బిల్‌గేట్స్ సంపదను భారతీయులు పంచుకుంటే..!
బిల్‌గేట్స్ సంపదను భారతీయులు పంచుకుంటే..!
Published Sat, Oct 29 2016 1:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
బిల్గేట్స్... ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలో ఉన్న వారందరికీ రూ.650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా.. విలాసవంతమైన జీవితం గడపగలరట. ప్రస్తుతం ఆయన నికర ఆస్తులు అక్షరాలా 80 బిలియన్ డాలర్స్ అంటే రూ.5,34,600 కోట్లకు పైమాటే. సెకనుకి ఆయన ఆర్జించే సంపాదన రూ.10వేల రూపాయలు.
అయితే ఈయన తన ఆస్తులతో భారతీయులకు ఏమేమి చేయగలరని పలు అంచనాలు వెలువడుతున్నాయి. బిల్గేట్ తన ఆస్తులతో దేశ రాజధాని ఢిల్లీలోని బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. నోయిడాలోని బనారస్ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ.18-22 లక్షల వరకూ ఉంటుంది. నలుగురు వ్యక్తులు ఒక్క ఇంట్లో ఉంటే, 30 లక్షల ఫ్లాట్స్ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 0-9 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 10 నెలల వరకు క్యాండీస్ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట.
125 కోట్ల భారత దేశ జనాభా మొత్తాన్నికి ఆహారాన్ని, టీని స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు, ఒక్కొక్కళ్లకి రూ.6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిప్ట్గా ఆయన ఇవ్వగలరట. దీంతో చండీఘర్ ప్రాంతంలో 1.5 లక్షల బొలేరాలు చక్కర్లు కొట్టగలవని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బిల్గేట్కున్న ఆస్తులతో భారతీయులకు ఏదైనా కొని ఇవ్వగలరని తెలుస్తోంది. మైక్రోసాప్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో దానాలు, ధర్మాలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య వంటి మొదలైన వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Advertisement