Satish Varma
-
నా కల నెరవేరుతోంది
‘‘ఛాంగురే బంగారురాజా’ కుటుంబంతో కలిసి హాయిగా చూడదగ్గ సినిమా. ఇందులో మంగరత్నం అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర చేశాను. మెకానిక్ బంగార్రాజుగా కార్తీక్ నటించారు. మా ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. రవితేజగారి నిర్మాణంలో నా మొదటి సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ గోల్డీ నిస్సీ అన్నారు. కార్తీక్ రత్నం హీరోగా సతీష్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. రవితేజ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోల్డీ నిస్సీ మాట్లాడుతూ–‘‘నేను తెలుగమ్మాయిని. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. హీరోయిన్గా నా తొలి సినిమా ‘ఛాంగురే బంగారురాజా’. రవితేజగారిని కలిసినప్పుడు ‘సినిమా చూశాను. నీకు ఇది తొలి సినిమా అయినా భయం లేకుండా నటించావ్’ అని మెచ్చుకోవడం హ్యాపీ. నన్ను నేను పెద్ద తెరపై చూసుకోవాలనే కల నెరవేరుతుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
నాంది క్రేజ్‌ని ‘నేను స్టూడెంట్’ నిలబెడుతుంది: సతీష్ వర్మ
‘‘బాహుబలి, హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం’ లాంటి కొన్ని సినిమాలు తప్పితే చాలావరకు ఏ సినిమానీ నేను రెండోసారి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను.. ఎక్కడా బోర్ కొట్టదు. కోవిడ్ కారణంగా 40 ఏళ్లకు పైబడిన వారు ‘నాంది’ సినిమాని ఎక్కువగా థియేటర్‌కి వచ్చి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం అన్ని వయసుల వారు థియేటర్‌కి వచ్చి చూసేలా ఉంటుంది’’ అని నిర్మాత ‘నాంది’ సతీష్ వర్మ అన్నారు. బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’.సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ వర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’లో యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్‌ని చూపించాం. గణేష్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. మంచి థ్రిల్లర్ జోనర్లో కథ సాగుతుంది. ‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమా నిలబెడుతుందని భావిస్తున్నాను. కృష్ణ చైతన్యగారి కథని రాకేష్ ఉప్పలపాటి చక్కగా తీశారు. నటి భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతికని మా సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం చేయడం హ్యాపీ. మా తర్వాతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అన్నారు. -
ప్రేక్షకుల సమయం వృథా కాకూడదు
‘‘ప్రేక్షకులు డబ్బు పెట్టి థియేటర్స్‌కు వస్తారు.. అయితే వారు ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి సంపాదించుకోగలరు. కానీ, సినిమా కోసం వెచ్చించిన రెండున్నర గంటలు ఎవరూ తిరిగి ఇవ్వలేరు. అందుకే ప్రేక్షకుల టైమ్ వృథా కాకుండా వారిని ఎంటర్టైన్ చేసేలా సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జైద్ ఖాన్. జయతీర్థ దర్శకత్వంలో జైద్‌ఖాన్, సోనాల్ మోంటారో జంటగా నటించిన చిత్రం ‘బనారస్’. తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న రిలీజ్ కానుంది. తెలుగులో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. జైద్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘బనారస్’ చిత్రం మిస్టీరియస్ లవ్‌స్టోరీ. 85 శాతం షూటింగ్ బనారస్‌లోనే చేశాం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఇందులో చిన్న అంశం మాత్రమే. సస్పెన్స్, కామెడీ, థ్రిల్.. ఇలా ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజగార్లు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎక్కువగా ప్రేమకథలు చేయాలనుకుంటున్నాను. నాలుగు కొత్త సినిమాలకు ఓకే చెప్పాను’’ అన్నారు. -
Banaras: 'బనారస్' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘బనారస్’. ‘బెల్ బాటమ్’ ఫేమ్ జయతీర్థ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో ప్రేమకథగా రూపొందిన బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. (చదవండి: నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు.. ఆయన కోసమే ఒప్పుకున్నా: సూర్య) ఈ సందర్భంగా జైద్ ఖాన్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్ లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. 'బనారస్' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది’ అన్నారు. ‘ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. నవంబర్ 4న విడుదల పెద్ద ఎత్తున తెలుగులో విడుదల చేస్తున్నాం. బలమైన కంటెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’అని నిర్మాత సతీష్ వర్మ అన్నారు.