Banaras
-
14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్
'సలార్' లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే నెలలోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఇప్పుడు ఓ మూవీ దాదాపు 14 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అలానే ఈ మూవీ క్రేజీ కాన్సెప్ట్‌తో తీయడం మరో విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో ఉంది? 2022 నవంబరులో 'బనారస్' అని ఓ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. జైద్ ఖాన్ అనే కుర్రాడు.. ఇదే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం విడుదల టైంలో కాస్త ఆసక్తి రేపింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయంలో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కన్నడ వెర్షన్ టీవీలో గతేడాది ప్రసారమైంది. కానీ ఓటీటీ రిలీజ్ మాత్రం అలా పెండింగ్‌లో ఉండిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) దాదాపు 14 నెలల తర్వాత 'బనారస్' మూవీకి ఓటీటీలో మోక్షం కలిగింది. ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది. కాకపోతే కన్నడ, హిందీ వెర్షన్స్ మాత్రం ఉన్నాయి. తెలుగుతో పాటు మిగతా భాషల్ని త్వరలో ఏమైనా పెడతారా అనేది చూడాలి. అలానే ఈ మూవీ చూడాలంటే సదరు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఫ్రీగానే చూసేయొచ్చు. 'బనారస్' కథేంటి? ధని (సోనాల్ మాంటెరో) ఓ పాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తోంది. ఓ పందెంలో నెగ్గడం కోసం సిద్ధార్థ్ (జైద్ ఖాన్) ఈమెకు దగ్గర అవుతాడు. భవిష్యత్తులో తామిద్దరం భార్యాభర్తలం అని, తాను భవిష్యత్ నుంచి ఇక్కడికి వచ్చానని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిందంతా నమ్మిన ధని... అతడిని తన గదికి తీసుకెళ్తుంది. ఆమె నిద్రపోతున్నప్పుడు సిద్దార్థ్ సన్నిహితంగా ఫొటో దిగుతాడు. ఆ ఫోటో తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధని క్యారెక్టర్ మీద కామెంట్స్, ట్రోల్స్ వస్తాయి. హైదరాబాద్ వదిలేసి 'బనారస్'లోని బాబాయ్ ఇంటికి వెళుతుంది ధని. తాను చేసింది తప్పని గ్రహించిన సిద్ధార్థ్.. ధనికి సారీ చెప్పడానికి వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? టైమ్ ట్రావెల్ / టైమ్ లూప్‌లో సిద్ధార్థ్ ఎలా పడ్డాడు? అనేది సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
Banaras Review: ‘బనారస్’మూవీ రివ్యూ
టైటిల్: బనారస్ నటీనటులు: జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు నిర్మాత: తిలకరాజ్ బల్లార్ దర్శకత్వం: జయతీర్థ సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి ఎడిటర్: కేఎం. ప్రకాశ్ విడుదల తేది: నవంబర్ 4, 2022 కథేంటంటే.. సిద్ధార్థ్(జైద్ ఖాన్) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్ అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్ మోంటెరో)కి దగ్గరవుతాడు. తాను టైమ్ ట్రావెల్లో భాగంగా ఫ్యూచర్ నుంచి ప్రజెంట్‌కు వచ్చానని.. భవిష్యత్తులో మనిద్దరం పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిస్తామని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ధని.. అతన్ని తన రూమ్‌కి తీసుకెళ్తుంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో సిద్ధార్ ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటో దిగి వెళ్లిపోతాడు. మూడు రోజుల్లో ఆమెను ప్రేమలో పడేయడమే కాకుండా.. ఆమె రూమ్‌కి కూడా వెళ్లానంటూ స్నేహితుల దగ్గర పందెం నెగ్గుతాడు. అయితే స్నేహితులు చేసిన పని వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంటున్న ధని క్యారెక్టర్‌పై కామెంట్స్ వస్తాయి. ఆమె బాగా ట్రోల్ కావడంతో హైదరాబాద్ వదిలి బనారస్(వారణాసి)కి వెళ్తుంది. తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెప్పడం కోసం బెనారాస్ వెళ్తుంది. ఆమె కోసం వెతుకున్న సమయంలో సిద్ధార్థ్ టైమ్ ట్రావెల్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధార్థ్ టైమ్ ట్రావెల్లో ఎలా ఇరుక్కున్నాడు? చివరకు ధని, సిద్ధార్థ్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అదే జానర్లో తెరకెక్కినా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. లవ్‌స్టోరీ, ఫిలాసఫీ, ట్వీస్ట్‌లతో సినిమా సాగుతుంది. సినిమా స్టార్టింగ్‌లోనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని పరిచయం చేశాడు దర్శకుడు. అయితే కాసేపటికే కథ మారిపోతుంది. సాధారణ ప్రేమ కథగా సాగుతుంది. స్నేహితులు చేపిన తప్పుకు హీరో క్షమాపణలు చెప్పడం... ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడడం..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో కథ మలుపు తిరుగుతుంది. సిద్ధార్థ్ టైమ్ లూప్‌లో పడిపోవడంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుస ట్విస్ట్‌లు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తాయి. కథ ఇక అయిపోయింది అనే సమయానికి మరో ట్విస్ట్..ఇలా సర్‌ప్రైజ్‌ల మీద సర్ఫ్రైజ్ ఇస్తూ సెకండాఫ్‌ని తీర్చిదిద్దాడు దర్శకుడు. సెకండాఫ్ తర్వాత ఫస్టాఫ్ ఎవరికీ గుర్తుండదు. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం రోటీన్‌గా ఉండడం నిరాశ పరుస్తుంది. ఎవరెలా చేశారంటే.. జైద్ఖాన్కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ చక్కగా నటించాడు. తెరపై హ్యాండ్సమ్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. ధని పాత్రకి హీరోయిన్ సోనాల్ మోంటెరో న్యాయం చేసింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కథంతా హీరోహీరోయిన్ల చుట్టే తిరగడంతో ఈ సినిమాలో మిగతా పాత్రలు అంతగా గుర్తుండవు. అయితే డెత్ ఫోటోగ్రాఫర్ చెంబూ పాత్ర మాత్రం కాస్త నవ్వులు పూయిస్తుంది. హీరో తండ్రిగా దేవరాజ్, హీరోయిన్ బాబాయ్‌గా అచ్యుత్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే... అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బెనరాస్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. : బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. మాయ గంగా సాంగ్ ఆకట్టుకుంటుంది. కేఎం. ప్రకాశ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోయిన్ సోనాల్ మోంటెరో (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం.. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే మాత్రం!
‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. నటనలో మంచి ప్రతిభ చూపిన నటీనటులను కూడా అంతే అభిమానిస్తారు.. వారికి నచ్చితే స్టార్‌ని చేసేస్తారు. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం’’ అని హీరోయిన్ సోనాల్ మోంటెరో అన్నారు. జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో జంటగా జయతీర్థ దర్శకత్వంలో తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన చిత్రం ‘బనారస్’. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో నిర్మాత సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. సోనాల్ మోంటెరో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ధని అనే పాత్ర చేశాను. కథ నా పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, హీరోయిన్‌కీ అంతే ప్రాముఖ్యత ఉంది. డిఫరెంట్ జానర్స్ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. జైద్‌ఖాన్ మంచి కో స్టార్. జయతీర్థ సినిమా బాగా తీశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘సీతారామం’ సినిమాలు చూశాను. విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను.. వీటిలో సరోజినీ నాయుడుగారి బయోపిక్ కూడా ఉంది.. ఈ మూవీని చాలెంజింగ్‌గా భావిస్తున్నా’’ అన్నారు. -
ప్రేక్షకుల సమయం వృథా కాకూడదు
‘‘ప్రేక్షకులు డబ్బు పెట్టి థియేటర్స్‌కు వస్తారు.. అయితే వారు ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి సంపాదించుకోగలరు. కానీ, సినిమా కోసం వెచ్చించిన రెండున్నర గంటలు ఎవరూ తిరిగి ఇవ్వలేరు. అందుకే ప్రేక్షకుల టైమ్ వృథా కాకుండా వారిని ఎంటర్టైన్ చేసేలా సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జైద్ ఖాన్. జయతీర్థ దర్శకత్వంలో జైద్‌ఖాన్, సోనాల్ మోంటారో జంటగా నటించిన చిత్రం ‘బనారస్’. తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న రిలీజ్ కానుంది. తెలుగులో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. జైద్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘బనారస్’ చిత్రం మిస్టీరియస్ లవ్‌స్టోరీ. 85 శాతం షూటింగ్ బనారస్‌లోనే చేశాం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఇందులో చిన్న అంశం మాత్రమే. సస్పెన్స్, కామెడీ, థ్రిల్.. ఇలా ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజగార్లు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎక్కువగా ప్రేమకథలు చేయాలనుకుంటున్నాను. నాలుగు కొత్త సినిమాలకు ఓకే చెప్పాను’’ అన్నారు. -
Banaras: 'బనారస్' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘బనారస్’. ‘బెల్ బాటమ్’ ఫేమ్ జయతీర్థ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో ప్రేమకథగా రూపొందిన బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. (చదవండి: నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు.. ఆయన కోసమే ఒప్పుకున్నా: సూర్య) ఈ సందర్భంగా జైద్ ఖాన్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్ లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. 'బనారస్' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది’ అన్నారు. ‘ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. నవంబర్ 4న విడుదల పెద్ద ఎత్తున తెలుగులో విడుదల చేస్తున్నాం. బలమైన కంటెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’అని నిర్మాత సతీష్ వర్మ అన్నారు. -
మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్ షూటర్‌గా ఎదిగిన బనారస్ అమ్మాయి
అరచేతిలో అందమైన మెహిందీ డిజైన్లను నేర్పుగా వేస్తూ అందమైన జీవితం కోసం కలలు కంటూ ఉండేది పూజావర్మ. తన కలకో లక్ష్యాన్ని ఏర్పరుచుకుని రైఫిల్ షూటర్ కావాలనుకుంది. పండగలు, పెళ్ళిళ్లకు అమ్మాయి చేతుల్లో మెహిందీ డిజైన్స్ వేస్తూ అలా వచ్చిన డబ్బుతో షూటర్‌గా నైపుణ్యం సాధించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో నెంబర్‌వన్ షూటర్‌గా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్ వాసి అయిన 26 ఏళ్ల పూజావర్మ తన కలను సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పెద్ద పెద్ద కలలు కనగానే సరిపోదు, కలల సాధనకు ఎంతటి కష్టమైనా భరించాల్సిందే అని ఇరవై ఆరేళ్ల్ల పూజా వర్మను చూస్తే అర్ధమవుతుంది. సవాళ్లతో కూడిన ఆమె జీవనశైలి నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇటీవల మీడియాకు వివరించిన ఆ స్ఫూర్తివంతమైన కథనం ఆమె మాటల్లోనే... అప్పుగా ఐదు లక్షలు ‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అక్కడ ఎన్సీసీ వల్ల క్రీడలపై ఆసక్తి ఏర్పడింది. అక్కడే షూటింగ్ రైఫిల్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో స్కూల్ నుంచే రైఫిళ్లు, బుల్లెట్లు ఉచితంగా వచ్చేవి. ఇది చాలా ఖరీదైన గేమ్ అని నాకు అప్పుడు తెలియదు. స్కూల్ అయిపోగానే ఉచితంగా వచ్చే అవకాశాలన్నీ పోయాయి. కానీ, షూటింగ్లో దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కల కనేదాన్ని. అయితే, ఇంటి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అమ్మ గృహిణి. నాన్న డ్రైవర్. అన్నయ్య బట్టల దుకాణం నడుపుతున్నాడు. అక్క పెళ్లి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సాధారణ కుటుంబంలోనైనా ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనడానికి వీలు లేదు. కానీ, నా కుటుంబం మాత్రం అడుగడుగునా నాకు అండగా నిలిచింది. 2015లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం కావడానికి నాకు సొంత రైఫిల్ అవసరం. ఐదు లక్షలకన్నా తక్కువ ధరకు రైఫిల్ అందుబాటులో లేదు. రోజుకు మూడు షిప్టులలో వేర్వేరు ఉద్యోగాలు చేసేదాన్ని. అయినా అంత డబ్బు సమకూరలేదు. అమ్మనాన్న, మా అన్న డబ్బు అప్పు తెచ్చి ఇచ్చారు. రైఫిల్ కొన్నాను. మొదటిసారి నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఏడు సంవత్సరాలుగా అప్పు తీరుస్తూనే ఉన్నాం. శిక్షణకు సాయం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కోచ్ బిప్లాప్ గోస్వామిని కలిశాను. నాలో ఆసక్తి, ప్రతిభ గమనించి, డబ్బులు తీసుకోకుండానే శిక్షణ ఇవ్వడానికి సాయం చేశారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ఛాంపియన్షిప్ వరకు ఫెడరేషన్ సహాయంతో చాలా సార్లు రైఫిల్స్‌ను అరువుగా తీసుకున్నాను. ఇలాగే జిల్లా నుండి రాష్ట్రానికి తరువాత జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగాను. షూటర్ ప్రాక్టీస్‌కు షూటింగ్ రేంజ్ అవసరం. ఇతర క్రీడల మాదిరిగా పార్కులోనో, దగ్గరలో ఉన్న మైదానంలోనో ప్రాక్టీస్ చేయలేం. అందుకే రెండేళ్ల క్రితం డిస్ట్రిక్ట్ రైఫిల్ క్లబ్ ఆఫ్ బనారస్‌కు చేరుకున్నాను. క్లబ్ ఎంట్రీ ఫీజు 12 వేల రూపాయలు. ఇది నాకు చాలా పెద్ద మొత్తం. ఒకేసారి చెల్లించలేనని సిటీ మెజిస్ట్రేట్ ఆఫీసు చుట్టూ నెల రోజులు ప్రదక్షణలు చేస్తే, చివరకు వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టడానికి అంగీకరించారు. జాతీయ స్థాయి శిబిరానికి వెళ్లడానికి రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. కానీ, కరోనాతో ఆ అవకాశమూ పోయింది. ఒక రైఫిల్ బుల్లెట్ ధర 30 నుంచి 32 రూపాయలు. ఒక గేమ్ ఆడటానికి కనీసం 70 నుంచి 80 బుల్లెట్లు ఖర్చవుతాయి. దీంతో అత్యంత ఖరీదైన క్రీడలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన బుల్లెట్లు కూడా అవసరం. దేశంలో ఎక్కడైనా ఛాంపియన్షిప్ పోటీలు జరిగితే రిజిస్ట్రేషన్ ఫీజు, బుల్లెట్ల కొనుగోలు, బస–వసతి సదుపాయలు, ప్రయాణ ఖర్చులు.. అన్నీ కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీలైనన్ని ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి నా వద్ద అంత డబ్బు లేదు. మెహందీ డిజైన్లు.. డ్రైవింగ్.. రాష్ట్రస్థాయి అధికారులను కలిశాను. కానీ, ఎలాంటి సాయమూ అందలేదు. చుట్టుపక్కల స్కూళ్లలో పిల్లలకు క్రీడలలో శిక్షణ ఇస్తుంటాను. పెళ్లి, వివిధ సందర్భాలలో జరిగే వేడుకలలో మెహందీ డిజైన్లు వేస్తాను. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇలా రెండేళ్లపాటు కృషి చేస్తే కొంత డబ్బు జమయ్యింది. 2021 నుండి మళ్లీ ఆడటం ప్రారంభించాను. 43వ యుపి స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించాను. స్టేట్ నెంబర్ 1 ర్యాంకులో నిలిచాను. ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించడానికి శిక్షణ తీసుకుంటున్నాను. బ్యాచులర్ ఆఫ్ ఫిజికెల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. మాస్టర్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను’’ అని తన కల కోసం, లక్ష్య సాధనకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంది పూజావర్మ. లక్ష్య సాధనలో.. షూటింగ్ బోర్డ్‌లోని లక్ష్య కేంద్రాన్ని బుల్సీ షూటింగ్ లేదా బుల్స్ ఐ అంటారు. రైఫిల్ షూటింగ్ అంటే అంత సులువు కాదు. లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో ఛేదించాలి. ‘మావలంకర్’ షూటింగ్ పోటీలో బెస్ట్ క్యాడెట్, 41వ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో త్రీ పొజిషన్ రైఫిల్‌లో బంగారు పతకం, ఆర్మీ క్యాంపు షూటింగ్లో బంగారు పతకాలు సాధించింది. -
బిల్‌గేట్స్ సంపదను భారతీయులు పంచుకుంటే..!
బిల్‌గేట్స్... ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలో ఉన్న వారందరికీ రూ.650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా.. విలాసవంతమైన జీవితం గడపగలరట. ప్రస్తుతం ఆయన నికర ఆస్తులు అక్షరాలా 80 బిలియన్ డాలర్స్ అంటే రూ.5,34,600 కోట్లకు పైమాటే. సెకనుకి ఆయన ఆర్జించే సంపాదన రూ.10వేల రూపాయలు. అయితే ఈయన తన ఆస్తులతో భారతీయులకు ఏమేమి చేయగలరని పలు అంచనాలు వెలువడుతున్నాయి. బిల్గేట్ తన ఆస్తులతో దేశ రాజధాని ఢిల్లీలోని బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. నోయిడాలోని బనారస్ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ.18-22 లక్షల వరకూ ఉంటుంది. నలుగురు వ్యక్తులు ఒక్క ఇంట్లో ఉంటే, 30 లక్షల ఫ్లాట్స్‌ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 0-9 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 10 నెలల వరకు క్యాండీస్‌ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట. 125 కోట్ల భారత దేశ జనాభా మొత్తాన్నికి ఆహారాన్ని, టీని స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు, ఒక్కొక్కళ్లకి రూ.6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిప్ట్గా ఆయన ఇవ్వగలరట. దీంతో చండీఘర్ ప్రాంతంలో 1.5 లక్షల బొలేరాలు చక్కర్లు కొట్టగలవని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బిల్గేట్కున్న ఆస్తులతో భారతీయులకు ఏదైనా కొని ఇవ్వగలరని తెలుస్తోంది. మైక్రోసాప్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్‌గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో దానాలు, ధర్మాలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య వంటి మొదలైన వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
బనారంగ్
అరచేతిలోకి సూర్యుణ్ణి తీసుకుని రుద్దితే దాన్ని తీసుకెళ్లి చంద్రుడికి అద్దితే ఆకాశం కొత్తగా ఉండదూ! బనారస్ చీరల రంగులు వేడివేడిగా... చల్లచల్లగా... హృదయాన్ని తాకుతాయి. ఈ రంగుల రంగేళీయే... బనారంగ్ వేర్ ట్రెడిషన్ బ్రేక్స్ ట్రెడిషన్. సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన కొత్తరంగులివి. మొఘలుల కళ మగ్గం మీద ఒక్క నాణ్యమైన బనారస్ పట్టు చీర నేయాలంటే కనీసం 15 రోజుల నుంచి ఆరు నెలల కాలం పడుతుంది. 14వ శతాబ్దికి ముందు గుజరాత్ నుంచి వలస వెళ్లిన చేనేతకారులు బనారస్‌లో చీరలు నేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రాంతం పేరుమీదుగా బనారస్ ఫ్యాబ్రిక్‌కు ఆ పేరు వచ్చింది. మొఘలుల కాలంలో ఈ చీరల నేతలో ఎన్నో మార్పులు వచ్చాయి. 19వ శతాబ్ది మొదట్లో బనారస్ పట్టు స్థానంలో జరీ, బ్రొకేడ్ వెలుగు చూసింది. అలాగే, పట్టులోనే బ్రొకేడ్ మెరుపులు 17వ శతాబ్దిలో పరిచయం అయ్యాయి. వీటిల్లో ప్యూర్ బనారస్ సిల్క్, జార్జెట్, ఆర్గంజా, జరీ, సిల్క్‌లు ప్రవేశించాయి. టిష్యూ, బుటీదార్, కట్‌వర్క్, టంచోయి, జంగల్.. వంటివీ పరిచయం అయ్యాయి. దీంతో డిజైనర్ శారీస్ అంటే బెనారస్ ఫ్యాబ్రిక్ అనే పేరు స్థిరపడిపోయింది. పువ్వులు, పండ్ల నుంచి తీసిన నేచురల్ కలర్స్ రంగులు సిల్కు దారాలకు ఇంకేలా చర్యలు తీసుకొని, ఆ తర్వాత ఫ్యాబ్రిక్‌గా మెరిపిస్తారు. అందుకే ఈ కళకు సహజమైన ప్రత్యేకత ఇమిడి ఉంటుంది. డిజైనర్ల మొట్టమొదటి ఎంపిక భారతీయ డిజైనర్లు ఎంపిక చేసుకునే మొట్టమొదటి ఫ్యాబ్రిక్ బనారస్. భారతీయ వివాహ వేడుకలలో ప్రధానంగా కనిపించే వస్త్రం బనారస్. అన్ని మతాలకు నప్పే ఏకైక వస్త్రంగా చరిత్ర నిలుపుకున్నది బనారస్. మన గొప్ప సంస్కృతికి కళాత్మక చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్ వేల ఏళ్లుగా తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. బనారస్ ఫ్యాబ్రిక్‌లోని రంగులు, జరీ వెలుగులు చూపుతిప్పుకోనివ్వవు. ప్రతి భారతీయ మహిళ తప్పని సరిగా తన వార్డ్‌రోబ్‌లో బనారస్ చీర ఒక్కటైనా ఉండాలని ముచ్చటపడతారంటే అతిశయోక్తి కాదు. ఇండో వెస్ట్రన్ బనారస్ చీరలలో బ్రొకేడ్, ఫైన్ సిల్క్, మెత్తటి జరీ ఎప్పుడూ హైలైట్. ఇది రాయల్ ఫ్యాబ్రిక్ అవడంతో దుస్తుల్లో ఏదైనా ఒక అంశంగా తీసుకోవాలని ముచ్చపడేవారే ఎక్కువ. దీంతో జాకెట్లు, ట్రౌజర్లు, చీరలు డ్రెస్సుల అంచులు, ట్రెడిషనల్ ఇండియన్ ఔట్ఫిట్స్.. గా బెనారస్ ఫ్యాబ్రిక్ ఇమిడిపోయింది. బ్రైడల్ లెహంగా లేదా ఫెస్టివ్ లెహంగా ఏదైనా ఈ తరం అమితంగా ముచ్చటపడి ఎంచుకునే లెహంగా బనారస్ ఫ్యాబ్రిక్. ఏ ఫ్యాబ్రిక్‌తో చేసిన డ్రెస్ అయినా భనారస్ దుపట్టా వేసుకుంటే చాలు ఒక గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. బనారస్ ట్యునిక్స్, కుర్తాలను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించవచ్చు. స్ట్రెయిట్ ట్రౌజర్ లేదా లెహంగా మీదకు బనారస్ కుర్తా వేసుకుంటే నాటికీ- నేటికీ అద్దం పట్టే ఒక ఫ్యుజన్ స్టైల్ వస్తుంది.