online transactions
-
ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.యూపీఐ 123 పే కస్టమర్లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్‌కి కాల్ చేయండి•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. -
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్‌లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.భారత్‌లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలుదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. -
ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..
దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది.మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,737 కోట్లకు పెరిగాయి. ఇది ఏటా 44 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా, కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు. -
యూపీఐ పేమెంట్స్‌లో కొత్త రూల్స్.. అవేంటో మీకు తెలుసా?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ పేమెంట్స్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ జనవరి 1, 2024 నుంచి యూపీఐ పేమెంట్ అకౌంట్ ఐడీల నిబంధనల్ని మార్చింది. వాటికి అనుగుణంగా లేని యూపీఐ పేమెంట్స్ అకౌంట్ ఐడీల రద్దుతో పాటు రోజూవారి లిమిట్‌ను పెంచింది. దీంతో పాటు కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టీవ్‌గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టీవ్టే చేయాలని బ్యాంకులను కోరింది. ఎన్పీసీఐ ప్రకారం..యూపీఐ లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితి గరిష్టంగా 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అయితే, డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేలా ఆర్బీఐ డిసెంబర్ 8, 2023 నుంచి ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఆన్లైన్ వాలెట్లను ఉపయోగించి రూ. 2,000 కంటే ఎక్కువ నగదు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై మాత్రమే 1.1 శాతం ఇంటర్చేంజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ యూపీఐ వినియోగదారులకు వర్తించదు. యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరిగే కొద్ది ఆర్ధిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు మీ ఫోన్‌పే నెంబర్ నుంచి తొలిసారిగా మరో కొత్త ఫోన్‌పే నెంబర్‌కు రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పంపిస్తే.. ఆ నగదు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టనుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మనం ఇప్పటి వరకు ఏదైనా కిరాణా స్టోర్‌లో యూపీఐ పేమెంట్స్ చేయాలంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాయంతో పేమెంట్ చేసుకునే సౌకర్యం కలగనుంది. అయితే ఇందుకోసం యూపీఐలలో ఎన్ఎఫ్సీ ఫీచర్‌ను తప్పని సరి త్వరలో మనం కొత్త రకం ఏటీఎంలను చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను వినియోగించి ఏటీఎం మెషిన్ నుంచి డబ్బుల్ని డ్రా చేయడం సర్వసాధారణం. ఇకపై అలాగే ఫోన్లో యూపీఐ ఐడీని ఉపయోగించి యూపీఐ ఏటీఎంలో డబ్బుల్ని స్కాన్ చేసి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్ కంపెనీ హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో అందుబాటులోకి రానుంది. -
యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం!
యూపీఐ ఖాతాదారులకు శుభర్తవార్త. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా యూపీఐ ద్వారా చేసే జరిపే కొన్ని ట్రాన్సాక్షన్లకు సంబంధించిన లావాదేవీల లిమిట్‌ను పెంచుతున్నట్లు తెలిపారు. తాజాగా, జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో రోజుకు రూ.25,000 నుంచి రూ.1లక్ష వరకు చేసుకునే అవకాశం ఉంది. తాజాగా, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్లలో హాస్పిటల్స్ బిల్స్, ఎడ్యుకేషన్ ఫీజులు సైతం ఉన్నాయి. ‘‘యూపీఏ ద్వారా జరిపే వివిధ రకాల ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యూపీఐ రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచాలని ప్రతిపాదించాం. ఈ నిర్ణయం ఎవరైతే వినియోగదారులు హాస్పిటల్స్, కాలేజీల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది’’ అని శక్తికాంత్ అన్నారు. ఈ-మ్యాన్‌డేట్ తప్పని సరి బ్యాంక్ ఖాతాదారులు కేబుల్ బిల్స్, మొబైల్ బిల్స్, ఓటీటీ సబ్‌స్కిప్షన్, ఇతర నిత్యవసరాలకు చెల్లింపులు జరుపుతుంటారు. వాటినే రికరింగ్ ట్రాన్సాక్షన్ అంటారు. సాధారంగా బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా ఈ రికరింగ్ పేమెంట్స్ లిమిట్ గతంలో నెలకు రూ.15,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని ఆర్బీఐ యోచిస్తుంది. అదే సమయంలో ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే కస్టమర్లు ‘ఈ- మ్యాన్‌డేట్’ తప్పని చేసింది. ఈ-మ్యాన్‌డేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఈ-మ్యాన్‌డేట్ ఫారమ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు ఈ- మ్యాన్‌డేట్ ఆన్లైన్ ఎస్బీఐ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూపించిన వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఈ -మ్యాన్‌డేట్ కోసం తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ తప్పని సరి .ఈ విధానంలో బ్యాంక్ అడిగిన వివరాల్ని ఖాతాదారులు అందించాల్సి ఉంటుంది. అనంతరం, రికరింగ్ పేమెంట్స్‌ను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు. చదవండి👉 నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్ సైతం -
కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే పేమెంట్ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది. -
యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!
యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడమే మర్చిపోయారు. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనాలన్నా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన ప్రాసెస్ కూడా. అయితే ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ప్రకారం వాడకంలో లేని.. లేదా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఫోన్‌పే, గూగుల్ పేకి మాత్రమే కాకుండా పేటీఎమ్ వంటి ఇతర పేమెంట్స్ యాప్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. ఒక సంవత్సరంకంటే ఎక్కువ రోజులు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను పూర్తిగా క్లోజ్ చేయాలని సంబంధిత సంస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో 2023 డిసెంబర్ 31 నాటికి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలనీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? వినియోగదారులు లేదా ఖాతాదారులు మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో.. అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే.. వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వినియోగంలో లేని ఐడీలను డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని ధ్రువీకరించింది. -
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
యూపీఐ లైట్ ఎక్స్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తోంది?
what is upi lite x and how does it work : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023 లో యూపీఐ లైట్ ఎక్స్ అనే కొత్త యూపీఐ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ కొత్త యూపీఐ టెక్నాలజీతో వ్యాపారులు, కస్టమర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్నా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తున్న యూపీఐ పేమెంట్స్‌లో మరో టెక్నాలజీ పరంగా మరో అడుగు ముందుకు వేసింది. యూపీఐ లైట్ ఎక్స్ వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో దేశంలో చెల్లింపులకు ప్రధాన వనరుగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విస్తరణకు ఈ విప్లవాత్మక సాంకేతికత మార్గం సుగమం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ లైట్ గత ఏడాది ఆర్బీఐ పరిధిలో ఉన్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ncpi) యూపీఐ లైట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ విధానంతో యూపీఐ పిన్ అవసరం లేకుండా రూ.200 పేమెంట్స్ చేసుకునే వెసలు బాటు కల్పించ్చింది. తర్వాత ఆ మొత్తాన్ని రూ.500కి పెంచింది. యూపీఐ లైట్ ఎక్స్ అంటే ఏమిటి? యూపీఐ టెక్నాలజీ దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉంది. అయితే, ఇంటర్నెట్ సదుపాయాలు లేని పల్లెల్లో యూపీఐ పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా కేంద్రం యూపీఐ లైట్ ఎక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు జరిపేందుకు వీలుకలగనుంది. ఈ సదుపాయంతో మీరు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు డబ్బును పంపవచ్చు లేదంటే రిసీవ్ చేసుకోవచ్చు. కాగా, యూపీఐ లైట్ ఎక్స్ కింద వినియోగదారుడు ఎంత వరకు పంపవచ్చనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
యూపీఐ ట్రాన్సక్షన్స్.. ఆగస్టులో అన్ని లక్షల కోట్లా?
ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్‌కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్‌ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్‌లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్‌కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్‌మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్‌మన్ కు ఉంటుంది. అంబుడ్స్‌మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్‌కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్‌లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్‌లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా!
నోట్ల రద్దు, కరోనా దెబ్బకు పరిస్థితులు మారడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపారు. అందుకు నిదర్శనంగా ఇటీవల డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవడం. అయితే అటు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ప్రజలు ఇటు నగదు వినియోగంపై ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేతిలో నగదు నిల్వకు కూడా ప్రాధాన్యమిస్తునన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద రికార్డ్ స్థాయిలో నగదు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వామ్మె అంత నగదు ఉందా! నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా 2016 నాటికి నవంబర్ నాటికి ప్రజల వద్ద రూ.17.70 లక్షల కోట్లు ఉండగా.. ఇటీవల ఆ వాటా అది 71 శాతం వరకు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. సాధారణ వ్యాపార లావాదేవీలు, వస్తువులు సేవల కోనుగోలు కోసం వినియోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. కాగా చెలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో అవినీతితో పాటు నల్లధనం (బ్లాక్ మనీ) తగ్గించడమే లక్ష్యంగా అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం! -
బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్ ఏంటీ స్పీడ్!
పేటీఎం.. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం కస్టమర్లకు అనుగుణంగా సేవలందిస్తు తన వ్యాపారాంలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మొదట్లో డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పేటీఎంలో ఇటీవల మరికొన్ని సేవలతో పాటు బ్యాంకుల తరహాలో లోన్ సదుపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్యాంకులే షాక్ తినేలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది పేటీఎం. వన్ కమ్యూనికేషన్స్(One97 communications) మాతృసంస్థగా పనిచేస్తున్న పేటీఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం రుణ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సేవలను ప్రారంభించిన కొత్తలో కొన్ని అవాంతరాలు ఎదురైన వాటిని తట్టుకుని తగ్గేదేలే అన్నట్లుగా రుణ వితరణ రంగంలో తాజాగా భారీ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్‌ను అనేక రెట్లు పెంచుకుంది. కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరులో రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. పేటీఎం నివేదికలో.. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో వెలువడిన ఫలితాల పరంగా.. గతేడాది పోలిస్తే ఈ సారి పంపిణీ చేసిన మొత్తం రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంలో ఈ సంఖ్య 28.41 లక్షలు ఉండగా ఈ సారి 92 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. అదే క్రమంలో Paytm ద్వారా పంపిణీ చేసిన లోన్ల విలువ.. గత సెప్టెంబరు 2021 త్రైమాసికంలో రూ. 1,257 కోట్లు ఉండగా, ప్రస్తుతం సెప్టంబర్లో ఆరు రెట్లు పెరిగి రూ.7,313 కోట్లకు చేరుకుంది. నెలవారీ వృద్ధి చూస్తే కంపెనీ ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
రూ. 11 లక్షల కోట్లకు చేరిన యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా సెప్టెంబర్‌లో జరిగిన పేమెంట్ల విలువ రూ. 11 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. 678 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మే నెలతో పోలిస్తే (రూ. 10,41,506 కోట్లు) జూన్‌లో యూపీఐ డిజిటల్ పేమెంట్లు రూ. 10,14,384 కోట్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ జూలైలో రూ. 10,62,747 కోట్లకు పెరిగాయి. ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల విలువ చేసే 657.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తాజా గా పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్‌లో ఇటు విలువపరంగా అటు పరిమాణంపరంగా యూపీఐ సరికొత్త రికార్డులు నమోదు చేయొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
డబ్బులు వద్దు.. డిజిటల్ ముద్దు
సాక్షి రాయచోటి: జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్‌ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. మార్కెట్లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి పెద్ద కారణంగా చెప్పవచ్చు. అన్నిచోట్ల ఆన్లైన్ లావాదేవీలు కాలంలో ఎంత మార్పు అంటే ఏకంగా దుకాణంలో టీ తాగాలన్నా కూడా జనాలు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చిన్నపాటి వ్యాపారులు కూడా డిజిటల్ విధానానికి అలవాటు పడుతున్నారు.. మామిడిపండ్ల బండి మొదలుకుని చివరకు గంపలపై పండ్లు పెట్టుకుని అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారులు కూడా ఫోన్‌పే అంటున్నారు. సమయానికి చిల్లర లేకపోయినా, అత్యవసరంగా మందులు కావాల్సి వచ్చినా.. చేతిలో డబ్బుల్లేకున్నా.. ఇంటి ముందుకు సరుకులొస్తున్నాయి అంటే కారణం డిజిటల్ లావాదేవీలేనని చెప్పక తప్పదు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు సులభంగా చేసేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ విధానం కొనసాగుతున్నా కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం పెరిగింది. కరోనా విజృంభించిన తరుణంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు విపరీతంగా మొగ్గు చూపారు. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్‌ల సాయంతో ప్రజలు ఆన్లైన్ లావాదేవీలను సులభంగా చేస్తున్నారు. తక్కువ పరిధిలో సురక్షితమైన చెల్లింపులు జరుగుతుండటంతో వీటికి ఆదరణ లభిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, పెట్రోలు తదితర సామగ్రి మొదలు మొబైల్, డీటీహెచ్ రీచార్జిలు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, రుణాల చెల్లింపులు, నగదు బదిలీలు తదితర అవసరాలన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు. యువత సాంకేతికతను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్ రీచార్జి మొదలు, షాపింగ్, వినోదం, నిత్యావసరాలు, బిల్లులు తదితర అవసరాలన్నింటికి యువత డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్యాంకులలో డిజిటల్కే ప్రాధాన్యం జిల్లాలో బ్యాంకుల్లో కూడా ఎక్కడచూసినా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా నేరుగా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా కూడా వెసులుబాటు ఉంది. సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి జిల్లాలో ఖాతాదారులు బ్యాంకులు మొదలుకొని బయట కూడా డిజిటల్ లావాదేవీలే చేపట్టాలి. అయితే సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి. కొంతమంది నకిలీ వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలు, పిన్ నంబర్లు అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. అలా అడిగారంటే వెంటనే కట్ చేసి బ్యాంకులో సంప్రదించాలి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గించి ఆన్లైన్ ద్వారా చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. – దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్, కడప. -
పేటీఎం చెల్లింపులు ఇక మరింత భద్రం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సేవల్లోని వన్97 కమ్యూనికేష న్స్ (పేటీఎం) జూన్ 30 నాటికి వీసా, మాస్టర్ కార్డ్, రూపేకు సంబంధించి 2.8 కోట్ల కార్డుల టోకెనైజేషన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై పూర్తి చేసినట్టు ప్రకటించింది. పేటీఎం యాప్‌పై యాక్టివ్‌గా ఉన్న కార్డుల్లో 80 శాతం కార్డుల టోకెనైజేషన్ ముగిసినట్టు తెలిపింది. చెల్లింపుల వ్యవస్థ మరింత భద్రంగా, సురక్షితంగా చేసే లక్ష్యంతో తీసుకొచ్చిందే టోకెనైజేషన్. ఈ విధానంలో అసలైన కార్డు వివరాలను ప్రత్యామ్నాయ రీడింగ్ కోడ్ (దీన్నే టోకెన్‌గా పిలుస్తున్నారు)తో భర్తీ చేస్తారు. అసలైన కార్డు వివరాలతో లావాదేవీలు జరగవు కనుక మోసాలకు అవకాశం ఉండదు. పీవోఎస్‌లు, క్యూఆర్ కోడ్ చెల్లింపులు ఈ టోకెనైజేషన్ విధానంలో జరుగుతున్నాయి. కార్డు, టోకెన్ కోసం అభ్యర్థించిన సంస్థ (మర్చంట్), గుర్తింపు డివైజ్ (మర్చంట్లు వినియోగించే) కలగలసి ఈ కోడ్ ఉంటుంది. దీన్నే టోకెనైజేషన్‌గా పేర్కొంటారు. ‘‘సురక్షిత, భద్రతతో కూడిన ఆన్లైన్ చెల్లింపులకు పేటీఎం కట్టుబడి ఉంది. ఈ దిశగా ఆర్బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్ అన్నది పరిశ్రమకు కీలకమైన మైలురాయి వంటిది. కార్డులను టోకెనైజేజ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి, పేటీఎం యాప్‌పై అమ లు చేశాం’’అని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటన విడుదల చేశారు. చదవండి: ష్.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్ మహీంద్రా -
డిజిటల్ మోసాలతో జాగ్రత్త..
న్యూఢిల్లీ: ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఇందుకోసం పాటించతగిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరికీ ఎప్పుడూ పాస్వర్డ్లు వెల్లడించరాదని, తమ పరికరాల్లో ’ఆటో సేవ్’, ’రిమెంబర్ (గుర్తుపెట్టుకో)’ ఆప్షన్లను డిజేబుల్ చేయడం ద్వారా డివైజ్‌లో కీలక వివరాలు ఉండకుండా చూసుకోవాలని సూచించింది. ఖాతాదారులు తమ డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ చెల్లింపులు, సోషల్ మీడియా సెక్యూరిటీకి సంబంధించి అన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలని ఎస్బీఐ పేర్కొంది. సంక్లిష్టమైన, విశిష్టమైన పాస్వర్డ్ ఉపయోగించాలని, తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. ‘ఎన్నడూ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్లు లేదా పిన్ నంబర్లను డివైజ్‌లో భద్రపర్చుకోవడం లేదా రాసిపెట్టుకోవడం, ఎవరికైనా చెప్పడం లాంటివి చేయొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఎన్నడూ మీ యూజర్ ఐడీ/పాస్వర్డ్లు/కార్డ్ నంబరు/పిన్/సీవీవీ/ఓటీపీ వంటి వివరాలు అడగదు‘ అని ఎస్బీఐ పేర్కొంది. మార్గదర్శకాల్లో మరిన్ని.. ► ఆన్లైన్ లావాదేవీల్లో భద్రత కోసం బ్యాంక్ వెబ్సైట్ అడ్రెస్లో ’https’ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వై–ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవద్దు. లావాదేవీ పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ అవ్వాలి. బ్రౌజర్‌ను మూసివేయాలి. ► యూపీఐ లావాదేవీలకు సంబంధించి మొబైల్ పిన్, యూపీఐ పిన్ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ► గుర్తు తెలియని యూపీఐ అభ్యర్థనలకు స్పందించవద్దు. ఇలాంటి వాటిని తక్షణమే బ్యాంకు దృష్టికి తీసుకురావాలి. నగదును పంపేందుకు మాత్రమే పిన్ అవసరం, అందుకునేందుకు అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ► కస్టమర్లు తమకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగిందని గుర్తిస్తే వెంటనే తమ ఖాతా నుండి యూపీఐ సర్వీసును డిజేబుల్ చేయాలి. ► ఏటీఎం మెషీన్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజ్‌ల దగ్గర లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ► ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, పీవోఎస్, ఏటీఎం మెషీన్లలో లావాదేవీలకు సంబంధించి పరిమితులు సెట్ చేసి ఉంచుకోవాలి. ► మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ విషయానికొస్తే కస్టమర్లు పటిష్టమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. తమ ఫోన్లు మొదలైన వాటిల్లో వీలైతే బయోమెట్రిక్ ధ్రువీకరణను ఉపయోగించాలి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎవరికైనా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం వెల్లడించడం లేదా వ్యక్తిగత వివరాలను చర్చించడం వంటివి చేయొద్దు. -
Alert: జనవరి 1నుంచి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్!
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. చేసిన మార్పులు జనవరి 1 నుంచి అమలవుతాయని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వినియోగదారులు చేసిన మార్పులకు అనుగుణంగా ట్రాన్సాక్షన్ లు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి జరిపే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో కార్డ్,వ్యక్తిగత వివరాలు, సీవీపీ నెంబర్‌ను ఎంటర్ చేసే పనిలేకుండా టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోకనైజేషన్ అంటే ఏమిటీ? ఆ టోకనైజేషన్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం. టోకనైజేషన్ అంటే ? వినియోగదారుల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ట్రాన్సాక్షన్ జరిపే సమయంలో కార్డ్ వివరాలు సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్ గా ఉంచే వ్యవస్థనే టోకెన్ అంటారు. ట్రాన్సాక్షన్ చేసే సమయంలో వినియోగదారుడు 16 అంకెల కార్డ్ నెంబర్‌ను ఎంట్రి చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ తెచ్చిన టోకనైజేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్ వివరాలు, సీవీవీ నెంబర్లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. టోకనైజేషన్ కార్డ్ ఎలా పొందాలి? ►ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ►ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ► ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి. ►తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది చదవండి: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి -
హ్యాకర్ల ఆట కట్టించండి, ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్
కోవిడ్ -19 కారణంగా ఆన్లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్‌లో లాగినై కుటుంబసభ్యులకు, స్నేహితులకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. మోడస్ ఒపేరంది(modus operandi) లేదంటే ఫిషింగ్ అటాక్స్ చేసి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కొన్ని వేల మంది సైబర్ దాడులకు గురవుతున్నారు. సైబర్ నేరస్తులు దాడులు చేసే విధానం అయితే ఇలాంటి సైబర్ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందుగా సైబర్ దాడులు ఎలా జరుగుతాయని విషయాల్ని తెలుసుకుందాం. ►ముందస్తుగా సైబర్ నేరస్తులు బాధితుల బ్యాంక్ అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఓటీపీలను దొంగిలిస్తారు. ► వాటి సాయంతో సేమ్ అఫిషియల్ బ్యాంక్ ఈమెల్ తరహాలో బ్యాంక్ హోల్డర్లకు జీమెయిల్ నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తారు. ► బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఎలా స్పామ్ ఫోల్డర్లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్ సైతం అలాగే స్పామ్‌లోకి వెళతాయి. ► ఆ మెయిల్స్‌లో ఓ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. ► ఆ లింక్ క్లిక్ చేసి అందులో యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ► ఇలా చేయడానికి రివార్డ్ పాయింట్లను ఎరగా వేస్తారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ► ముందుగా మీ ఈ మెయిల్ లోని వెబ్సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు. ► https: // లో 's' ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది. ► నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్ చేసే మెయిల్స్ ఇలా ఉంటాయి. ► మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే, లింక్‌లపై క్లిక్ చేయవద్దు ► ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్/పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అందించవద్దు. ► ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్‌వర్డ్‌లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. చివరిగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్‌లు,పాస్వర్డ్లు మీ రహస్యం.మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేసి ఓటీపీ అడిగితే మోసం చేస్తున్నారని గుర్తించాలి. పై టిప్స్‌ను, సూచనల్ని పాటించి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండండి. -
సంక్షోభంలోనూ రికార్డ్‌లు, రూ.6.50 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్
కరోనా సంక్షోభంలోనూ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల విలువ రూ.6.50 లక్షల కోట్లకు చేరింది. ఒక్క సెప్టెంబర్‌లోనే రూ.365 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్సీపీఐ) ఎండీ దిలీప్ అస్బే తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ అస్బే మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి , లాక్ డౌన్ కారణంగా బ్యాంక్‌లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో యూపీఐ పేమెంట్స్ పెరిగేందుకు దోహదపడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2021 జనవరి నెల ప్రారంభ సమయంలో 52 శాతంతో యూపీఐ పేమెంట్స్ రూ.4.31లక్షల కోట్లు చేరుకోగా..నెల ముగిసే సమయానికి 58 శాతం పెరిగి రూ.230కోట్ల మేర యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు వెల్లడించారు. ‘యూపీఐ లావాదేవీల విలువ దేశంలో వార్షిక ప్రాతిపదికన రూ.74.34 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నాం. గతేడాది మొత్తం డిజిటల్ పేమెంట్స్ సంఖ్య 5,500 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఇది 7,000 కోట్లు ఉండొచ్చు. ఈ వ్యవస్థలో నెలకు 30 కోట్ల యాక్టివ్ కస్టమర్లు ఉన్నారని అంచనా. ఇందులో యూపీఐ వాటా 20 కోట్లు. దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా వర్తకులు డిజిటల్ విధానంలో పేమెంట్లు చేస్తున్నట్లు దిలీప్ అస్బే చెప్పారు. ప్రారంభంలో అలా.. ఇప్పుడు ఇలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏప్రిల్11,2016 నుంచి యూపీఐ పేమెంట్స్ ప్రారంభమయ్యాయి. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తొలి ప్రారంభ నెల నుంచి ఇప్పటి వరకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2016 ఏప్రిల్ నెల నుంచి ట్రాన్సాక్షన్లు కోట్లతో ప్రారంభం కాగా 2020 సెప్టెంబర్ నెలకు రూ.3 లక్షల కోట్లుకు చేరింది. ఆ నెంబర్ డబుల్ త్రిబులై జులై 2021కి రూ.6లక్షల కోట్లతో రికార్డ్లను క్రియేట్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు చెబుతున్నాయి. చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్ -
అలర్ట్: యోనో యాప్ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే
కరోనా కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) యాప్ యోనోలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను పెంచి, వినియోగదారుల అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు ఎస్బీఐ యోనో యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్లు చేస్తుంది.తాజాగా వినియోగదారుల భద్రతే లక్ష్యంగా యోనోలైట్ యాప్‌లో 'సిమ్ బైండింగ్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. Now online banking is more secure than ever with SBI! Download the latest YONO Lite app now: https://t.co/uP7JXenNsP #YONOLite #YONO #OnlineBanking #SafeBanking #BeSafe pic.twitter.com/lsLluyYXoq — State Bank of India (@TheOfficialSBI) July 27, 2021 'ఇప్పుడు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ గతంలో కంటే మరింత సురక్షితం! సరికొత్త యోనో లైట్ యాప్‌ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి' అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. సిమ్ బైండింగ్ ఫీచర్ వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో ఒక యూజర్‌కి మాత్రమే అనుమతి ఉంది. యూజర్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో కాకుండా వేరే నెంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేసి లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతి లేదు. యోనో లైట్ యాప్‌లో రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం ►ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుండి ఎస్బీఐ యోనో లైట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి ►యాప్ ఓపెన్ చేసిన తరువాత ఎస్బిఐలో సిమ్ 1 లేదా సిమ్ 2 ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఒకే సిమ్ ఉంటే సిమ్ సెలక్షన్ అవసరం లేదు. ► అనంతరం మొబైల్ నంబర్ కన్ఫాం కోసం ఓటీపీ అడుగుతుంది. ►ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది ►ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మీ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ►అనంతరం కండీషన్స్‌కు ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ►దీంతో మరో సారి మీ నెంబర్‌కు యాక్టివేషన్ ఓటీపీ వస్తుంది. ►ఆ ఓటీపీని ఎంటర్ చేసి యోనోలైట్ యాప్‌ను వినియోగించుకోవచ్చు. చదవండి: Cryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్ చేయడం లేదు -
ఆశ పడ్డారా.. అంతా గోవిందా!
శ్రీకాకుళం: కోటి రూపాయల లాటరీ అని మెసేజ్ వస్తుంది. మీ నంబర్ మా లక్కీ డ్రాలో ఎంపికైందని కాల్ వస్తుంది. అకౌంట్ నంబర్ చెప్తే డబ్బులు పంపిస్తామని తీయటి కబురొకటి వస్తుంది.. ఆశ పడ్డారా..? అంతా గోవిందా. ఆన్లైన్ మోసాలు మితిమీరిపోతున్నాయి. మెసేజీలు, కాల్స్ రూపంలో ఖాతాలు ఖాళీ చేయడానికి చోరులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. అప్రమత్తంగా ఉంటే ఈ మోసాల నుంచి బయటపడవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సమాచార తస్కరణ ఏదైనా ఒక సైబర్ నేరం చేయాలంటే మన వ్యక్తిగత సమాచారం అవతలి వ్యక్తికి చాలా అవసరం. ఇలాంటి సమాచారాలను మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించడం ఇప్పుడు ఎక్కువైంది. ఈ విధంగా సేకరించిన సమాచారం ఉపయోగించి ఆర్థిక మోసాలకు, నేరాలకు పాల్పడటం, ఆ వ్యక్తి పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేసి బ్లాక్మెయిల్ చేయటం వంటివి ప్రధానంగా ఉన్నాయి. చోరులు అవలంబించే పద్ధతులు ►సైబర్ నేరగాడు చాలా ఓర్పుగా అవతలి వ్యక్తితో మాట్లాడతాడు. మన బలహీనతలను గుర్తించి కావాల్సిన సమాచారం రాబడతాడు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నంబర్లు, గడువు తేదీ, సీవీవీ కోడ్, ఓటీపీ వంటివి సేకరించి బ్యాంక్ ఖాతా నుంచి సొమ్మ కాజేస్తాడు. కొన్ని సార్లు సమాచారం పొందేందుకు తను పంపించే లింక్ ఓపెన్ చేసేలా ప్రేరేపించి తన పని కానిస్తాడు. ►మెయిల్, ఎస్ఎంఎస్ పంపించటం, లింక్‌లు పంపించటం, బ్యాంక్, కస్టమర్ కేర్ ప్రతినిధులమని ఫోన్ చేసి మోసం చేస్తుంటారు. డెబిట్, క్రెడిట్ కార్డు క్లోనింగ్ విధానంలో స్కిమ్మర్ అనే చిన్న ఎల్రక్టానిక్ సాధనం ఉపయోగించి డెబిట్, క్రిడిట్ కార్డు వెనుక వైపు ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్‌లో ఉన్న కార్డు సమాచారాన్ని అక్రమంగా దొంగలిస్తారు. ►సైబర్ నేరగాళ్లు కీలోగ్గెర్స్ అనే సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరికరాన్ని ఉపయోగించి ఈ–కామర్స్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్, మెయిల్ సర్వీసెస్ వంటి వాటిలో మన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను తెలుసుకుంటారు. మనం కంప్యూటర్‌పై టైప్ చేసే ప్రతి కీస్ట్రోక్, చాట్స్, స్క్రీన్ షాట్లను రికార్డు చేసి ఆ కాని్ఫడెన్షియల్ డాటాను తీసుకుంటారు. ఇలాంటివి సాధారణంగా ఇంటర్నెట్ కేఫ్ సెంటర్లు, స్మార్ట్ ఫోన్ సరీ్వసింగ్ సెంటర్లలో జరుగుతుంటాయి. ఫోన్ రిఫేర్ చేసే వ్యక్తి సెల్ఫోన్లో ఉన్న సమాచారం, ఫొటోలు సేకరించి సైబర్ సంబంధిత నేరాలు చేసేందుకు ఉపయోగించే అవకాశం ఉంది. ►ఫ్రీ పబ్లిక్ వైఫై, ఫ్రీ నెట్వర్క్, హాట్స్పాట్లు వాడటం వల్ల కూడా డేటా, వ్యక్తిగత సమాచారం సేకరించే ప్రమాదం ఉంది. ఇలాంటి నెట్‌వర్క్‌ల్లో ఉంటే అన్ సెక్యూరిటీని ఉపయోగించి సైబర్ నేరస్తులు మన సున్నితమైన, పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారంతో పాటు పాస్‌వర్డ్‌లను సేకరిస్తుంటారు. ఎలా మెలగాలి..? ►బ్యాంక్, ఫైనాన్షియల్, కస్టమర్ కేర్ ప్రతినిధులమని ఎరైనా ఫోన్ చేసినా మాట్లాడకూడదు. ఈ–మెయిల్, ఎస్ఎంఎస్లు పంపించినా వాటిని ఓపెన్ చేయకూడదు. ఓటీపీలు, పాస్వర్డ్లు, కార్డు నంబర్లు, గడువు తేదీలు నమోదు చేయవద్దు, ఫోన్ చేస్తే వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను భద్రంగా రక్షించుకోవాలి. ►ఓపెన్, పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లకు ఎప్పుడూ కనెక్టు కావద్దు. ►సెల్‌ఫోన్ రిఫేర్‌కు ఇచ్చేటప్పుడు సిమ్‌కార్డు, మెమొరీ కార్డులను తీసివేయాలి. ఫోన్ మెమొరీ పూర్తిగా డిలీట్ చేయాలి. సోషల్ మీడియా వంటివి లాగ్ అవుట్ కావాలి. ►బాగా నమ్మకం ఉన్న వారికే రిఫేర్‌కు ఇవ్వాలి. ►ఇంటర్నెట్లో దొరికే సాఫ్ట్వేర్లను ఎప్పుడు ఇన్స్టాల్ చేయకూడదు. లేటెస్ట్ యాంటీ వైరస్‌తో అప్డేట్ చేసి ఉంచుకోవాలి. -
ఆన్లైన్ చెల్లింపులకే సై
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ ఆరి్థక లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని నాబార్డ్ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. కోవిడ్–19 లాక్డౌన్, ఆ తరువాత ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధికమంది నగదు లావాదేవీలు, కార్యకలాపాలకు డిజిటల్, ఆన్‌లైన్‌లనే ఎంచుకున్నారు. 2019 డిసెంబర్లో జరిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి. గతంలో పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి సమయంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్లో ఆర్థిక కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికన్నా ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్‌తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రిటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్ నివేదికలో పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్లైన్ చెల్లింపులు విస్తరిస్తున్నాయని తెలిపింది.