Zaid Khan
-
Banaras Review: ‘బనారస్’మూవీ రివ్యూ
టైటిల్: బనారస్ నటీనటులు: జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు నిర్మాత: తిలకరాజ్ బల్లార్ దర్శకత్వం: జయతీర్థ సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి ఎడిటర్: కేఎం. ప్రకాశ్ విడుదల తేది: నవంబర్ 4, 2022 కథేంటంటే.. సిద్ధార్థ్(జైద్ ఖాన్) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్ అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్ మోంటెరో)కి దగ్గరవుతాడు. తాను టైమ్ ట్రావెల్లో భాగంగా ఫ్యూచర్ నుంచి ప్రజెంట్‌కు వచ్చానని.. భవిష్యత్తులో మనిద్దరం పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిస్తామని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ధని.. అతన్ని తన రూమ్‌కి తీసుకెళ్తుంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో సిద్ధార్ ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటో దిగి వెళ్లిపోతాడు. మూడు రోజుల్లో ఆమెను ప్రేమలో పడేయడమే కాకుండా.. ఆమె రూమ్‌కి కూడా వెళ్లానంటూ స్నేహితుల దగ్గర పందెం నెగ్గుతాడు. అయితే స్నేహితులు చేసిన పని వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంటున్న ధని క్యారెక్టర్‌పై కామెంట్స్ వస్తాయి. ఆమె బాగా ట్రోల్ కావడంతో హైదరాబాద్ వదిలి బనారస్(వారణాసి)కి వెళ్తుంది. తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెప్పడం కోసం బెనారాస్ వెళ్తుంది. ఆమె కోసం వెతుకున్న సమయంలో సిద్ధార్థ్ టైమ్ ట్రావెల్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధార్థ్ టైమ్ ట్రావెల్లో ఎలా ఇరుక్కున్నాడు? చివరకు ధని, సిద్ధార్థ్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అదే జానర్లో తెరకెక్కినా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. లవ్‌స్టోరీ, ఫిలాసఫీ, ట్వీస్ట్‌లతో సినిమా సాగుతుంది. సినిమా స్టార్టింగ్‌లోనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని పరిచయం చేశాడు దర్శకుడు. అయితే కాసేపటికే కథ మారిపోతుంది. సాధారణ ప్రేమ కథగా సాగుతుంది. స్నేహితులు చేపిన తప్పుకు హీరో క్షమాపణలు చెప్పడం... ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడడం..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో కథ మలుపు తిరుగుతుంది. సిద్ధార్థ్ టైమ్ లూప్‌లో పడిపోవడంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుస ట్విస్ట్‌లు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తాయి. కథ ఇక అయిపోయింది అనే సమయానికి మరో ట్విస్ట్..ఇలా సర్‌ప్రైజ్‌ల మీద సర్ఫ్రైజ్ ఇస్తూ సెకండాఫ్‌ని తీర్చిదిద్దాడు దర్శకుడు. సెకండాఫ్ తర్వాత ఫస్టాఫ్ ఎవరికీ గుర్తుండదు. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం రోటీన్‌గా ఉండడం నిరాశ పరుస్తుంది. ఎవరెలా చేశారంటే.. జైద్ఖాన్కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ చక్కగా నటించాడు. తెరపై హ్యాండ్సమ్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. ధని పాత్రకి హీరోయిన్ సోనాల్ మోంటెరో న్యాయం చేసింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కథంతా హీరోహీరోయిన్ల చుట్టే తిరగడంతో ఈ సినిమాలో మిగతా పాత్రలు అంతగా గుర్తుండవు. అయితే డెత్ ఫోటోగ్రాఫర్ చెంబూ పాత్ర మాత్రం కాస్త నవ్వులు పూయిస్తుంది. హీరో తండ్రిగా దేవరాజ్, హీరోయిన్ బాబాయ్‌గా అచ్యుత్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే... అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బెనరాస్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. : బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. మాయ గంగా సాంగ్ ఆకట్టుకుంటుంది. కేఎం. ప్రకాశ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోయిన్ సోనాల్ మోంటెరో (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం.. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే మాత్రం!
‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. నటనలో మంచి ప్రతిభ చూపిన నటీనటులను కూడా అంతే అభిమానిస్తారు.. వారికి నచ్చితే స్టార్‌ని చేసేస్తారు. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం’’ అని హీరోయిన్ సోనాల్ మోంటెరో అన్నారు. జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో జంటగా జయతీర్థ దర్శకత్వంలో తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన చిత్రం ‘బనారస్’. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో నిర్మాత సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. సోనాల్ మోంటెరో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ధని అనే పాత్ర చేశాను. కథ నా పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, హీరోయిన్‌కీ అంతే ప్రాముఖ్యత ఉంది. డిఫరెంట్ జానర్స్ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. జైద్‌ఖాన్ మంచి కో స్టార్. జయతీర్థ సినిమా బాగా తీశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘సీతారామం’ సినిమాలు చూశాను. విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను.. వీటిలో సరోజినీ నాయుడుగారి బయోపిక్ కూడా ఉంది.. ఈ మూవీని చాలెంజింగ్‌గా భావిస్తున్నా’’ అన్నారు. -
ప్రేక్షకుల సమయం వృథా కాకూడదు
‘‘ప్రేక్షకులు డబ్బు పెట్టి థియేటర్స్‌కు వస్తారు.. అయితే వారు ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి సంపాదించుకోగలరు. కానీ, సినిమా కోసం వెచ్చించిన రెండున్నర గంటలు ఎవరూ తిరిగి ఇవ్వలేరు. అందుకే ప్రేక్షకుల టైమ్ వృథా కాకుండా వారిని ఎంటర్టైన్ చేసేలా సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జైద్ ఖాన్. జయతీర్థ దర్శకత్వంలో జైద్‌ఖాన్, సోనాల్ మోంటారో జంటగా నటించిన చిత్రం ‘బనారస్’. తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న రిలీజ్ కానుంది. తెలుగులో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. జైద్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘బనారస్’ చిత్రం మిస్టీరియస్ లవ్‌స్టోరీ. 85 శాతం షూటింగ్ బనారస్‌లోనే చేశాం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఇందులో చిన్న అంశం మాత్రమే. సస్పెన్స్, కామెడీ, థ్రిల్.. ఇలా ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజగార్లు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎక్కువగా ప్రేమకథలు చేయాలనుకుంటున్నాను. నాలుగు కొత్త సినిమాలకు ఓకే చెప్పాను’’ అన్నారు. -
Banaras: 'బనారస్' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘బనారస్’. ‘బెల్ బాటమ్’ ఫేమ్ జయతీర్థ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో ప్రేమకథగా రూపొందిన బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. (చదవండి: నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు.. ఆయన కోసమే ఒప్పుకున్నా: సూర్య) ఈ సందర్భంగా జైద్ ఖాన్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్ లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. 'బనారస్' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది’ అన్నారు. ‘ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. నవంబర్ 4న విడుదల పెద్ద ఎత్తున తెలుగులో విడుదల చేస్తున్నాం. బలమైన కంటెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’అని నిర్మాత సతీష్ వర్మ అన్నారు.