రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను 0.5 శాతం( 50 బేసిస్) పెంచింది. సెప్టెంబర్ 28న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభం కాగా..సెప్టెంబర్ 30న ముగిసింది.
ఆర్‌బీఐ రెపోరేట్లను పెంచడం కారణంగా..బ్యాంకులు రుణ గ్రస్తులకు ఇచ్చే లోన్‌లపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. అదే జరిగితే కార్ల లోన్లు, పర్సనల్, హోమ్ లోన్‌లు మరింత భారం కానున్నాయి. అయితే ఇప్పుడు రెపో రేట్ల పెరుగుదలతో రుణగ్రస్తులపై హోమ్ లోన్ భారం ఏ విధంగా పడుతుందో తెలుసుకుందాం.
రెండు ఆప్షన్‌లు
ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇంటి కోసం రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి రుణ భారం కాకుండా ఉండేందుకు రెండు ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఈఎంఐ కాల వ్యవధిని పెంచుకోవడం, రెండవది ప్రతి నెలా కట్టే ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం.
హోమ్ లోన్ భారం ఎంతంటే
ఉదాహరణకు..ఓ వ్యక్తి గతంలో 8.12 శాతం వడ్డీతో 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం తీసుకున్నారు. అయితే తాజాగా రెపోరేట్లు పెరిగాయి కాబట్టి సదరు వ్యక్తి తీసుకున్న రుణ టెన్యూర్ కాలం ఆటో మెటిగ్గా 2 సంవత్సరాల 3 నెలలకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ మొత్తానికి 8.62 శాతం వడ్డీతో రూ.50 లక్షలకు అదనంగా రూ.11 లక్షలు అదనంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఆర్‌బీఐ కేవలం పెంచిన 5 నెలల వ్యవధి రెపోరేటు 1.90 శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే వడ్డీ కలుపుకొని 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి రూ.50 లక్షలు తీసుకుంటే..రూ. 59 లక్షలు చెల్లించాలి.
ఒక వేళ ఈఎంఐని పెంచితే
ఒక వేళ నెలవారి చెల్లించే ఈఎంఐని పెంచినా అదే భారాన్ని రుణ గ్రహిత మోయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల రుణంపై మీరు గతంలో నెలకు చెల్లించే రూ.37,929 ఈఎంఐతో పోలిస్తే తాజా పెరిగిన 1.9 శాతం రెపో రేట్ల కారణంగా రూ. 43,771 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ రూ.5,842కి పెరుతుంది.
చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!
Comments
Please login to add a commentAdd a comment