ముంబై: గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఆర్‌బీఐ–ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. 3 రోజుల ఈ సమావేశ నిర్ణయాలు గురువారం (ఆగస్టు 10వ తేదీ) వెలువడతాయి.
ద్రవ్యోల్బణంపై అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో యథాతథ రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి కమిటీ మెజారిటీ మొగ్గుచూపవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇదే జరిగితే రేటు యథాతథ స్థితి కొనసాగింపు ఇది వరుసగా మూడవసారి (ఏప్రిల్, జూన్ తర్వాత) అవుతుంది.
ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి (ఫిబ్రవరికి) చేరింది. అటు తర్వాత రేటు మార్పు నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment