what is upi lite x and how does it work : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 లో యూపీఐ లైట్ ఎక్స్ అనే కొత్త యూపీఐ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ కొత్త యూపీఐ టెక్నాలజీతో వ్యాపారులు, కస్టమర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్నా పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పేమెంట్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తున్న యూపీఐ పేమెంట్స్‌లో మరో టెక్నాలజీ పరంగా మరో అడుగు ముందుకు వేసింది. యూపీఐ లైట్ ఎక్స్ వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో దేశంలో చెల్లింపులకు ప్రధాన వనరుగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విస్తరణకు ఈ విప్లవాత్మక సాంకేతికత మార్గం సుగమం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూపీఐ లైట్
గత ఏడాది ఆర్‌బీఐ పరిధిలో ఉన్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ncpi) యూపీఐ లైట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ విధానంతో యూపీఐ పిన్ అవసరం లేకుండా రూ.200 పేమెంట్స్ చేసుకునే వెసలు బాటు కల్పించ్చింది. తర్వాత ఆ మొత్తాన్ని రూ.500కి పెంచింది.
యూపీఐ లైట్ ఎక్స్ అంటే ఏమిటి?
యూపీఐ టెక్నాలజీ దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉంది. అయితే, ఇంటర్నెట్ సదుపాయాలు లేని పల్లెల్లో యూపీఐ పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా కేంద్రం యూపీఐ లైట్ ఎక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు జరిపేందుకు వీలుకలగనుంది. ఈ సదుపాయంతో మీరు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు డబ్బును పంపవచ్చు లేదంటే రిసీవ్ చేసుకోవచ్చు. కాగా, యూపీఐ లైట్ ఎక్స్ కింద వినియోగదారుడు ఎంత వరకు పంపవచ్చనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment