న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు గతంలో పేర్కొంది. ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఆఫర్ గడువు తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది.
ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్తో లేదా వారి స్వంత ప్రాక్టీస్లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు.
కొత్త ఏడాది సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 750 - 799 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారికి రుణదాత గృహ రుణాలను 6.65% కంటే స్వల్ప మొత్తంలో ఎక్కువగా వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నాటికి దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, మార్చి 31 వరకు పంపిణీ చేసిన రుణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా, కొత్త గృహ రుణం కోసం చూస్తున్న వారు, అలాగే తమ ప్రస్తుత గృహ రుణాన్ని మరొక రుణదాత నుంచి బదిలీ చేయాలని చూస్తున్నవారు ఈ ఆఫర్‌కు అర్హులు.
(చదవండి: ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!)
Comments
Please login to add a commentAdd a comment