'సలార్' లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే నెలలోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఇప్పుడు ఓ మూవీ దాదాపు 14 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అలానే ఈ మూవీ క్రేజీ కాన్సెప్ట్‌తో తీయడం మరో విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో ఉంది?
2022 నవంబరులో 'బనారస్' అని ఓ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. జైద్ ఖాన్ అనే కుర్రాడు.. ఇదే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం విడుదల టైంలో కాస్త ఆసక్తి రేపింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయంలో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కన్నడ వెర్షన్ టీవీలో గతేడాది ప్రసారమైంది. కానీ ఓటీటీ రిలీజ్ మాత్రం అలా పెండింగ్‌లో ఉండిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?)
దాదాపు 14 నెలల తర్వాత 'బనారస్' మూవీకి ఓటీటీలో మోక్షం కలిగింది. ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది. కాకపోతే కన్నడ, హిందీ వెర్షన్స్ మాత్రం ఉన్నాయి. తెలుగుతో పాటు మిగతా భాషల్ని త్వరలో ఏమైనా పెడతారా అనేది చూడాలి. అలానే ఈ మూవీ చూడాలంటే సదరు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఫ్రీగానే చూసేయొచ్చు.
'బనారస్' కథేంటి?
ధని (సోనాల్ మాంటెరో) ఓ పాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తోంది. ఓ పందెంలో నెగ్గడం కోసం సిద్ధార్థ్ (జైద్ ఖాన్) ఈమెకు దగ్గర అవుతాడు. భవిష్యత్తులో తామిద్దరం భార్యాభర్తలం అని, తాను భవిష్యత్ నుంచి ఇక్కడికి వచ్చానని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిందంతా నమ్మిన ధని... అతడిని తన గదికి తీసుకెళ్తుంది. ఆమె నిద్రపోతున్నప్పుడు సిద్దార్థ్ సన్నిహితంగా ఫొటో దిగుతాడు. ఆ ఫోటో తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధని క్యారెక్టర్ మీద కామెంట్స్, ట్రోల్స్ వస్తాయి. హైదరాబాద్ వదిలేసి 'బనారస్'లోని బాబాయ్ ఇంటికి వెళుతుంది ధని. తాను చేసింది తప్పని గ్రహించిన సిద్ధార్థ్.. ధనికి సారీ చెప్పడానికి వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? టైమ్ ట్రావెల్ / టైమ్ లూప్‌లో సిద్ధార్థ్ ఎలా పడ్డాడు? అనేది సినిమా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment