Home loan interest rates
-
ఒక్క ఈఎంఐతో ఐదేళ్లు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. దీన్ని నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం డబ్బు పోగు చేస్తారు. కొంత నగదు సమకూరిన తర్వాత హోంలోన్ తీసుకుని ఇంటిని సొంతం చేసుకుంటారు. నెలవారీ ఈఎంఐల కోసం తిరిగి కష్టపడుతుంటారు. అయితే ఈ లోన్ వ్యవధి సుమారు 25 ఏళ్లపాటు ఉంటుంది. దాంతో భారీగా వడ్డీ చెల్లించాలి. ఆలోపు అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం ఏర్పడితే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ లోన్ కాలపరిమితిని తగ్గించుకుంటే త్వరగా అప్పు తీర్చడంతోపాటు ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చుకోవచ్చు. అయితే త్వరగా ఇంటి రుణం ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.ఉద్యోగం చేస్తున్నవారు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వేతనం పెరుగుతుంది. అలా పెరిగిన డబ్బుతో ఏటా 10 శాతం ఈఎంఐ పెంచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 25 ఏళ్ల కాలానికి తీసుకున్న రుణం.. 10 ఏళ్లలోనే పూర్తవుతుంది.ఏటా 10 శాతం ఈఎంఐ పెంచడం కష్టం అని భావించేవారు తమ ఇంటి రుణాన్ని 13 ఏళ్లలో తీర్చవచ్చు. ఇందుకోసం నెలవారీ వాయిదాను ఏటా ఐదు శాతం వరకు పెంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఖర్చుల విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో రుణంపై వడ్డీ భారమూ తగ్గుతుంది.ఏటా 12 ఈఎంఐలకు బదులుగా కేవలం ఒక ఈఎంఐని అధికంగా చెల్లిస్తే మీ ఇంటిరుణం వ్యవధి ఏకంగా ఐదేళ్లు తగ్గుతుంది. అంటే 25 ఏళ్ల పాటు సాగే రుణ భారాన్ని 20 ఏళ్లలోనే పూర్తి చేసుకోవచ్చు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారంనెలవారీ సంపాదనలో అన్ని ఈఎంఐలు కలిపి 50 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ పరిధిదాటితే ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.సొంతింటిలో అదనంగా ఫ్లోర్లు ఏర్పాటు చేసి గదులు కిరాయికి ఇవ్వొచ్చు. అలా వచ్చే రెంట్‌తో ఈఎంఐ పెంచుకోవచ్చు. దాంతో తక్కువ సమయంలోనే లోన్ పూర్తి చేయవచ్చు. -
లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!
ఇల్లు కొనడం సామాన్యుడి కల. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలామంది జీవితాంతం కష్టపడుతుంటారు. కొందరు డౌన్‌పేమెంట్‌కు సరిపడా డబ్బు సంపాదించి మిగతాది లోన్ ద్వారా తీరుస్తుంటారు. అయితే హోంలోన్ వ్యవధి చాలా ఏళ్లు ఉంటుంది. ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసినా ఏటా దాని విలువ తగ్గిపోతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలాగని ఇల్లు కొనకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిట్కా పాటించి ఎలాంటి లోన్ అవసరం లేకుండా పదేళ్ల తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మీరు కొనలనుకునే ఫ్లాట్ ధర రూ.50,00,000 అనుకుందాం. అందులో రూ.10 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉంటే మరో రూ.40 లక్షలు లోన్ తీసుకోవాల్సిందే కదా. ముందుగా మీ దగ్గరున్న రూ.10 లక్షలు ఏటా 15 శాతం వృద్ధి చెందే మ్యుచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు లమ్సమ్(ఒకేసారి పెట్టే పెట్టుబడి) ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంతో రూ.40.4 లక్షలు సమకూరుతాయి. ఒకవేళ రూ.40 లక్షలు లోన్ తీసుకుని ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేస్తే 20 ఏళ్ల వ్యవధికిగాను 9 శాతం వడ్డీ లెక్కిస్తే నెలవారీ ఈఎంఐ రూ.36 వేలు చెల్లించాలి. అందులో నుంచి రూ.10 వేలు ప్రస్తుతం ఉంటున్న ఇంటి కిరాయికి కేటాయించండి. మిగతా రూ.26 వేలు క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా 14 శాతం వడ్డీ సమకూరే మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మొత్తం రూ.68 లక్షలు సమకూరుతాయి.ఇదీ చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మందిలమ్సమ్ పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలు, ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సిన రూ.26 వేల నుంచి పదేళ్ల తర్వాత రూ.68 లక్షలు కలిపి మొత్తం మీ చేతిలో రూ.1.08 కోట్లు ఉంటాయి. రియల్ఎస్టేట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించినా ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదేళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
రెపోరేటు పెంచిన ఆర్బీఐ : హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను 0.5 శాతం( 50 బేసిస్) పెంచింది. సెప్టెంబర్ 28న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభం కాగా..సెప్టెంబర్ 30న ముగిసింది. ఆర్బీఐ రెపోరేట్లను పెంచడం కారణంగా..బ్యాంకులు రుణ గ్రస్తులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. అదే జరిగితే కార్ల లోన్లు, పర్సనల్, హోమ్ లోన్లు మరింత భారం కానున్నాయి. అయితే ఇప్పుడు రెపో రేట్ల పెరుగుదలతో రుణగ్రస్తులపై హోమ్ లోన్ భారం ఏ విధంగా పడుతుందో తెలుసుకుందాం. రెండు ఆప్షన్లు ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇంటి కోసం రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి రుణ భారం కాకుండా ఉండేందుకు రెండు ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఈఎంఐ కాల వ్యవధిని పెంచుకోవడం, రెండవది ప్రతి నెలా కట్టే ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం. హోమ్ లోన్ భారం ఎంతంటే ఉదాహరణకు..ఓ వ్యక్తి గతంలో 8.12 శాతం వడ్డీతో 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం తీసుకున్నారు. అయితే తాజాగా రెపోరేట్లు పెరిగాయి కాబట్టి సదరు వ్యక్తి తీసుకున్న రుణ టెన్యూర్ కాలం ఆటో మెటిగ్గా 2 సంవత్సరాల 3 నెలలకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ మొత్తానికి 8.62 శాతం వడ్డీతో రూ.50 లక్షలకు అదనంగా రూ.11 లక్షలు అదనంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ కేవలం పెంచిన 5 నెలల వ్యవధి రెపోరేటు 1.90 శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే వడ్డీ కలుపుకొని 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి రూ.50 లక్షలు తీసుకుంటే..రూ. 59 లక్షలు చెల్లించాలి. ఒక వేళ ఈఎంఐని పెంచితే ఒక వేళ నెలవారి చెల్లించే ఈఎంఐని పెంచినా అదే భారాన్ని రుణ గ్రహిత మోయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల రుణంపై మీరు గతంలో నెలకు చెల్లించే రూ.37,929 ఈఎంఐతో పోలిస్తే తాజా పెరిగిన 1.9 శాతం రెపో రేట్ల కారణంగా రూ. 43,771 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ రూ.5,842కి పెరుతుంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి!
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్ )రుణాల్ని 10బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం పడనుంది. ఎంసీఎల్ఆర్ అంటే ఎంసీఎల్ఆర్ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్ఆర్ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్) ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి.పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఎంసీఎల్ఆర్పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. జూలై15 (నేటి) నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఇంట్రస్ట్ రేట్లు ఎస్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఎంసీఎల్ఆర్ రేట్లు టెన్యూర్‌ను బట్టి మారాయి. ఆ వడ్డీ రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసుకుందాం. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. 6నెలల టెన్యూర్ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి వన్ ఇయర్ టెన్యూర్ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి. అదనపు భారం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనుంచి ముఖ్యంగా హోం లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది. చదవండి: తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్! -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు గతంలో పేర్కొంది. ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఆఫర్ గడువు తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 750 - 799 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారికి రుణదాత గృహ రుణాలను 6.65% కంటే స్వల్ప మొత్తంలో ఎక్కువగా వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నాటికి దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, మార్చి 31 వరకు పంపిణీ చేసిన రుణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా, కొత్త గృహ రుణం కోసం చూస్తున్న వారు, అలాగే తమ ప్రస్తుత గృహ రుణాన్ని మరొక రుణదాత నుంచి బదిలీ చేయాలని చూస్తున్నవారు ఈ ఆఫర్‌కు అర్హులు. (చదవండి: ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) -
అతి తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
Home Loan Interest Rates: మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్టపడతారు. ఈ సొంతింటి కోసం వారు ప్రతి నెల ఎంత కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. తమ దగ్గర ఉన్న ఆ సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కలల గృహాన్ని కట్టుకుంటారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే బ్యాంకులకు హోమ్ లోన్స్ కోసం ధరఖాస్తు చేసుకుంటారు. కరోనా మహమ్మారి తర్వాత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రేపో రేటును భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రతి బ్యాంక్ బట్టి వడ్డీ రేటు అనేది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి. గృహ రుణాలపై తాజా బ్యాంకు వడ్డీ రేట్లు: (చదవండి: రూపేకార్డులపై అమెరికన్ కంపెనీ కుతంత్రం..!) -
హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్) ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అన్ని రకాల గృహ రుణాలను 6.7 శాతానికే ఇస్తున్నట్టు ప్రకటించడం, పలు ఇతర బ్యాంకులు సైతం గృహ రేట్లను గణనీయంగా తగ్గించడం డిమాండ్‌కు ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోటక్ బ్యాంకు సైతం గృహ రుణ రేట్లను గణనీయంగా తగ్గించగా.. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయాలు ప్రకటించొచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనా వేస్తోంది. చదవండి : లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్ సానుకూల నిర్ణయం.. రుణం ఎంతనే దానితో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారితంగా గృహ రుణాలను 6.70 శాతం నుంచి ఆఫర్ చేస్తున్నట్టు ఎస్బీఐ గురువారం ప్రకటించడం గమనార్హం. అంతకుముందు వరకు రూ.75 లక్షల వరకు రుణాలపై 7.15 శాతం వడ్డీ రేటు అమల్లో ఉండేది. దీనిపై అనరాక్ గ్రూపు చైర్మన్ అనుజ్‌పురి స్పందిస్తూ.. ‘‘ఎస్బీఐ నిర్ణయం నిజంగా పోటీనిస్తుంది. ఈ కొత్త రేటు ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఏ బడ్జెట్లో కొనుగోలు చేసే వారైనా ప్రయోజనం పొందొచ్చు’’ అని చెప్పారు. ఎస్బీఐ సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో గృహ నిర్మాణ రంగం మంచిగా పుంజుకుంటుందన్నారు. ప్రాసెసింగ్ ఫీజుల మాఫీ కూడా సానుకూల నిర్ణయంగా పేర్కొన్నారు. హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్ పోర్టళ్ల గ్రూపు సీఈవో వికాస్ వాధ్వాన్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే డిమాండ్ ఊపందుకున్న గృహ నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ధరలు స్తబ్ధుగా ఉన్నందున కొనుగోలుదారులకు కొంత ఆదా కూడా అవుతుందన్నారు.ప్రముఖ బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రేరణనిస్తుందని సోతెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. చదవండి: లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ -
మరింత చౌకగా హోమ్లోన్స్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే!
ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంతిళ్లు ఉండాలని చాలా కలలు కంటుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ కలలను నిజం చేసుకుంటారు. తమ కలను నిజం చేసుకోవడానికి తగినంత డబ్బు లేక, బ్యాంకు వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి ఇది మంచి సమయం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్టానికి పడిపోయాయి. ఈ సమయంలో అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలను పొందవచ్చు. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజులను కొంత మేరకు తగ్గించాయి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వడ్డీకే హోమ్లోన్స్ అందిస్తున్న బ్యాంకుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంకులు/ రుణదాతలు వడ్డీ రేట్లు Kotak Mahindra Bank 6.65% Punjab & Sind Bank 6.65% State Bank of India 6.70% HDFC Bank 6.75% ICICI Bank 6.75% Bank of Baroda 6.75% Union Bank of India 6.80% Punjab National Bank 6.80% Central Bank of India 6.85% IDBI Bank 6.85% Axis Bank 6.90% Canara Bank 6.90% LIC Housing Finance 6.90% UCO Bank 6.90% Bank of India 6.95% Indian Overseas Bank 7.05% PNB Housing Finance 7.35% Karnataka Bank 7.50% Federal Bank 7.65% Standard Chartered Bank 7.99% YES Bank 8.95% బ్యాంకుకు, బ్యాంకుకి మధ్య ప్రాసెసింగ్ ఫీజులు అనేవి మారుతుంటాయి కాబట్టి ఆ ఫీజుల గురుంచి ముందుగా తెలుసుకోవాలి. అలాగే, వీలైనంత తక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే మంచిది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత? -
గృహ రుణాలపై ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లూ వివరించింది. కొత్త గృహ రుణ వడ్డీరేట్లను సిబిల్ స్కోర్‌ను అనుసంధానిస్తున్నట్లు కూడా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంటే సిబిల్ స్కోర్ బాగుంటే, వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. క్తొత వడ్డీరేట్లు చూస్తే... ► రూ. 30 లక్షల వరకూ రుణాలపై వడ్డీరేటు 6.80 వద్ద మొదలవుతుంది. ► రూ.30 లక్షలుపైబడిన రుణాలపై వడ్డీరేటు 6.95 నుంచి ఉంటుంది. ► మహిళా రుణ గ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ కూడా లభిస్తుంది. యోనో యాప్ ద్వారా దరఖాస్తుకు 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించడం, అందరికీ గృహ సౌలభ్యం లక్ష్యంగా తాజా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రూ.5 కోట్ల వరకూ రుణాలకు ఎనిమిది మెట్రో పట్టణాల్లోనూ 30 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. యోనో యాప్ ద్వారా కూడా గృహ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా అదనంగా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ పొందవచ్చు. 2021 మార్చి వరకూ తాజా రేట్లు అమల్లో ఉంటాయి. టాప్–అప్ గృహ రుణాలకు కూడా అవకాశం ఉంది. -
ఎస్బీఐ బొనాంజా..!
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్ స్కోర్, బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్ ప్రకటన తెలిపింది. ప్రకటనకు సంబంధించి మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ► రూ. 30 లక్షలకుపైబడి, రూ.2 కోట్ల వరకూ గృహ రుణాలపై క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రాయితీ ఇప్పటి వరకూ 10 బేసిస్ పాయింట్లు ఉంది. ఇకపై ఈ రాయితీని 20 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ► ఎనిమిది మెట్రో నగరాల విషయంలో రూ.3 కోట్ల రుణం వరకూ ఇదే క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీరేటు విధానం అమలవుతుంది. యోనో ద్వారా దరఖాస్తుచేస్తే, అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. ► ప్రస్తుతం బ్యాంక్ రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.30 లక్షలుపైబడితే ఈ రేటు 7 శాతంగా ఉంది. ఈ విషయంలో మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఉంది. ► ఎస్బీఐ ‘యోనో’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ 100 శాతం మాఫీ చేస్తోంది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తోంది. ► కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా అందిస్తోంది. ► వ్యక్తిగత రుణాలపై 9.6% నుంచి వడ్డీ రేటు ఉంటోంది. ► ఎస్బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. డిమాండ్ వృద్ధిపై విశ్వాసం: ఎస్బీఐ కాగా అధిక ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధి్దకి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదని బ్యాంకింగ్ పరిశ్రమ పేర్కొంటోంది. రుణ వృద్ధి పలు సంవత్సరాల కనిష్టస్థాయి 6 శాతం వద్దే కొనసాగుతుండడం గమనార్హం. అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనీ, వినియోగ విశ్వాసం, డిమాండ్ మెరుగుపడుతుందనీ, ప్రత్యేకించి ఎస్బీఐ ఇస్తున్న గృహ రుణ ఆఫర్లు ఈ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్వసిస్తున్నామని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల పోటీ... పండుగల సీజన్లో డిమాండ్‌ను సొంతం చేసుకోడానికి ప్రైవేటు బ్యాంకులూ ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యస్‌బ్యాంక్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణాలు, తక్కువ వ్యయ ఈఎంఐలు, గిఫ్ట్ వోచర్ల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు రద్దుసహా పలు ఆఫర్లను ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ‘ఖుషియోంకీ కరే జిమ్మెదారి సే తయారీ’ పేరిట ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. 100 శాతం ఆన్–రోడ్ ధరతో 7.99 శాతం నుంచి కారు రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 72 నెలల అత్యధిక కాలవ్యవధితో 10.45 శాతం ప్రారంభ వడ్డీకి రూ.50 లక్షల వరకూ వ్యక్తిగత రుణం పొందే సౌలభ్యం ఉన్నట్లు వివరించింది. రూ.799 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 శాతానికి పడిసి రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు ఇప్పటికే 7 శాతానికి తగ్గింది. పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రుణ ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వేగవంతమైన ఆన్లైన్ ఆమోదాలు వంటి ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కారు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహన, నిర్మాణ పరికరాల రుణాలకు ప్రాసెసింగ్ ఫీజ్ తగ్గింపు అమలవుతుంది. బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే, రూ.250 వోచర్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోళ్లకు ఈ వోచర్‌ను వినియోగిచుకోవచ్చు. ఇక యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతానికి గృహ రుణ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
ధర, వాస్తు, నీళ్లకే ప్రాధాన్యం
అందుబాటు ధర, వాస్తు, మెరుగైన నీటి సరఫరా.. ఇవే గృహాల కొనుగోళ్లలో కస్టమర్ల ప్రధాన ఎజెండాలు. ఆ తర్వాతే రవాణా సౌకర్యాలు, ఆధునిక వసతులను కోరుకుంటున్నారని రియల్టీ పోర్టల్ నోబ్రోకర్.కామ్ తెలిపింది. రూ.60 లక్షల లోపు దర, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే జై కొడుతున్నారు. భద్రత, స్కూల్స్, ఆసుపత్రుల వంటి సోషల్ ఇన్ఫ్రా కస్టమర్లూ ఉన్నారండోయ్! సాక్షి, హైదరాబాద్: నోబ్రోకర్.కామ్ ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని 70 లక్షల రిజిస్టర్ యూజర్లతో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. వీటిలో 84 శాతం మంది అందుబాటు ధర, 83 శాతం మంది నీటి సరఫరా, 73 శాతం మంది గృహ వాస్తు, 59 శాతం మంది మెరుగైన రవాణా సౌకర్యాలున్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. 53 శాతం మంది కార్ పార్కింగ్, 42 శాతం మంది భద్రత, 24 శాతం మంది లిఫ్ట్, 19 శాతం స్కూల్స్, 13 శాతం మంది ఆసుపత్రులు, 9 శాతం మంది జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉండాలని కోరుకున్నారు. కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, ఉప్పల్, నిజాంపేట ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారు. 2020 గృహ విభాగానిదే.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గడం, ప్రభుత్వం అందుబాటు గృహాలకు రాయితీలు అందిస్తుండటం వంటి కారణాలతో 2020లో గృహ విక్రయాలు జోరందుకుంటాయి. మెట్రో నగరాల్లోనూ మూలధన వృద్ధి స్థిరంగా ఉండటం, ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండటం వంటివి కూడా విక్రయాల వృద్ధికి కారణాలే. ఈ ఏడాది 64 శాతం మంది అద్దెదారులు సొంతిల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని సర్వే తెలిపింది. గతేడాది ఇది 54 శాతంగా ఉంది. ఇందులోనూ 64 శాతం మంది 35 ఏళ్లలోపే సొంతింటి కలను తీర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 35–45 ఏళ్ల మధ్య 26 శాతం, 45 ఏళ్ల పైన 10 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారు. గృహ కొనుగోళ్లలో అత్యంత ఆసక్తిగా హైదరాబాదీలే ఉన్నారు. ఇక్కడ 69 శాతం సొంతింటి ఎంపికలో నిమగ్నమై ఉంటే.. బెంగళూరులో 65 శాతం, ముంబైలో 59 శాతం, చెన్నైలో 55 శాతం, పుణేలో 56 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 58 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో రూ.54 కోట్లు నో బ్రోకర్.కామ్‌తో 2019లో మెట్రో నగరాల్లో రూ.1,154 కోట్ల బ్రోకరేజ్ తగ్గిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా రూ.372 కోట్లు, ముంబైలో రూ.342 కోట్లు, పుణేలో రూ.206 కోట్లు, చెన్నైలో రూ.180 కోట్లు, హైదరాబాద్‌లో రూ.54 కోట్ల బ్రోకరేజ్ ఆదా అయింది. బ్రోకర్లు తగ్గుతున్నారు రియల్టీ రంగంలో బ్రోకర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2018లో గృహ కొనుగోళ్లలో 14 శాతంగా ఉన్న మధ్యవర్తులు.. 2019లో 11 శాతానికి తగ్గింది. బ్రోకర్ల క్షీణత కొనుగోలుదారులకే లాభం. ఇళ్ల కొనుగోళ్లలో 35 శాతం స్నేహితులు, బంధువుల ద్వారా, 28 శాతం రియల్టీ వెబ్‌సైట్స్, 26 శాతం టులెట్ బోర్డ్స్ ద్వారా సంప్రదిస్తున్నారు. – సౌరభ్ గార్గ్, కో–ఫౌండర్, నోబ్రోకర్.కామ్ -
గృహ, వాహన లోన్లకు ఆర్బీఐ షాక్
సాక్షి, ముంబై: కీలక వడ్డీరేటును పెంచుతూ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం రుణగ్రహీతలకు భారంగా మారనుంది. వరుసగా రెండోసారి కూడా రెపో రేటు పెంపునకు మానిటరీ పాలసీ కమిటీ మొగ్గు చూపింది. కీలకమైన వడ్డీరేటు రెపోను పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారిటీ ప్రభుత్వం, ప్రయివేటు రంగ బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీరేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే పెంచిన వడ్డీరేట్లతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు వినియోగదారులపై మరింత భారం పడనుంది. రేటు పెంపుపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా కేంద్ర బ్యాంకు రెపో రేటును పెంచింది. గత నాలుగేళ్లలో మొదటిసారిగా గత రివ్యూలో రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయంతీసుకుంది. గత అయిదేళ్లలో రెపో పెంపు వరసగా ఇది రెండవసారి. కాగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పావు శాతం పెంచడంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. అటు రివర్స్ రెపోను 6 శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్) రేట్లను 6.75 శాతంగా నిర్ణయించింది. -
గృహ రుణ వడ్డీ రేట్లు ఎక్కువే!
♦ అధిక ధరలు, వడ్డీలే గృహ కొనుగోళ్లకు అడ్డంకి ♦ అందుబాటు ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది... ♦ ఐఎంజీసీ నివేదిక వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో గృహ రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకే రుణంతో సొంతిల్లు కొనుగోలు చేయటానికి కస్టమర్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని ఇండియా మార్ట్గేజ్ గ్యారంటీ కార్పొరేషన్ (ఐఎంజీసీ) నివేదిక వెల్లడించింది. అధిక స్థిరాస్తి ధరలు, రుణ వడ్డీలే ఈ రంగానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయని వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారీలో 38 శాతం మంది దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయని, 32 శాతం స్థిరాస్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మరో 30 శాతం మంది తగ్గినంత రుణ లభ్యత లేదని వెల్లడించారని ఐఎంజీసీ సీఈఓ అమితావా మెహ్రా తెలిపారు. వ్యక్తిగత పొదుపు ద్వారా తొలిసారి కొనుగోలు చేసిన ఇళ్లు కూడా ఆలస్యమవుతున్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు వ్యాఖ్యానించారు. దేశంలో 46 శాతం మిల్లినియల్స్ పేరెంట్స్‌తో, 31 శాతం అద్దె గృహాల్లో, 32 శాతం సొంతిళ్లలో నివాసముంటున్నారని తెలియజేశారు. ఈ సర్వేను మెట్రోలు, పట్టణాల్లో 4,100 మందిపై రెండు దశల్లో నిర్వహించారు. 25–34, 35–44, 45–55 ఏళ్ల వయస్సు వారు సర్వేలో పాల్గొన్నారు. అందుబాటు గృహాలకు డిమాండ్.. దేశంలో అందుబాటు గృహాలకు (అఫర్డబుల్ హౌజింగ్‌కు) డిమాండ్ పెరుగుతోంది. హౌసింగ్ ఫర్ ఆల్–2022, రుణ రాయితీలు, ప్రోత్సాహకాలే ఈ డిమాండ్‌కు కారణమని నివేదిక తెలిపింది. ఇందులోనూ 500 చ.అ.లోపు విస్తీర్ణం గల చిన్న సైజు గృహాలకు డిమాండ్ ఉందని.. అందుకే ఈ విభాగంలో ఇప్పటికే దేశంలో పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో స్థిరాస్తి రంగంలో ప్రత్యామ్నాయా నగదు లావాదేవీలు, నిల్వలు తగ్గిపోవటంతో స్థిరాస్తి ధరలు తగ్గుముఖం పట్టాయని, ఇది సొంతింటి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నదని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ శ్రీరాం కల్యాణరామన్ చెప్పారు. రోజురోజుకూ రూ.15–20 లక్షల్లోపు గృహాల కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు.