హోమ్‌ లోన్‌ ఈఎంఐలు తగ్గుతాయ్‌.. | Home loan borrowers set to save big from lower interest payout EMIs | Sakshi
Sakshi News home page

హోమ్‌ లోన్‌ ఈఎంఐలు తగ్గుతాయ్‌.. ఎలాగంటే..

Published Fri, Feb 7 2025 2:42 PM | Last Updated on Fri, Feb 7 2025 3:28 PM

Home loan borrowers set to save big from lower interest payout EMIs

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.  6.50 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ప్రకటించారు. దీని వలన వడ్డీ రేట్లు, ఈఎంఐలు తగ్గేందుకు ఆస్కారం కలిగింది.

2019 అక్టోబర్ 1 తర్వాత మంజూరైన అన్ని రిటైల్ ఫ్లోటింగ్-రేట్ రుణాలు ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమై ఉంటాయి. చాలా సందర్భాలలో ఇదే రెపో రేటుగా ఉంటుంది. కాబట్టి రేటు తగ్గింపు గృహ రుణగ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని గృహ రుణాలలో ఎక్కువ భాగం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఫలితంగా, వడ్డీ భారం, వాటి ఈఎంఐలు తగ్గుతాయి. దీంతో ఇంటి యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది.

దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేట్లను తగ్గించింది.  కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుండి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది.

హోమ్‌ లోన్‌ కస్టమర్లకు భారీ ప్రయోజనాలు
ప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల హోమ్‌ లోన్‌ కస్టమర్లకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూద్దాం..  ఒక సంవత్సరం క్రితం 9 శాతం వడ్డీ రేటు, 20 సంవత్సరాల కాలపరిమితి (240 నెలలు) తో రూ. 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే.. నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 44,986 ఉంటుంది.  రుణ కాలంలో చెల్లించే అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 58 లక్షలు అవుతుంది.

ఇప్పుడు  25  బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం నుండి  8.75 శాతానికి తగ్గుతుంది. ఫలితంగా అసలు, వడ్డీ మొత్తం చెల్లింపు సుమారు రూ. 53.6 లక్షలకు తగ్గుతుంది.  దీని వలన రూ. 4.4 లక్షలు ఆదా అవుతుంది. అలాగే రుణ కాలపరిమితి 230 నెలలకు తగ్గుతుంది. దీని వలన రుణాన్ని 10 నెలల ముందుగానే  తిరిగి చెల్లించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement