ప్రేక్షకుల సమయం వృథా కాకూడదు | Zaid Khan Interview Banaras Movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల సమయం వృథా కాకూడదు

Published Mon, Oct 31 2022 6:14 AM | Last Updated on Mon, Oct 31 2022 6:14 AM

Zaid Khan Interview Banaras Movie - Sakshi

‘‘ప్రేక్షకులు డబ్బు పెట్టి థియేటర్స్‌కు వస్తారు.. అయితే వారు ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి సంపాదించుకోగలరు. కానీ, సినిమా కోసం వెచ్చించిన రెండున్నర గంటలు ఎవరూ తిరిగి ఇవ్వలేరు. అందుకే ప్రేక్షకుల టైమ్‌ వృథా కాకుండా వారిని ఎంటర్‌టైన్‌ చేసేలా సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జైద్‌ ఖాన్‌. జయతీర్థ దర్శకత్వంలో జైద్‌ఖాన్, సోనాల్‌ మోంటారో జంటగా నటించిన చిత్రం ‘బనారస్‌’. తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న రిలీజ్‌ కానుంది.

తెలుగులో ‘నాంది’ ఫేమ్‌ సతీష్‌ వర్మ విడుదల చేస్తున్నారు. జైద్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘బనారస్‌’ చిత్రం మిస్టీరియస్‌ లవ్‌స్టోరీ. 85 శాతం షూటింగ్‌ బనారస్‌లోనే చేశాం. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ అనేది ఇందులో చిన్న అంశం మాత్రమే. సస్పెన్స్, కామెడీ, థ్రిల్‌.. ఇలా ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. తెలుగులో చిరంజీవి, పవన్‌ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజగార్లు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎక్కువగా ప్రేమకథలు చేయాలనుకుంటున్నాను. నాలుగు కొత్త సినిమాలకు ఓకే చెప్పాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement