సొంతిల్లు సామాన్యుడి కల.. కొందరికి అది పరువు మర్యాద.. ఇంకొందరికి తలకు మించిన భారం. కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు బంధువుల ఇంటికి వెళితే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావని అడుగుతారు. పిల్లల పెళ్లిల్లు చేసినవారు వెళితే ‘అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా ఇల్లు తీసుకోండి’ అంటారు. సరపడా డబ్బు ఉండి సమాజంలో మరింత గౌరవం కోసం ఇల్లు తీసుకునే వారు కొందరైతే.. సమాజానికి భయపడి పక్కవారికి ఎక్కడ లోకువవుతామోనని ఇల్లు కొనేవారు కొందరు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పుచేసి ఇల్లు కొంటారు. అయితే చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్నవారు ఇల్లు తీసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్ తీసుకుంటారు. వచ్చే జీతంలో సగానికిపైగా ఈఎంఐలకు పోతుంది. కాబట్టి, ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ముందుగా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండాలి.
ప్రతినెల వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి.
మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి.
పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి.
ఉద్యోగం చేస్తూంటే ఏదైనా అనివార్య కారణాలతో జాబ్ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు.
ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.
ఇదీ చదవండి: కంటెంట్ తొలగించకపోతే అరెస్టు తప్పదు!
కుటుంబం అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగి మనం చనిపోతే ఈఎంఐలు, అప్పులని ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తారు. కాబట్టి మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి. మనకు ఏదైనా జరిగితే మొత్తం డబ్బును చెల్లించేలా ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment