
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), రూపే డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చెంట్ ఫీజులను తిరిగి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు బ్యాంకింగ్ సమాఖ్య పంపిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ లావాదేవీలపైన ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారుల యూపీఐ చెల్లింపుల మీద 'మర్చెంట్ డిస్కౌంట్ రేట్' (MDR)ను మళ్ళీ తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి పంపించారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో.. ఇది త్వరలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వీసా కార్డు, మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ చెల్లిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారు యూపీఐ, రూపే డెబిట్ కార్డుల లావాదేవీలపై కూడా ఛార్జీలు ఎందుకు చెల్లించకూడదు?. ఈ విషయాన్ని కేంద్రం అలోచించి సానుకూలంగా స్పందించింది. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా.. ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో ఎండీఆర్ చార్జీలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు వ్యాపారుల లావాదేవీ మొత్తంలో ఒక శాతం కంటే తక్కువ ఛార్జీ వసూలు చేసేవారు. తరువాత ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేయడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వచ్చింది. అయితే ఈ సబ్సిడీ కూడా ఈ ఏడాది రూ. 3,500 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఛార్జీలు వసూలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం.. మరోసారి తగ్గిన రేటు
ఇటీవల కొత్తగా నియమితులైన ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో జరిగిన సమావేశంలో ఫిన్‌టెక్ అధికారులు డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ అంశాన్ని లేవనెత్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, ఫిబ్రవరి 2025లో యూపీఐ లావాదేవీల మొత్తం 16.11 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment