన్నిరోజులు ఆయా బ్యాంకులు ఇంటి రుణాల్ని తక్కువ వడ్డీ రేట్లకే ఆఫర్ చేశాయి. కానీ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలపై వడ్డీలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
భారత్‌తో పాటు ప్రపంచ దేశాల‍్ని ద్రవ్యోల్బణం తీవ్రంగా వేధిస్తోంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలకు చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పనిలో పనిగా ఆర్బీఐ సైతం పలు వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ(మే) నెలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ..40 బేసిస్ పాయింట్లు వరకు వడ్డీ రేట్లను పెంచింది. అంతేకాక తదుపరి సమావేశాలలో కూడా వడ్డీ రేట్లను పెంచుతామని హింట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కరోనాకు ముందు హోం లోన్‌పై ఎంత వడ్డీ కడుతున్నామో..ఇప్పుడు కూడా అంతే కట్టాల్సి ఉంటుంది.దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు 10 శాతం వరకు పెరగొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆర్బీఐ హోం లోన్‌లపై ఎంత వడ్డీ విధిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment