ఇల్లు కొనడం సామాన్యుడి కల. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలామంది జీవితాంతం కష్టపడుతుంటారు. కొందరు డౌన్‌పేమెంట్‌కు సరిపడా డబ్బు సంపాదించి మిగతాది లోన్ ద్వారా తీరుస్తుంటారు. అయితే హోంలోన్ వ్యవధి చాలా ఏళ్లు ఉంటుంది. ఒకవేళ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసినా ఏటా దాని విలువ తగ్గిపోతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలాగని ఇల్లు కొనకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిట్కా పాటించి ఎలాంటి లోన్ అవసరం లేకుండా పదేళ్ల తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు కొనలనుకునే ఫ్లాట్ ధర రూ.50,00,000 అనుకుందాం. అందులో రూ.10 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉంటే మరో రూ.40 లక్షలు లోన్ తీసుకోవాల్సిందే కదా. ముందుగా మీ దగ్గరున్న రూ.10 లక్షలు ఏటా 15 శాతం వృద్ధి చెందే మ్యుచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు లమ్‌సమ్(ఒకేసారి పెట్టే పెట్టుబడి) ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. దాంతో రూ.40.4 లక్షలు సమకూరుతాయి. ఒకవేళ రూ.40 లక్షలు లోన్ తీసుకుని ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేస్తే 20 ఏళ్ల వ్యవధికిగాను 9 శాతం వడ్డీ లెక్కిస్తే నెలవారీ ఈఎంఐ రూ.36 వేలు చెల్లించాలి. అందులో నుంచి రూ.10 వేలు ప్రస్తుతం ఉంటున్న ఇంటి కిరాయికి కేటాయించండి. మిగతా రూ.26 వేలు క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా 14 శాతం వడ్డీ సమకూరే మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మొత్తం రూ.68 లక్షలు సమకూరుతాయి.
ఇదీ చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
లమ్‌సమ్ పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలు, ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సిన రూ.26 వేల నుంచి పదేళ్ల తర్వాత రూ.68 లక్షలు కలిపి మొత్తం మీ చేతిలో రూ.1.08 కోట్లు ఉంటాయి. రియల్‌ఎస్టేట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించినా ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదేళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment