buy houses
-
లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!
ఇల్లు కొనడం సామాన్యుడి కల. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలామంది జీవితాంతం కష్టపడుతుంటారు. కొందరు డౌన్‌పేమెంట్‌కు సరిపడా డబ్బు సంపాదించి మిగతాది లోన్ ద్వారా తీరుస్తుంటారు. అయితే హోంలోన్ వ్యవధి చాలా ఏళ్లు ఉంటుంది. ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసినా ఏటా దాని విలువ తగ్గిపోతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలాగని ఇల్లు కొనకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిట్కా పాటించి ఎలాంటి లోన్ అవసరం లేకుండా పదేళ్ల తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మీరు కొనలనుకునే ఫ్లాట్ ధర రూ.50,00,000 అనుకుందాం. అందులో రూ.10 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉంటే మరో రూ.40 లక్షలు లోన్ తీసుకోవాల్సిందే కదా. ముందుగా మీ దగ్గరున్న రూ.10 లక్షలు ఏటా 15 శాతం వృద్ధి చెందే మ్యుచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు లమ్సమ్(ఒకేసారి పెట్టే పెట్టుబడి) ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంతో రూ.40.4 లక్షలు సమకూరుతాయి. ఒకవేళ రూ.40 లక్షలు లోన్ తీసుకుని ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేస్తే 20 ఏళ్ల వ్యవధికిగాను 9 శాతం వడ్డీ లెక్కిస్తే నెలవారీ ఈఎంఐ రూ.36 వేలు చెల్లించాలి. అందులో నుంచి రూ.10 వేలు ప్రస్తుతం ఉంటున్న ఇంటి కిరాయికి కేటాయించండి. మిగతా రూ.26 వేలు క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా 14 శాతం వడ్డీ సమకూరే మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మొత్తం రూ.68 లక్షలు సమకూరుతాయి.ఇదీ చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మందిలమ్సమ్ పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలు, ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సిన రూ.26 వేల నుంచి పదేళ్ల తర్వాత రూ.68 లక్షలు కలిపి మొత్తం మీ చేతిలో రూ.1.08 కోట్లు ఉంటాయి. రియల్ఎస్టేట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించినా ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదేళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్‌లో నిపుణుల అంచనాలు!
దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్‌లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పోల్‌లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్‌లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా హౌసింగ్ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్‌లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. పెరగనున్న ఇంటి అద్దెలు ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్‌లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు. -
అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ మార్కెట్లో ప్రవాస భారతీయులు చాలా ముఖ్యమైనవాళ్లు. వాణిజ్య, నివాస సముదాయాల వృద్ధిలో ఎన్నారైలే కీలకం. మరీ ప్రత్యేకించి అఫర్డబుల్ గృహాల విభాగంలో పెట్టుబడులకు ఎన్నారైలు విపరీతమైన ఆసక్తిలో ఉన్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ‘బడా నిర్మాణ సంస్థలు, బ్రాండ్ డెవలపర్లు అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపడుతుండటం ఎన్నారైల విశ్వసనీయ పెట్టుబడులకు హామీలను అందిస్తున్నాయి. మరోవైపు లగ్జరీ, ఇతరత్రా గృహాల అద్దెల కంటే అఫర్డబుల్ ఇళ్ల రెంట్స్ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండటం ఎన్నారైలకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయని’ ఆయన వివరించారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే పొడిగింపుతో ఎన్నారైలతో పాటు దేశీయ కొనుగోలుదారులకు సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల ధరలు కూడా అదుపులో ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్త గృహాల సప్లయిలో 35 శాతం అఫర్డబుల్ హౌసింగ్సే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఎన్నారైల రియల్టీ పెట్టుబడులు చాలావరకు క్షీణించాయి. చాలా దేశాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతుండటం అఫర్డబుల్ రియలీ్టకి కలిసొచ్చే అంశం. చదవండి: సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే! బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ -
సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే!
సాక్షి, హైదరాబాద్: 90వ దశాబ్ధం వరకు సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనే లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. 45–55 ఏళ్ల వయసు గల వాళ్లే గృహ కొనుగోలుదారులుగా ఉండేవాళ్లు. బ్యాంక్ రుణాలపై అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. 20వ దశాబ్ధం నుంచి గృహ కొనుగోలుదారుల వయసు 35–45 ఏళ్లకు తగ్గిపోయింది. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్నాయి. చదవండి: బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ కొత్త ఎడిషన్ కార్లు : వారికి మాత్రమే బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్ -
బిల్‌గేట్స్ సంపదను భారతీయులు పంచుకుంటే..!
బిల్‌గేట్స్... ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలో ఉన్న వారందరికీ రూ.650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా.. విలాసవంతమైన జీవితం గడపగలరట. ప్రస్తుతం ఆయన నికర ఆస్తులు అక్షరాలా 80 బిలియన్ డాలర్స్ అంటే రూ.5,34,600 కోట్లకు పైమాటే. సెకనుకి ఆయన ఆర్జించే సంపాదన రూ.10వేల రూపాయలు. అయితే ఈయన తన ఆస్తులతో భారతీయులకు ఏమేమి చేయగలరని పలు అంచనాలు వెలువడుతున్నాయి. బిల్గేట్ తన ఆస్తులతో దేశ రాజధాని ఢిల్లీలోని బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. నోయిడాలోని బనారస్ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ.18-22 లక్షల వరకూ ఉంటుంది. నలుగురు వ్యక్తులు ఒక్క ఇంట్లో ఉంటే, 30 లక్షల ఫ్లాట్స్‌ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 0-9 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 10 నెలల వరకు క్యాండీస్‌ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట. 125 కోట్ల భారత దేశ జనాభా మొత్తాన్నికి ఆహారాన్ని, టీని స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు, ఒక్కొక్కళ్లకి రూ.6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిప్ట్గా ఆయన ఇవ్వగలరట. దీంతో చండీఘర్ ప్రాంతంలో 1.5 లక్షల బొలేరాలు చక్కర్లు కొట్టగలవని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బిల్గేట్కున్న ఆస్తులతో భారతీయులకు ఏదైనా కొని ఇవ్వగలరని తెలుస్తోంది. మైక్రోసాప్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్‌గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో దానాలు, ధర్మాలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య వంటి మొదలైన వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.