సొంతింటి కలల్ని నిజం చేసుకోవాలనుకునేవారికి, లేదంటే ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ ( equated monthly interest) చెల్లించే వారికి ఆర్‌బీఐ భారీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రుణ గ్రస్తులు హోంలోన్‌లపై కడుతున్న ఈఎంఐలు వచ్చే ఏడాది మార్చి వరకు తగ్గవని సమాచారం. అప్పటి వరకు రెపోరేటు (ప్రస్తుతం 6.50 శాతం) అలాగే కొనసాగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల, ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఎకనమిస్ట్ సర్వే నిర్వహించింది. స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎక్కువ వడ్డీ రేట్లు మార్చి 2024వరకు కొనసాగనున్నాయని సర్వేలో ఆర్ధిక వేత్తలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగు నెలల తగ్గుదల ధోరణి కనిపించినప్పటికీ పెరిగిన ఆహార ధరల కారణంగా ద్రవ్యోల్బణం గత నెలలో 4.81 శాతానికి పెరిగింది.
కొనసాగనున్న రెపోరేటు
జూన్ సర్వేలో,ఆర్‌బీఐ మార్చి 2024 చివరి నాటికి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రేటు తగ్గింపు 2024 రెండవ త్రైమాసికం వరకు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇళ్ల కొనుగోలుదారులకు ఇబ్బందే
హోం లోన్ ఈఎంఐ చెల్లిస్తుంటే 2024 వరకు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్‌బీఐ ప్రస్తుత రెపో రేటును కొనసాగిస్తున్నంత కాలం, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు, ఫలితంగా రుణగ్రహీతలకు ఎంఎంఐల భారం తగ్గదు. రెపో రేట్ల తగ్గింపు ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండవు. కాబట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని భావిస్తున్నా’ అని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ సుమన్ చౌధరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment